IPL 2026 Playoffs Schedule | ఐపీఎల్ ప్లే ఆఫ్ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ.. అహ్మదాబాద్‌లో 31న ఫైనల్..!
IPL 2026 Playoffs Schedule | బీసీసీఐ బుధవారం ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. లీగ్ దశ చివర దశకు చేరింది. ప్రస్తుతం టోర్నీకి కీలక దశకు చేరింది. ప్లేఆఫ్ బెర్త్ కోసం జట్ల మధ్య పోటీ తీవ్రంగా మారిన నేపథ్యంలో అందరి దృష్టి ప్లేఆఫ్ షెడ్యూల్‌పై పడింది. ఈ సారి ఫైనల్ వేదికను సైతం మారుస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
IPL 2026 Playoffs Schedule | బీసీసీఐ బుధవారం ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. లీగ్ చివర దశకు చేరింది. ప్రస్తుతం టోర్నీకి కీలక దశకు చేరింది. ప్లేఆఫ్ బెర్త్ కోసం జట్ల మధ్య పోటీ తీవ్రంగా మారిన నేపథ్యంలో అందరి దృష్టి ప్లేఆఫ్ షెడ్యూల్‌పై పడింది. ఈ సారి ఫైనల్ వేదికను సైతం మారుస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి తొలుత బెంగళూరులో ఫైనల్ నిర్వహించాలని నిర్ణజ్ఞించారు. చివరి నిమిషంలో వేదికను మార్చి అహ్మదాబాద్‌కు మార్చింది. మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
బీసీసీఐ వివరణ..
ఫైనల్ మ్యాచ్‌ను బెంగళూరు నుంచి తరలించడంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వివరణ ఇచ్చారు. స్థానిక క్రికెట్ సంఘం, పరిపాలన విధించిన షరతులు బీసీసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోవడంతో వేదిక మార్పు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే, ఈ నిర్ణయం ఇప్పుడు వివాదానికి దారితీసింది. టికెట్ల వివాదమే వేదిక మార్పుకు కారణమని ఆరోపణలున్నాయి. అసలు బెంగళూరు హోస్టింగ్ హక్కులు ఎందుకు కోల్పోయింది అన్నది ఇప్పటికీ మిస్టరీగానే మారింది. ఇది కేవలం పరిపాలనా నిర్ణయమా.. మరేదైనా అంతర్గత కారణాలు ఉన్నాయా అన్నది చిక్కుప్రశ్నగా మిగిలిపోయింది.
మూడు నగరాల్లో ప్లేఆఫ్స్
ఈసారి ఐపీఎల్ ప్లేఆఫ్స్ మూడు వేర్వేరు నగరాల్లో నిర్వహించనున్నారు. ఆపరేషనల్, లాజిస్టిక్ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. క్వాలిఫయర్-1 మ్యాచ్ ధర్మశాల వేదికగా మే 26న జరుగనుంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న క్వాలిఫయర్-1లో తలపడుతాయి. ఇందులో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. ఎలిమినేటర్ మ్యాచ్ మే 27న ముల్లాన్‌పూర్‌లోని న్యూచండీగఢ్ స్టేడియంలో జరుగుతుంది. మూడు, నాలుగో స్థానాల్లో నిలిచిన జట్లు తలపడుతాయి. గెలిచిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. క్వాలిఫయర్-2 మే 29న న్యూచండీగఢ్‌లోనే జరుగుతుంది. క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్ విజేత పోటీపడుతాయి. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ ఆడుతుంది. మే అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో
టైటిల్ పోరులో క్వాలిఫయర్-1, క్వాలిఫయర్-2 విజేత పోటీపడుతాయి.
వరుసగా రెండోసారి అహ్మదాబాద్‌లో ఫైనల్
గత సీజన్ ఫైనల్ కూడా అహ్మదాబాద్‌లోనే జరిగింది. ఆ మ్యాచ్‌లో ఆర్‌సీబీ పంజాబ్‌ను ఓడించి టైటిల్ గెలుచుకుంది. దీంతో వరుసగా రెండోసారి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ జరగనుంది. గత ఐదు సంవత్సరాల్లో అహ్మదాబాద్ నాలుగుసార్లు ఐపీఎల్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇచ్చింది. దీంతో ప్లేఆఫ్స్ దశలో జట్లు టాప్-2లో నిలిచి నేరుగా క్వాలిఫయర్-1కు చేరేందుకు పోటీ మరింత ఉత్కంఠగా మారింది.
🚨 News 🚨
BCCI Announces #TATAIPL 2026 Playoffs Schedule
Qualifier 1: Dharamshala
Eliminator and Qualifier 2: New Chandigarh
Narendra Modi Stadium, Ahmedabad to Host Grand Finale 🏟️
More Details ▶️ https://t.co/32HvsabiuF#KhelBindaas pic.twitter.com/ItrNUNoxHZ
— IndianPremierLeague (@IPL) May 6, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






