త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Eetela Rajendar | కేసీఆర్ న‌న్ను గెంటేశారు.. లేదంటే డిప్యూటీ సీఎం అయ్యేటోన్ని: ఈటెల‌

Eetela Rajendar | కేసీఆర్ (KCR) నన్ను బీఆర్ఎస్ నుంచి గెంటేసి ఐదేళ్లు అవుతుందని.. అయినా ఆ పార్టీలోనే న‌న్ను అభిమానించేవాళ్లు ఎక్కువ ఉన్నార‌ని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేంద‌ర్ (Eetela Rajendar) వ్యాఖ్యానించారు. పదవుల కోసం పాకులాడే అల‌వాటు త‌న‌కు లేద‌న్నారు.

S

News | Published On Apr 5, 2026, 3.11 pm IST

Eetela Rajendar | కేసీఆర్ న‌న్ను గెంటేశారు.. లేదంటే డిప్యూటీ సీఎం అయ్యేటోన్ని: ఈటెల‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: కేసీఆర్ (KCR) నన్ను బీఆర్ఎస్ నుంచి గెంటేసి ఐదేళ్లు అవుతుందని.. అయినా ఆ పార్టీలోనే న‌న్ను అభిమానించేవాళ్లు ఎక్కువ ఉన్నార‌ని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేంద‌ర్ (Eetela Rajendar) వ్యాఖ్యానించారు. మనందరి ఎజెండా కేసీఆర్ ను ఓడించ‌డ‌మేన‌ని.. అందుకే కాంగ్రెస్‌లో చేర‌దామ‌ని రాజగోపాల్ రెడ్డి, తుమ్మల, జూపల్లి, వివేక్ వంటి నేత‌లు త‌న‌తో అన్నార‌న్నారు. వాళ్ల‌న్న‌ట్టు చేసి ఉంటే నేను మంత్రినో, డిప్యూటీ సీఎంనో అయ్యేటోన్ని అని పేర్కొన్నారు. ఆదివారం ఆయ‌న శామీర్‌పేట‌లో మీడియాతో మాట్లాడారు. పదవుల కోసం పాకులాడే అల‌వాటు త‌న‌కు లేద‌న్నారు.

నేనేంటో తెలంగాణ‌కు తెలుసు..

మేం పార్టీ మారుతున్నామనీ కొంతమంది పోస్టర్ లు వేస్తున్నారని, పార్టీలు మారడం బట్టలు మార్చినంత సులువు కాద‌న్నారు. పార్టీలు మారొద్ద‌ని నేనే చెప్పాన‌ని.. నా గురించి తెలంగాణ సమాజానికి తెలుసన్నారు. 25 ఏళ్లు ఉండ‌డంతోనే బీఆర్ఎస్‌లో అభిమానించేవాళ్లు ఎక్కువ ఉన్నార‌ని చెప్పారు. ఈటలను పొగొట్టుకుని కేసీఆర్ తప్పు చేశారని ప్రజలు అంటున్నార‌ని వివ‌రించారు. వీళ్లందరూ కేసీఆర్ తో కలుస్తారని నా దృష్టికి వ‌చ్చింద‌ని, ఇలాంటి చిల్ల‌ర ప‌నులు చేయొద్ద‌ని కోరుతున్న‌ట్లు తెలిపారు. నన్ను బర్తరఫ్ చేయడమే కాకుండా ఇబ్బందులు పెట్టారు. కోళ్ల ఫామ్‌లు కూల్చారు.. భూములు గుంజుకున్నారు. నేను లీగల్ గా కొనుక్కున్నవి చెరబట్టారు. సీఎంకు లేఖ రాస్తా. సందర్భం వస్తేనే ఈటెల రాజేందర్ అంటే ఏంటో తెలుస్తుంది.

చ‌లో బాలాజీ న‌గ‌ర్‌..

కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. అందుకే మీడియాను మేనేజ్ చేస్తున్నారు. బుకాయిస్తు, దాబాయిస్తుంది.
6 మంది ఎంపీలం ఉన్నం. మా ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాలు చేయబోతున్నాం. మొదటి ప్రోగ్రాం చలో బాలాజీ నగర్ చేపట్టాలని అనుకున్నాం. జీహెచ్ఎంసీ పరిధిలో జరిగే ఎన్నికల్లో సర్వే లు చేస్తున్నాం. గెలుస్తాం అని ఈటెల చెప్పారు.

క‌మీట్మెంట్‌తో ఉద్య‌మంలో ఉన్నా..

అన్ని పార్టీల్లో స‌మ‌స్య‌ల‌తో పాటు పోటీ, వైవిధ్యం ఉంటుంది. అధికారం కోసం ఆధిపత్యం కోసం ఇతర పార్టీ ల నుంచి వస్తారు అంటారు. నన్ను పార్టీలోకి రావాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోరారు. కోరుకున్న మంత్రి పదవి ఇస్తా అన్నారు. కానీ కమీట్మెంట్ తో ఉద్యమంలో ఉన్నా. ప్రజల‌ను, ధర్మాన్ని నమ్ముకున్నా. సోషల్ మీడియాను నమ్ముకోలే. నా పార్లమెంట్ పరిధిలో నాకున్న అవగాహ‌న వేరే వారికి ఉండదు కదా! డివిజన్ అధ్య‌క్షుడు ఎవరు ఉండాలో నాకు తెలియదా? అని ప్ర‌శ్నించారు. హుజూరాబాద్ మీ పరిధి కాదు అన్న‌రు. ఎన్నికలప్పుడు అటు పోలేదు. హుజురాబాద్ I లో నేను ఉన్నప్పుడు మున్సిపల్ ఛైర్మన్, జడ్పీటీసీ ఓడిపోలేదు. ఈసారి ఆ పార్లమెంట్ పరిధిలో జోక్యం చేసుకోవద్ద‌న్నారు. అందుకే మౌనంగా ఉన్నా.

కోర్టుల‌ను కూడా మేనేజ్ చేస్తున్న‌రు..

జీహెచ్ఎంసీ ప‌రిధిలో గెలిచే వారికే టికెట్ లు ఇస్తం. పార్టీ గెలవాలని, ఎక్కువ సీట్లు రావాలని కోరుకుంటాం.
పార్టీ ఏం ఆలోచిస్తుందో నేనూ అదే చేస్తా. మా పార్లమెంట్ ప‌రిధిలోని సమస్యలపై, CSR నిధులపై ప్రధానికి లేఖ రాశాం. అబద్ధాల పునాదుల మీదనే రేవంత్ రెడ్డి గెలిచారు. అదేవిధంగా పాలిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం జరగదని ప్రధాని మోదీ చెప్పారు. హుజూరాబాద్ డంపింగ్ యార్డ్ పై అక్కడి ప్రజలు పిలిస్తే వెళ్లి నాయకత్వం వహిస్తా. గత ప్రభుత్వంలో దోచుకున్నది అంతా కక్కిస్తా అని అప్పుడు రేవంత్ అన్న‌డు. ఎందుకు కక్కించలేదు? సీఎం భక్వాస్ మాటలు మాట్లాడుతున్నాడు. భూములు అన్యక్రంతమవుతున్నా పట్టించుకోవడం లేదు. కోర్ట్ లను కూడా మేనేజ్ చేసే స్థాయి వచ్చింది అని ఈటెల ఫైర‌య్యారు.

Also Read..

Khanapur Municipality | ఖానాపూర్ మున్సిపాలిటీ బీజేపీదే.. బీఆర్ఎస్ మ‌ద్ద‌తుతో కైవ‌సం

CM Revanth Reddy | ఇదొక న్యాయ ప్రాంగ‌ణం.. స‌క‌ల‌ మ‌తాల‌కు ప‌విత్ర స్థ‌లం..పేదోడి చివ‌రి ఆశ‌, ఆశ్ర‌యం: సీఎం రేవంత్‌

Ponguleti Srinivas Reddy | ఉత్తుత్తిది కాదిది.. కేర‌ళంను ఒడ్డుకేసే ఎన్నిక‌: కేర‌ళం ఓట‌ర్ల‌తో పొంగులేటి

Advertisement
Advertisement