త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ఇదొక న్యాయ ప్రాంగ‌ణం.. స‌క‌ల‌ మ‌తాల‌కు ప‌విత్ర స్థ‌లం..పేదోడి చివ‌రి ఆశ‌, ఆశ్ర‌యం: సీఎం రేవంత్‌

CM Revanth Reddy | హైకోర్టు భ‌వ‌న నిర్మాణ (High Court building construction) స‌ముదాయం కేవ‌లం నిర్మాణం కాద‌ని.. ఇదొక న్యాయ ప్రాంగ‌ణమని, ప్రభుత్వ ప్రజాస్వామ్య విలువలకు ప్రతిబింబం అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. దేశంలోని అగ్రశ్రేణి న్యాయ మేధావులతో కలిసి ఉండటం గౌరవంగా ఉందన్నారు. జీవితంలో త‌న‌కు ఈ అవ‌కాశం ద‌క్క‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు.

S

News | Published On Apr 5, 2026, 1.26 pm IST

CM Revanth Reddy | ఇదొక న్యాయ ప్రాంగ‌ణం.. స‌క‌ల‌ మ‌తాల‌కు ప‌విత్ర స్థ‌లం..పేదోడి చివ‌రి ఆశ‌, ఆశ్ర‌యం: సీఎం రేవంత్‌
Advertisement
  • దేశ అగ్ర‌శ్రేణి మేధావుల మ‌ధ్య నిల‌బ‌డ‌డం గౌర‌వంగా ఉంది
  • కోర్టు నిర్మాణం మా ప్ర‌భుత్వానికి ద‌క్కిన గొప్ప అవ‌కాశం
  • ఇది హైద‌రబాద్‌కు సుదినం
  • కొత్త హైకోర్టు సమాజానికి, ప్రజాస్వామ్యానికి ఒక ప్రతీక
  • 2027, డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం
  • హైకోర్టు జోన్-2 నిర్మాణ ప‌నుల శంకుస్థాప‌న‌లో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్య‌

త్రినేత్ర‌.న్యూస్‌: హైకోర్టు భ‌వ‌న నిర్మాణ (High Court building construction) స‌ముదాయం కేవ‌లం నిర్మాణం కాద‌ని.. ఇదొక న్యాయ ప్రాంగ‌ణమని, ప్రభుత్వ ప్రజాస్వామ్య విలువలకు ప్రతిబింబం అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఆల‌యాలు నిర్మించ‌డం గొప్పే అని, కానీ అన్ని మ‌తాల‌కు ఇది ఒక ప‌విత్ర స్థ‌ల‌మ‌ని చెప్పారు. ఈరోజు రాజేంద్ర‌న‌గ‌ర్ ప‌రిధిలోని బుద్వేల్(Budwel) లో ప‌నులు చేప‌ట్ట‌డం హైద‌రాబాద్‌కు సుదిన‌మ‌ని పేర్కొన్నారు. రాష్ట్ర హైకోర్టు జోన్-2 శంకుస్థాపన కార్యక్రమంలో ఆదివారం సీఎం ప్ర‌సంగించారు. దేశంలోని అగ్రశ్రేణి న్యాయ మేధావులతో కలిసి ఉండటం గౌరవంగా ఉందన్నారు. జీవితంలో త‌న‌కు ఈ అవ‌కాశం ద‌క్క‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు.

 

ఈరోజు ప్రత్యేకమైన రోజు అని, ఇలాంటి రోజు నాయకుల జీవితంలో చాలా అరుదుగా వస్తుందని సీఎం తెలిపారు. భారతదేశంలో ఒక దేవాలయం, మసీదు, చర్చి లేదా గురుద్వారా నిర్మించడం గొప్ప విషయమ‌ని, కానీ కోర్టు సముదాయం నిర్మించడం.. న్యాయం కోసం ఒక ప్రాంగణం సృష్టించడమేన‌ని అభివ‌ర్ణించారు. అన్ని మతాల ప్రజల కోసం పవిత్ర స్థలాన్ని నిర్మించినట్లేన‌న్నారు. ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు పరస్పర గౌరవంతో పనిచేస్తాయ‌ని స్ప‌ష్టం చేశారు.

