Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
Virat Kohli | భారత స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ గురించి పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. తాజాగా విరాట్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. 2027 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడడంపై, తన భవిష్యత్తుపై కోహ్లీ చేసిన వ్యాఖ్యలు బీసీసీఐ, టీమ్ మేనేజ్‌మెంట్‌కు పరోక్ష హెచ్చరికలుగా భావిస్తున్నారు. దేశం కోసం వరల్డ్‌కప్ ఆడడ గర్వకారణమేనని.. గౌరవం, నమ్మకం రెండు వైపులా ఉండాలంటూ కోహ్లీ చేసిన వ్యాఖ్చలతో చర్చ నడుస్తోంది. ఆర్‌సీబీ పోడ్కాస్ట్‌లో మాట్లాడిన కోహ్లీ.. “నేను ఎప్పుడూ ఆడేందుకు సిద్ధంగానే ఉంటాను. ఫిట్‌నెస్, ఆహారం, ప్రాక్టీస్ అన్నీ నా జీవితంలో భాగం. సిరీస్‌కు ముందు రెండు వారాలు మాత్రమే సిద్ధమయ్యే ఆటగాడిని కాదు. ఏడాది పొడవునా అదే క్రమశిక్షణతో ఉంటాను. అందుకే ఎప్పుడైనా పిలిస్తే సిద్ధంగా ఉంటాను” అని పేర్కొన్నాడు.
వరల్డ్ కప్ ఆడడం గొప్ప అనుభూతే..
2027 వరల్డ్‌కప్‌పై తరచూ ప్రశ్నలు వస్తున్నాయని పేర్కొన్న కోహ్లీ.. “ఇప్పుడు 2026 సంవత్సరం నడుస్తోంది. అయినా ‘2027 వరల్డ్‌కప్ ఆడతావా?’ అని అడుగుతూనే ఉన్నారు. నాకు సమాధానం తెలుసు. నేను ఆడాలనుకుంటేనే బ్యాగులు సర్దుకుని బయల్దేరుతాను కదా. భారత్ తరఫున వరల్డ్‌కప్ ఆడటం గొప్ప అనుభూతి. కానీ గౌరవం, ప్రాధాన్యత రెండూ ఇరువైపులా ఉండాలి” అంటూ స్పష్టం చేశారు. “నేను ఉన్న వాతావరణానికి విలువ చేకూర్చగలనని, ఆ వాతావరణం కూడా నాపై నమ్మకం ఉంచితేనే కొనసాగుతాను. కానీ, ప్రతిసారి నా విలువ, నా అవసరం నిరూపించుకోవాల్సి వస్తే అక్కడ ఉండాలని అనిపించదు” అంటూ వ్యాఖ్యానించాడు.
పదే పదే ప్రశ్నించడం సరికాదు..
ఇంకా మాట్లాడుతూ.. ఆట విషయంలో తాను పూర్తిగా నిజాయితీగా ఉంటానని తెలిపాడు. క్రికెట్ తనకు ఎంతో ఇచ్చిందని, దానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానన్నాడు. ఈ సందర్భంగా ఓ ఉద్యోగిని ఉదాహారణగా చూపుతూ.. ఒకసారి ‘నువ్వే మా వ్యక్తి’ అని చెప్పి, మళ్లీ మళ్లీ అదే వ్యక్తిని ప్రశ్నించడం సరైంది కాదని తెలిపాడు. మొదటి రోజే ‘నీ అవసరం లేదు’ అంటే విషయం స్పష్టంగా ఉంటుంది. కానీ ఒకవైపు నమ్మకం ఉందని చెబుతూ, మరోవైపు అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఫలితాల గురించే ఆలోచిస్తే స్థిరమైన మైండ్‌సెట్ ఉండదని చెప్పిన కోహ్లీ.. ఏ ఆటగాడు కూడా ప్రతిసారి తన ప్రదర్శనపై హామీ ఇవ్వలేడని.. కానీ నేను ఎంత కష్టపడతానో తనకు తెలుసునన్నాడు. తన జీవనశైలే అలాంటిదేనని చెప్పాడు.
రోకో భవిష్యత్‌పై ప్రశ్నలు..
ఇటీవల రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఇద్దరి భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇద్దరూ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వరల్డ్‌కప్‌లో ఇద్దరు ఆడుతారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోచ్ గౌతమ్ గంభీర్‌తో విభేదాలు ఉన్నాయన్న ప్రచారం సైతం జోరుగా సాగుతోంది. అయితే, దీనిపై ఇప్పటివరకు ఎవరూ బహిరంగంగా మాత్రం స్పందించలేదు. వన్డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీ రికార్డుల విషయానికి వస్తే.. 311 వన్డేల్లో 58.71 సగటుతో 14,797 పరుగులు చేశాడు. ఇందులో 54 సెంచరీలు, 77 హాఫ్ సెంచరీలున్నాయి. గత ఏడాది కూడా భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఏడాది మూడు వన్డేల్లోనే 240 పరుగులు చేసి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ తర్వాత జూన్ 14 నుంచి ప్రారంభమయ్యే అఫ్గానిస్థాన్‌తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్‌లో కనిపించే అవకాశం ఉంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






