NASA Artemis-2 | మళ్లీ నాసా మూన్ మిషన్.. 53 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ తేదీన ప్రయోగం..!
NASA Artemis-2 | అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఆర్టెమిస్-2 మిషన్‌కు సంబంధించి ఒక కీలక ప్రకటన చేసింది. ఆర్టెమిస్ మిషన్‌లో మానవుడిని చంద్రుడిపైకి పంపాలనేది నాసా ప్రణాళిక. ఆర్టెమిస్-2 మిషన్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రయోగించే అవకాశం ఉన్నది.
International | Published On Jan 5, 2026, 5.34 pm IST
NASA Artemis-2 | అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఆర్టెమిస్-2 మిషన్‌కు సంబంధించి ఒక కీలక ప్రకటన చేసింది. ఆర్టెమిస్ మిషన్‌లో మానవుడిని చంద్రుడిపైకి పంపాలనేది నాసా ప్రణాళిక. ఆర్టెమిస్-2 మిషన్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రయోగించే అవకాశం ఉన్నది. నాసా చివరిసారిగా 53 సంవత్సరాల క్రితం 1972లో అపోలో-17 మిషన్‌తో చంద్రుడిపై కాలు మోపింది. ఆ తర్వాత ఇప్పటి వరకు అమెరికా మళ్లీ మూన్ మిషన్‌ను నిర్వహించలేదు. తాజాగా చేపట్టనున్న మిషన్ పది రోజులు కొనసాగుతుంది.
నాసా ఈ మిషన్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 5 లేదంటే 6న ప్రయోగించే ఛాన్స్ ఉంది. ఏదైనా ఆలస్యమైతే ఏప్రిల్‌లో ప్రయోగం చేపటనున్నది. ఈ మిషన్ ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌స్టేషన్‌లోని లాంచ్ కాంప్లెక్స్ 39బీ నుంచి ప్రయోగించనున్నది. అపోలో మిషన్లను సైతం ఇదే లాంచ్ ప్యాడ్ నుంచి నాసా చేపట్టింది. ఈ మిషన్ స్పేస్ లాంచ్ సిస్టమ్ (SLS) అనే రాకెట్ బ్లాక్ 1 వెర్షన్‌ను ఉపయోగించనున్నది. ఎస్ఎల్ఎస్ రాకెట్ ఓరియన్ అంతరిక్ష నౌకను, వ్యోమగాములను, సరుకును చంద్రుడి వరకు చేర్చనున్నది. ఓరియన్ అని పిలిచే ఈ స్పేస్ షటిల్‌లో నలుగురు వ్యోమగాములు కూర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో అధునాతన రక్షణ వ్యవస్థలు, నావిగేషన్, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ ఉన్నది.
ఆర్టెమిస్-II మిషన్‌లో చంద్రుడిపైకి వెళ్లే మిషన్‌లో వ్యోమగాములుగా కెనడియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన మిషన్ స్పెషలిస్ట్ జెరెమీ హాన్సెన్, నాసాకు చెందిన మిషన్ స్పెషలిస్ట్ క్రిస్టీన్ కోచ్, నాసా పైలట్ విక్టర్ గ్లోవర్, నాసా కమాండర్ రీడ్ వైస్‌మాన్‌ను ఎంపిక చేసింది. ఈ నలుగురు వ్యోమగాములు ఆర్టెమిస్-2 మిషన్‌లో భాగమవుతారు. ఈ మిషన్ చంద్రుడి చుట్టూ కక్ష్యలో తిరిగి భూమికి వస్తుంది. ఈ మిషన్ సుమారు 10 రోజుల పాటు సాగుతుంది. ఈ స్పేస్ షటిల్ మాత్రం చంద్రుడిపైకి వెళ్లదు. చంద్రుడికి అత్యంత సమీప దూరం సుమారు 7,400 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి వస్తుంది.
ఓరియన్, ఎస్ఎల్ఎస్ అంతరిక్ష నౌకతోపాటు వ్యోమగాముల రక్షణ వ్యవస్థ, నావిగేషన్, ఇతర అంశాలను పరిశీలించడమే ఈ మిషన్ లక్ష్యం. నాసా వచ్చే ఏడాది ఆర్టెమిస్-3 చేపట్టనున్నది. దీనికి సన్నాహకంగానే ఈ మిషన్‌ను చేపడుతున్నది. ఈ మిషన్ చంద్రుడిపై శాశ్వత స్థావరం ఏర్పాటు చేయడం, అంగారకుడిపైకి వెళ్లేందుకు ఉపయోగకరంగా ఉంటుందని నాసా భావిస్తున్నది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