సాధారణ పౌరుడికి కోర్టు చివరి ఆశ, చివరి ఆశ్రయం..

తెలంగాణ కోసం కొత్త హైకోర్టు నిర్మాణాన్ని ప్రారంభించడం నా ప్రభుత్వానికి ఒక గొప్ప అవకాశం. జీవితంలో ఒకసారి వచ్చే అవకాశమిది. గతంలో అనేక ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును చేపట్టవచ్చు. కానీ కొన్ని కారణాల వల్ల అది మా ప్రభుత్వానికి దక్కింది. ఈ కొత్త హైకోర్టు సమాజానికి, ప్రజాస్వామ్యానికి ఒక ప్రతీకగా మారుతుంది. ఇది పేదలు, బలహీనులు న్యాయం కోసం వచ్చే వేదికగా ఉంటుంది. రాబోయే 100 సంవత్సరాల పాటు పేదలు, బలహీనులు, అణగారినవారు ఈ న్యాయ మందిరానికి వచ్చి తమ ఆవేదనను తెలియ‌జేస్తారు.

మొద‌టి నిర్ణ‌యాల్లో ఇదొక‌టి..

అన్ని వ్యవస్థలు పరస్పర గౌరవంతో, సహకారంతో పనిచేయాలి. ఇదే విష‌యాన్ని మేము నమ్ముతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయవ్యవస్థకు అత్యున్నత గౌరవాన్ని ఇస్తుంది. న్యాయవ్యవస్థకు అత్యుత్తమ సౌకర్యాలు అందించడం కార్యనిర్వాహక విభాగం బాధ్యతగా భావిస్తున్నాం. దేశంలో అతిపెద్ద హైకోర్టు సముదాయాల్లో ఇది ఒకటిగా కాకుండా, ఆధునికత, మౌలిక వసతుల పరంగా ఒక ప్రమాణంగా నిలుస్తుంది. 2023 డిసెంబర్‌లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు తీసుకున్న మొదటి నిర్ణయాల్లో ఇది ఒకటి అని సీఎం వెల్ల‌డించారు.

జోన్‌-1 ప‌నులు వేగంగా సాగుతున్న‌య్‌...

ఈ ప్రాజెక్టు కోసం రాజేంద్రనగర్‌లో 100 ఎకరాలకు పైగా భూమిని కేటాయించాం. సంస్థ భవనాల కోసం జోన్-1లో పనులు వేగంగా జరుగుతున్నాయి. జోన్-2లో నివాస భవనాలకు శంకుస్థాపన చేస్తున్నాం. 2027, డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 49 కోర్టుల కోసం, అనేక నివాస సముదాయాల కోసం కొత్త ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. న్యాయవ్యవస్థకు ఉత్తమ మౌలిక సదుపాయాలు అందించడం కార్యనిర్వాహక బాధ్యతగా భావిస్తున్నం. అన్ని వ్యవస్థలు విభేదాలను నివారించాలి. తీర్పులకే కాకుండా, పరిశీలనలకు, అభిప్రాయాలకు అత్యున్నత గౌరవం ఇస్తున్నాం. వచ్చే శతాబ్దం కోసం ఒక అద్భుతమైన భవనాన్ని, ప్రజా జీవితానికి ఒక కీలకమైన పిల్లర్ నిర్మించడానికి అడుగులు వేస్తున్నామ‌ని సీఎం వివ‌రించారు. అన్నింటికంటే ముఖ్యమైన 'న్యాయం' అనే స్ఫూర్తితో ముందుకు వెళ్దామ‌ని సీఎం రేవంత్ కోరారు.

Advertisement
Advertisement