CM Revanth Reddy | టెక్స్టైల్ మన డీఎన్ఏలోనే ఉంది.. తెలంగాణను దక్షిణాసియా టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దుదాం: సీఎం
Asian Textile conference | టెక్స్‌టైల్ (Textile) మన డీఎన్ఏ(DNA) లోనే ఉందని, 2047 నాటికి హైదరాబాద్‌ను దక్షిణాసియా టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. హైదరాబాద్ హైటెక్స్ (Hitex) నోవాటెల్ లో ఏర్పాటు చేసిన 13వ ఏషియన్ టెక్స్ టైల్స్ కాన్ఫరెన్స్ 2026 (ATEXCON) కి శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లలో వస్త్రాలను పరిశీలించారు.
- మీరు అతిథులు కాదు.. అభివృద్ధి భాగస్వాములు
- తెలంగాణలో నైపుణ్యంతో పాటు సంకల్పం ఉంది
- ప్రపంచానికి సరితూగే విధానాలున్నయ్
- రండి.. టెక్స్‌టైల్ ఎకోసిస్టమ్‌ను నిర్మిద్దాం
- ఏషియన్ టెక్స్‌టైల్ కాన్ఫరెన్స్‌లో పెట్టుబడిదారులకు సీఎం రేవంత్ పిలుపు
త్రినేత్ర.న్యూస్: టెక్స్‌టైల్ (Textile) మన డీఎన్ఏ(DNA) లోనే ఉందని, 2047 నాటికి హైదరాబాద్‌ను దక్షిణాసియా టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. హైదరాబాద్ హైటెక్స్ (Hitex) నోవాటెల్ లో ఏర్పాటు చేసిన 13వ ఏషియన్ టెక్స్ టైల్స్ కాన్ఫరెన్స్ 2026 (ATEXCON) కి శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లలో వస్త్రాలను పరిశీలించారు. అనంతరం సదస్సులో ప్రసంగించారు. ఆయనతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, టెక్స్ టైల్ రంగ ప్రముఖులు ఈ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.

దక్షిణాసియా టెక్స్‌టైల్ రాజధానిగా చేస్తాం..
2047 నాటికి తెలంగాణను దక్షిణ ఆసియాలో టెక్స్టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ చెప్పారు. నిజాం కాలంలో ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపారులు హైదరాబాద్‌కు వచ్చి వస్త్రాలు, ముత్యాలు కొనుగోలు చేసేవారని గుర్తుచేశారు. టెక్ట్సెల్ రంగ ప్రముఖులందరికి స్వాగతం పలుకుతున్నట్లు వెల్లడించారు. కేవలం మీరు అతిథులు మాత్రమే కాదని, మా అభివృద్ధి భాగస్వాములు, మా విజన్‌ను పంచుకునే స్నేహితులు అని సదస్సుకు హాజరైన ప్రముఖులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు.
తెలంగాణకు గర్వం..
అత్యుత్తమ వస్త్రాలను తయారు చేసిన గొప్ప చరిత్ర భారతదేశానికి ఉంది. శతాబ్దాలుగా కళలు, సంస్కృతి , సంప్రదాయాలు టెక్స్టైల్‌ను పరిపూర్ణంగా తీర్చిదిద్దాయి. శ్రీ రామనవమి సందర్భంగా సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రి హోదాలో భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయానికి పవిత్ర వస్త్రాలను సమర్పించడం నాకు గౌరవంగా అనిపించింది. తెలంగాణ గర్వంగా చెపుతోంది.. టెక్స్టైల్ మన DNAలో ఉంది. టెక్స్టైల్ మనకు కేవలం పరిశ్రమ కాదు, అది జీవనాధారం అని సీఎం పేర్కొన్నారు.

మన పత్తికి ప్రపంచ వ్యాప్తంగా పేరు..
ప్రసిద్ధి చెందిన పోచంపల్లి ఇక్కత్ నుంచి గద్వాల్ చీరలు, వరంగల్ దుర్రీస్ నుంచి నారాయణపేట చేనేత వరకు అనేకం ఇక్కడ ఉన్నాయి. తెలంగాణ టెక్స్టైల్ రంగంలో ముందంజలో ఉండటానికి చారిత్రక కారణాలు ఉన్నాయి. భారతదేశంలో పత్తి ఉత్పత్తిలో మేము అగ్రగాములం. మన పత్తి నాణ్యతకు ప్రపంచవ్యాప్తంగా పేరు ఉంది. వరంగల్‌లో కాకతీయ ప్రపంచ స్థాయి మెగా టెక్స్టైల్ పార్క్‌ను ఏర్పాటు చేశాం. ఇందులో అనేక అపారెల్ పార్కులు ఉన్నాయి. తెలంగాణలో నైపుణ్యం కూడా ఉంది, సంకల్పం కూడా ఉంది. డీప్ టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్, ఎనర్జీ ఇలా అనేక రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉంది అని రేవంత్ వెల్లడించారు.
మా విజన్ “తెలంగాణ రైజింగ్ 2047”..
2034 నాటికి ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడం మా విజన్. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 2047 నాటికి 100 సంవత్సరాలు పూర్తి అవుతాయి. టెక్స్టైల్ రంగంలో మాకు ఒక విజన్ ఉంది. మా ప్రభుత్వం మీకు మౌలిక సదుపాయాలు, భూమి, విద్యుత్, నీరు, ప్రోత్సాహకాలతో పాటు వేగంగా అనుమతులు మంజూరు చేస్తుంది. ప్రపంచానికి సరితూగే విధానాలు మా వద్ద ఉన్నాయి. అత్యుత్తమ మానవ వనరులు ఉన్నాయి. మీకు విజన్ ఉంటే, మేము మీకు సరైన భాగస్వాములు. కలిసి, ప్రపంచాన్ని మార్చగల పూర్తి టెక్స్టైల్ ఎకోసిస్టమ్‌ను నిర్మిద్దాం అని సీఎం పిలుపునిచ్చారు.

సినిమా నిర్మాణ కేంద్రంగా హైదరాబాద్..
తెలంగాణ పత్తి పొలాల నుంచి లండన్, న్యూయార్క్, పారిస్, మిలాన్, టోక్యో, దుబాయ్ ఫ్యాషన్ షోల వరకు అనేక అంశాల్లో మేం కలిసి పనిచేస్తున్నాం. హైదరాబాద్ భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా సినిమా నిర్మాణ కేంద్రంగా ఎదుగుతోంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోలను ఇక్కడ ప్రారంభించింది. టాలీవుడ్, బాలీవుడ్ ఇప్పటికే హైదరాబాద్‌ను తమ కేంద్రంగా ఉపయోగిస్తున్నాయి. ఇప్పుడు హాలీవుడ్ కూడా చేరింది. సినిమా రంగం తమ ఫ్యాషన్‌ను కూడా తెలంగాణ నుంచే పొందేలా ప్రోత్సహిస్తాం అని ముఖ్యమంత్రి వివరించారు.

పర్యావరణ పరిరక్షణ మా ప్రాధాన్యం..
గ్రీన్ టెక్స్టైల్ హబ్‌లను అభివృద్ధి చేస్తామని.. యువతకు, ముఖ్యంగా మహిళలకు, శిక్షణ అందిస్తామని చెప్పారు. సంప్రదాయ ఆలోచనలను ఆధునిక టూల్స్‌తో కలిపి డిజైన్, కట్టింగ్, స్టిచింగ్‌లో ఉపయోగించేలా చేస్తామని స్పష్టం చేశారు. ప్రపంచానికి వ్యాక్సిన్లు, ఔషధాలు తెలంగాణ అందించిందన్నారు. ఆపిల్ ఇయర్‌పాడ్స్ కూడా ఇక్కడే తయారవుతున్నాయని తెలిపారు. ప్రపంచంలోని ప్రతి దేశంలో తెలంగాణలో తయారైన దుస్తులు ధరించేలా చేయాలనేదే తమ లక్ష్యమన్నారు. మేము కేవలం ఒక రాష్ట్రం కాదు, విజయవంతమైన భాగస్వాములం. కలిసి ఒక కొత్త భవిష్యత్తును నిర్మిద్దాం.. తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Also Read..
Jeevan Reddy | రేవంత్ రెడ్డిని ఏ పార్టీ ఓడిస్తదో.. ఆ పార్టీలో చేరుతా : జీవన్ రెడ్డి
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




