త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Virat Kohli | అద్దె బ‌కాయిలు.. కోహ్లీ రెస్టారెంట్ మూసివేత‌

Virat Kohli | బెంగళూరు (Bengaluru)లో టీమ్‌ ఇండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి చెందిన వన్8 కమ్యూన్ (One8 Commune) రెస్టారెంట్ మూత‌ప‌డింది. అద్దె బకాయిలు (rent dues) చెల్లించకపోవడంతో కోర్టు ఆదేశాల మేర‌కు మూసివేశారు.

D

Cricket | Published On Apr 22, 2026, 11.55 am IST

Virat Kohli | అద్దె బ‌కాయిలు.. కోహ్లీ రెస్టారెంట్ మూసివేత‌
Advertisement

Virat Kohli | బెంగళూరు (Bengaluru)లో టీమ్‌ ఇండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి చెందిన వన్8 కమ్యూన్ (One8 Commune) రెస్టారెంట్ మూత‌ప‌డింది. చిన్న‌స్వామి స్టేడియం (Chinnaswamy Stadium) స‌మీపంలో ఉన్న ఈ రెస్టారెంట్‌ను దాదాపు రూ.2 కోట్లకు పైగా అద్దె బకాయిలు (rent dues) చెల్లించకపోవడంతో కోర్టు ఆదేశాల మేర‌కు మూసివేశారు. ఈ రెస్టారెంట్‌కు కోహ్లీ గ‌తంలో స‌హ‌య‌జ‌మానిగా ఉండేవారు. అయితే, రెస్టారెంట్ అద్దె బ‌కాయిలు, సేఫ్టీ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల వంటి కార‌ణాల‌తో కోహ్లీ తన బ్రాండ్ పేరును ఆ అవుట్‌లెట్ నుంచి ఉపసంహరించుకున్నారు.

ఇండియా టుడే క‌థ‌నం ప్ర‌కారం.. వన్ 8 కమ్యూన్ (One8 Commune) పబ్ నిర్వాహకులు ఫైర్‌ సేఫ్టీ ఉల్లంఘనకు పాల్పడినట్లు (Fire Safety Violations) బెంగళూరు బృహత్‌ మహానగర పాలిక అధికారులు ప‌దేప‌దే నోటీసులు పంపారు. అంతేకాదు, ఈ పబ్‌లో స్మోకింగ్ జోన్ లేకపోవడం, నిర్దేశిత సమయానికి మించి పనిచేయడం వంటి నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి అధికారులు ప‌లుమార్లు నోటీసులు జారీ చేశారు. ఈ ప‌బ్‌పై ఎఫ్ఐఆర్‌లు కూడా న‌మోదు చేశారు. ఇక అద్దె బ‌కాయిలు కూడా పేరుకుపోయాయి. ప‌బ్ నిర్వాహ‌కులు రూ.2కోట్ల అద్దె బ‌కాయి ప‌డిన‌ట్లు బిల్డింగ్ యజమాని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన కోర్టు బకాయిలన్నీ చెల్లించే వరకు రెస్టారెంట్‌ను మూసివేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల‌తో దీంతో వ‌న్ 8 క‌మ్యూన్‌ను నిర్వాహ‌కులు మూసివేశారు.

కాగా, ఈ ప‌బ్‌కు వ‌రుస కేసులు, నోటీసులు వ‌స్తుండ‌టంతో కోహ్లీ త‌న వ‌న్‌8 బ్రాండ్‌ను ఉప‌సంహ‌రించుకున్నారు. దీంతో క‌స్ట‌మ‌ర్ల సంఖ్య త‌గ్గింది. ఫ‌లితంగా వ్యాపారం భారీ న‌ష్టాల్లో కూరుకుపోయిన‌ట్లుగా తెలుస్తోంది. అందుకే గ‌త ఆరు నెల‌లుగా నిర్వాహ‌కులు అద్దె కూడా చెల్లించ‌లేద‌ని తెలిసింది. దీంతో బిల్డింగ్ య‌జ‌మాని కోర్టుకు ఆశ్ర‌యించిన‌ట్లు ఇండియా టుడే నివేదిక వెల్ల‌డించింది.

Also Read..

తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆల‌య త‌లుపులు.. హర హర మహాదేవ్ నామస్మరణలతో మార్మోగిన పుణ్య‌క్షేత్రం

ప‌హ‌ల్గామ్‌ దాడికి ఏడాది.. ఆ రోజు ఏం జ‌రిగిందంటే..?

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత

Advertisement

తాజావార్తలు

Advertisement