త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Drunk and Drive | మందుబాబుల‌పై పోలీసుల ఉక్కుపాదం.. మ‌ల్కాజిగిరిలో ప‌ట్టుబ‌డ్డ‌ 268 మంది వాహ‌న‌దారులు

Drunk and Drive | మ‌ద్యం మ‌త్తులో వాహ‌నాలు న‌డుపుతున్న వారిపై మ‌ల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు (Malkajgiri Traffic Police) ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా నిర్వ‌హించిన వారాంత‌పు ప్ర‌త్యేక త‌నిఖీలో భారీ సంఖ్య‌లో మందుబాబులు ప‌ట్టుప‌డ్డారు.

G

Hyderabad | Published On Apr 26, 2026, 11.07 am IST

Drunk and Drive | మందుబాబుల‌పై పోలీసుల ఉక్కుపాదం.. మ‌ల్కాజిగిరిలో ప‌ట్టుబ‌డ్డ‌ 268 మంది వాహ‌న‌దారులు
Advertisement

Drunk and Drive | త్రినేత్ర‌.న్యూస్‌: మ‌ద్యం మ‌త్తులో వాహ‌నాలు న‌డుపుతున్న వారిపై మ‌ల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు (Malkajgiri Traffic Police) ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా నిర్వ‌హించిన వారాంత‌పు ప్ర‌త్యేక త‌నిఖీలో భారీ సంఖ్య‌లో మందుబాబులు ప‌ట్టుప‌డ్డారు. డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive) వ‌ల్ల జ‌రిగే ప్ర‌మాదాల నివార‌ణ‌కు పోలీసులు తీసుకుంటున్న క‌ఠిన చ‌ర్య‌ల్లో భాగంగా మ‌ల్కాజిగిరి ప‌రిధిలోని ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో ఈ త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మ‌ద్యం మ‌త్తులో వాహ‌నాలు న‌డుపుతూ 268 మంది ప‌ట్టుప‌డ్డారు. వారిపై పోలీసులు కేసులు న‌మోదుచేశారు. వీరిలో అత్య‌ధికంగా ద్విచ‌క్ర‌ వాహ‌న‌దారులు 221 మంది ఉన్నారు. మిగిలిన‌వారిలో త్రిచ‌క్ర‌వాహ‌న‌దారులు 10 మంది, కార్లు, ఇత‌ర వాహ‌నాలు న‌డుపుతూ ప‌ట్టుబ‌డిన‌వారు 37 మంది ఉన్నారు. ప‌ట్టుబ‌డిన‌వారిలో 8 మందికి బ్రీత్ అన‌లైజ‌ర్ ప‌రీక్ష నిర్వ‌హించ‌గా ర‌క్తంలో ఆల్క‌హాల్ శాతం (BAC) అధికంగా ఉన్న‌ట్లు తేలింది. వీరంద‌ర‌ని కోర్టు ముందు హాజ‌రుప‌రుచుతామ‌ని మ‌ల్కాజిగిరి క‌మిష‌న‌రేట్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి తెలిపారు.

మద్యం సేవించి వాహనం నడపడం తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు. ఎవరైనా మద్యం మత్తులో వాహనం న‌డిపి ఎవ‌రికైనా ప్రాణాపాయం క‌లిగించినా, తీవ్ర ప్ర‌మాదాల‌కు కారణమైనా అలాంటి వారిపై బీఎన్ఎస్‌ సెక్షన్ 105 కింద కేసులు నమోదు చేస్తామ‌న్నారు. ఈ సెక్షన్ కింద నేరం నిరూపింత‌మైతే గరిష్టంగా ప‌దేండ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంద‌ని తెలిపారు.

Advertisement
Advertisement