NASA | నాసా స్పేస్ వాక్ వాయిదా.. అనారోగ్యం బారిన పడిన వ్యోమగామి, భూమికి తరలింపు..
NASA | జనవరి 8వ తేదీన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అంతరిక్షంలో చేపట్టనున్న స్పేస్ వాక్‌ను వాయిదా వేస్తున్నట్లు తెలియజేసింది. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ISS) నుంచి నలుగురు వ్యోమగాములను తిరిగి భూమికి పంపిస్తున్నట్లు వెల్లడించింది. వారిలో ఒకరికి మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తినందున స్పేస్ వాక్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
NASA | జనవరి 8వ తేదీన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అంతరిక్షంలో చేపట్టనున్న స్పేస్ వాక్‌ను వాయిదా వేస్తున్నట్లు తెలియజేసింది. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ISS) నుంచి నలుగురు వ్యోమగాములను తిరిగి భూమికి పంపిస్తున్నట్లు వెల్లడించింది. వారిలో ఒకరికి మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తినందున స్పేస్ వాక్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే నలుగురిలో అత్యవసర వైద్య సహాయం అవసరం అయిన వ్యోమగామి పేరును మాత్రం ప్రైవసీ కారణాల వల్ల నాసా వెల్లడించలేదు. కానీ ఆ వ్యోమగామి ప్రాణాలకు ప్రమాదం లేదని, భూమికి పంపితే మెరుగైన చికిత్స అందించవచ్చనే ఉద్దేశంతోనే స్పేస్ వాక్‌ను వాయిదా వేసి ఆ వ్యోమగాములను తిరిగి వెనక్కి పంపిస్తున్నట్లు తెలిపింది.
ఆరోగ్య స్థితిలో మార్పు..
కాగా వ్యోమగాములను భూమికి పంపించేందుకు అవసరం అయిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నాసా తెలిపింది. మేరకు స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్‌ను వెనక్కి రప్పించేందుకు యత్నిస్తున్నామని నాసా తెలిపింది. కాగా ఐఎస్ఎస్ నుంచి జనవరి 8వ తేదీన షెడ్యూల్ ప్రకారం నాసా స్పేస్ వాక్‌ను నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో క్రూ-11లో భాగం అయిన వ్యోమగాములు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వారిలో మైక్ ఫింకీ, జెనా కార్డ్‌మన్ లు ఉండగా వారు స్పేస్ వాక్ వాయిదా పడేందుకు కొన్ని గంటల ముందు కూడా పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమం కోసం సన్నద్ధం అయ్యారు. అయితే మరో వ్యోమగామి ఆరోగ్య స్థితిలో వచ్చిన మార్పు కారణంగానే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. తమ మిషన్ కన్నా వ్యోమగాముల ఆరోగ్యం ముఖ్యమని నాసా వెల్లడించింది. అయితే అనారోగ్యానికి గురైన ఆ వ్యోమగామి వివరాలను గోప్యత దృష్ట్యా ప్రస్తుతానికి వెల్లడించడం లేదని నాసా తెలిపింది.
జనవరి 15కు వాయిదా..
నాసా సంస్థ ప్రపంచంలోని పలు ఇతర దేశాలతో కలిసి ఎంతో కాలంగా స్పేస్ వాక్‌ను నిర్వహిస్తోంది. ఈసారి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి యూఎస్ ఈవీఏ 94 అని నామకరణం చేశారు. ఇందులో అమెరికాతోపాటు జపాన్, రష్యా సైంటిస్టులు, వ్యోమగాములు భాగం అయ్యారు. ఈ క్రమంలో వారిందరితో నాసా క్రూ-11 అనే విభాగాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అందులో ఉన్న ఓ వ్యోమగామి ఆరోగ్యం దెబ్బ తిన్నది. అందువల్లే మిషన్‌ను వాయిదా వేశారు. ఆ సిబ్బంది స్పేస్ వాక్ కార్యక్రమంలో భాగంగా పలు ప్రయోగాలను నిర్వహిస్తారు. మైక్రో గ్రావిటీ, బయాలజీ, టెక్నాలజీ వంటి అంశాల్లో వారు తమ పరిశోధనలను కొనసాగిస్తారు. అయితే జనవరి 15వ తేదీన స్పేస్ వాక్‌ను మళ్లీ నిర్వహించేందుకు కార్యక్రమాన్ని మళ్లీ షెడ్యూల్ చేశామని నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్‌మన్ వెల్లడించారు.
Crew-11 (Dragon Endeavour) will return ahead of schedule due to a medical issue "in the coming days".https://t.co/aXlukWr97C pic.twitter.com/oIM8YhcrjF
— NSF - NASASpaceflight.com (@NASASpaceflight) January 8, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






