త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TPCC Mahesh Kumar Goud | కార్య‌కర్త‌ల వ‌ల్లే అధికారంలోకి వ‌చ్చాం.. మ‌ళ్లీ 100 సీట్లకు పైగా గెలుస్తం: మ‌హేశ్‌కుమార్ గౌడ్‌

TPCC Mahesh Kumar Goud | కార్య‌క‌ర్త‌ల (Cadre) వ‌ల్లే తాము తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చామ‌ని.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 100 సీట్లకు పైగా గెలుస్తామ‌ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్  కుమార్ గౌడ్ (TPCC Mahesh Kumar Goud) అన్నారు. వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ గెలిచి రాహుల్ ప్ర‌ధాన‌మంత్రి అవుతాడ‌ని పేర్కొన్నారు.

S

News | Published On Apr 3, 2026, 4.52 pm IST

TPCC Mahesh Kumar Goud | కార్య‌కర్త‌ల వ‌ల్లే అధికారంలోకి వ‌చ్చాం.. మ‌ళ్లీ 100 సీట్లకు పైగా గెలుస్తం: మ‌హేశ్‌కుమార్ గౌడ్‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: కార్య‌క‌ర్త‌ల (Cadre) వ‌ల్లే తాము తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చామ‌ని.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 100 సీట్లకు పైగా గెలుస్తామ‌ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్  కుమార్ గౌడ్ (TPCC Mahesh Kumar Goud) అన్నారు. వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ గెలిచి రాహుల్ ప్ర‌ధాన‌మంత్రి అవుతాడ‌ని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నిర్భంద పాలనలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కేసుల పాలలై లాఠీలు దెబ్బలు తిన్నారని చెప్పారు. మంచిర్యాల జిల్లా ప‌ర్య‌ట‌న‌లో శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

కేటీఆర్ ల‌క్ష కోట్ల పెట్టుబ‌డులేమైనా తెచ్చారా..

తాము పదవుల్లో ఉన్నామంటే అది కార్యకర్తల కష్టమేన‌న్నారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి తెచ్చింది కార్య‌క‌ర్త‌లేన‌ని కొనియాడారు. కేసీఆర్ శృతి లేని సంసారం చేసిండని, వారి హయాంలో చేసిన అప్పులకు నెలకు 6 వేల కోట్ల వడ్డీ కడుతున్నామ‌ని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ కు పరిమితం అయిందని ఎద్దేవా చేశారు. దోచుకున్న సొత్తును పంచుకోవడంలో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని విమ‌ర్శించారు. అందుకే కేటీఆర్‌ చెల్లెలు ఇంకో పార్టీ పెట్టిందన్నారు. ఇంగ్లిష్ దర్జాగా మాట్లాడే కేటీఆర్ విదేశాల నుంచి ఓ లక్ష కోట్ల పెట్టుబడి తెచ్చాడా అని ప్ర‌శ్నించారు. సీఎం రేవంత్ పెట్టుబ‌డులు తెచ్చాడ‌ని చెప్పారు. తెలంగాణలో రైతాoగం అభివృద్ధి చెందాలంటే పంట మార్పిడి జరగాలని సూచించారు.

శ్రీరామ చంద్రుడు మీ పార్టీ జాగీరా?

శ్రీరామ చంద్రుడు ఏమ‌న్నా మీ పార్టీ జాగీరా, ఆయ‌న‌కు మీ పార్టీ సభ్యత్వం ఏమైనా ఉందా అని బీజేపీపై ఫైర‌య్యారు. పబ్లిక్ సెక్టార్లను బీజేపీ పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. ఎన్నికలు వస్తే చాలు దేవుళ్లను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని మండిప‌డ్డారు. గంటకో డ్రెస్, పూటకో మాట మాట్లాడే మోదీని ఎవ‌రూ న‌మ్మే ప‌రిస్థితి లేద‌న్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి రాహుల్ గాంధీనే ప్ర‌ధాన‌మంత్రి అవుతార‌ని వెల్ల‌డించారు.

 

Advertisement
Advertisement