త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jeevan Reddy | రేవంత్ రెడ్డిని ఏ పార్టీ ఓడిస్త‌దో.. ఆ పార్టీలో చేరుతా : జీవ‌న్ రెడ్డి

Jeevan Reddy | రేవంత్ రెడ్డిని ఏ పార్టీ ఓడిస్త‌దో.. ఆ పార్టీలోనే చేరుతాన‌ని మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత జీవ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఒకపుడు మార్పు రావాలి కేసీఆర్ పోవాలి అన్నారు. ఇప్పుడు మార్పు రావాలి రేవంత్ రెడ్డి పోవాలి అంటున్నారు అని జీవ‌న్ రెడ్డి తెలిపారు.

S

Telangana | Published On Apr 3, 2026, 4.25 pm IST

Jeevan Reddy | రేవంత్ రెడ్డిని ఏ పార్టీ ఓడిస్త‌దో.. ఆ పార్టీలో చేరుతా : జీవ‌న్ రెడ్డి
Advertisement

Jeevan Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రేవంత్ రెడ్డిని ఏ పార్టీ ఓడిస్త‌దో.. ఆ పార్టీలోనే చేరుతాన‌ని మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత జీవ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఒకపుడు మార్పు రావాలి కేసీఆర్ పోవాలి అన్నారు. ఇప్పుడు మార్పు రావాలి రేవంత్ రెడ్డి పోవాలి అంటున్నారు అని జీవ‌న్ రెడ్డి తెలిపారు. జ‌గిత్యాలలో జీవ‌న్ రెడ్డి శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. రెండేళ్లలోనే రేవంత్ రెడ్డి పోవాలి అనే నినాదం వచ్చింది. కేవలం రెండేళ్లలోనే పరిస్థితి మారింది. రెండేండ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. మార్పు రేవంత్ నిర్లక్ష్యపు పాలనకు అద్దం పడుతోంది. సంక్షేమం, ప్రాజెక్టులు నిర్వహణపై పట్టింపు లేదు అని జీవ‌న్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.

ప్రాణహిత జలాల వినియోగంపై రేవంత్ స‌ర్కార్ దృష్టి సారించలేకపోయింది. మేడిగడ్డ రిపోర్ట్ వచ్చినా పునర్నిర్మాణం చేయట్లేదు. తొందరలో పార్టీ మారే నిర్ణయం ఉంటుంది. పార్టీ మారే విషయం వారం రెండు వారాల్లో అన్ని బయటకు వస్తాయి. రేవంత్ రెడ్డిని ఏ పార్టీ ఓడిస్తాదో అదే పార్టీలో చేరతా ? రేవంత్ సర్కార్ రాష్ట్ర భవిష్యత్‌పై ఆలోచన చేయాలి అని జీవ‌న్ రెడ్డి సూచించారు.

13న బీఆర్ఎస్ పార్టీలోకి జీవ‌న్ రెడ్డి..?

కాంగ్రెస్ పార్టీలో అవ‌మానాలు భ‌రించ‌లేక‌, సీఎం రేవంత్ రెడ్డి నియంతృత్వ పోక‌డను నిర‌సిస్తూ ఆ పార్టీకి మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత జీవ‌న్ రెడ్డి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయ‌న కారెక్కెందుకు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. ఈ నెల 13వ తేదీన జీవ‌న్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ చేరిక కంటే ముందు.. ఏప్రిల్ 7వ తేదీన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. జీవ‌న్ రెడ్డి నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక ఏప్రిల్ 13న త‌న అనుచ‌రుల‌తో క‌లిసి గులాబీ కండువా క‌ప్పుకోనున్న‌ట్లు స‌మాచారం. ఆ త‌ర్వాత జ‌గిత్యాల‌లోనే ప్లీన‌రీ స‌మావేశం నిర్వ‌హించే ఆలోచ‌న‌లో బీఆర్ఎస్ పార్టీ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement