త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Eatala Rajender | బీజేపీ వార‌స‌త్వ పార్టీ కాదు.. నా బాధ అదే : ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్

Eatala Rajender | భార‌తీయ జ‌న‌తా పార్టీ వార‌స‌త్వ పార్టీ కాదు.. అన్ని వ‌ర్గాల‌కు ప్రాతినిధ్యం క‌ల్పించే గొప్ప పార్టీ అని మ‌ల్కాజ్‌గిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు. ఇక‌ నా బాధ ఒక్కటే.. దేశంలో రెండు ఎంపీలు గెలిస్తే ఒకటి గుజరాత్ నుంచి రెండవది హనుమకొండ నుంచి. కానీ గుజరాత్‌లో 27 ఏళ్లు అయిన తర్వాత కూడా మళ్లీ బీజేపీకి పట్టం కడుతుంటే.. తెలంగాణలో ఎక్కడున్నాం అనే బాధ కలుగుతుంది. ఎందుకు అధికారంలోకి రాలేక పోతున్నాం అనే బాధ ఉంది అని ఈట‌ల రాజేంద‌ర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

S

Telangana | Published On May 2, 2026, 3.34 pm IST

Eatala Rajender | బీజేపీ వార‌స‌త్వ పార్టీ కాదు.. నా బాధ అదే : ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్
Advertisement

Eatala Rajender | త్రినేత్ర‌.న్యూస్ : భార‌తీయ జ‌న‌తా పార్టీ వార‌స‌త్వ పార్టీ కాదు.. అన్ని వ‌ర్గాల‌కు ప్రాతినిధ్యం క‌ల్పించే గొప్ప పార్టీ అని మ‌ల్కాజ్‌గిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు. ఇక‌ నా బాధ ఒక్కటే.. దేశంలో రెండు ఎంపీలు గెలిస్తే ఒకటి గుజరాత్ నుంచి రెండవది హనుమకొండ నుంచి. కానీ గుజరాత్‌లో 27 ఏళ్లు అయిన తర్వాత కూడా మళ్లీ బీజేపీకి పట్టం కడుతుంటే.. తెలంగాణలో ఎక్కడున్నాం అనే బాధ కలుగుతుంది. ఎందుకు అధికారంలోకి రాలేక పోతున్నాం అనే బాధ ఉంది అని ఈట‌ల రాజేంద‌ర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మే 10వ తేదీన ప‌రేడ్ గ్రౌండ్స్‌లో నిర్వ‌హించ‌బోయే బీజేపీ బ‌హిరంగ స‌భ స‌న్నాహ‌క స‌మావేశాల సంద‌ర్భంగా ఎల్‌బీ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని శుభం క‌న్వెన్ష‌న్ హాల్‌లో నిర్వ‌హించిన ముఖ్య నేత‌ల స‌మావేశంలో ఈట‌ల రాజేంద‌ర్ పాల్గొని ప్ర‌సంగించారు.

భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రజాస్వామికమైన పార్టీ. నిరంతరం ప్రవహించే సజీవ నది లాంటిది. ప్రాంతీయ పార్టీలలో జీవితకాలం కుటుంబ సభ్యులు అధ్యక్షులుగా ఉంటారు. బీజేపీలో రెండు దఫాలు మాత్రమే అధ్యక్షులుగా చేయగలుగుతారు. బీజేపీ వారసత్వ పార్టీ కాదు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే గొప్ప పార్టీ. బీజేపీ కార్యకర్తలు అత్యంత కమిట్మెంట్ కలిగిన వారు. ప్రపంచానికి ఒకప్పుడు జ్ఞానాన్ని అందించిన దేశం భారత్.. మళ్లీ అలాంటి అగ్రస్థానం నిలబెట్టేందుకు నరేంద్ర మోదీ ప్రయత్నం చేస్తున్నారు. నరేంద్ర మోదీ చెక్కుచెదరని అచంచల విశ్వాసంతో కూడిన పరిపాలన దేశంలో అందిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుడు నరేంద్ర మోదీ అని కీర్తి దక్కింది. ప్రపంచంలో ఎక్కువ మంది ప్రేమ పొందిన నేత అని ఈట‌ల రాజేంద‌ర్ పేర్కొన్నారు.

బెంగాల్ గడ్డమీద కాషాయ జెండా ఎగురవేయబోతున్నాం..

బెంగాల్ గడ్డమీద కాషాయ జెండా ఎగురవేయబోతున్నాం అని సర్వేలు చెప్తున్నాయి. వేరే రాష్ట్రాల్లో గెలిచినప్పుడు సీట్లు పంచుకొని సంబరాలు చేసుకుంటున్నాం.. మన దగ్గర కూడా స్వీట్లు పంచుకొనే రోజు రావాలి. 4 లక్షల మెజారిటీతో బీజేపీని గెలిపించుకుని మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం అజేయమైన శక్తిగా నిలిచింది. అందులో అత్యధిక మెజారిటీ ఇచ్చింది ఎల్.బి.నగర్ అసెంబ్లీ నియోజకవర్గం. పోల్ అయిన ఓట్లలో 65 శాతం ఓటు సాధించడం చాలా అరుదైన విషయం. 1 లక్ష 6 వేల మెజారిటీ ఇచ్చింది ఎల్బీనగర్. గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో అత్యధిక కార్పొరేటర్ల సీట్లు గెలిపించింది కూడా ఎల్బీనగర్ నియోజకవర్గం. మార్పుకు బాటలు వేసే నియోజకవర్గం ఇది అని ఈట‌ల ప్ర‌శంసించారు.

గుజరాత్, మహారాష్ట్ర లాగా తెలంగాణ కూడా అభివృద్ధి..

నరేంద్ర మోదీ సభకు ప్రజలందరినీ కదిలించండి. మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తొలిసారిగా నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్నారు. గుజరాత్, మహారాష్ట్ర లాగా తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలంటే సంపూర్ణ మద్దతు ఇవ్వమని అడగడానికి వస్తున్నారు. మూసీ, హైడ్రా ఉద్యమం ఏదైనా నాయకత్వం వహించింది భారతీయ జనతా పార్టీనే. మనం హక్కుదారులం. రాజకీయ నాయకుడికి వీఐపీలు ప్రజలు మాత్రమే. నాయకులు ప్రజలను ప్రేమించాలి. సమస్యలు వినాలి, పరిష్కరించాలి.. పరిష్కారం కోసం మార్గం అన్వేషించ కలిగిన వారు మాత్రమే నాయకులు. రాజకీయాలలో తొలగి తోవ ఎవరు ఇవ్వరు తోసుకొని పోవాల్సిందే. ఎల్బీనగర్ నియోజకవర్గంలో శక్తివంతమైన లీడర్షిప్ ఉందని ఎంపీ పేర్కొన్నారు.

రక్త సంబంధం కంటే పార్టీ సంబంధం చాలా గొప్పది, బలమైనది..

రక్తసంబంధం కంటే పార్టీ సంబంధం చాలా గొప్పది, బలమైనది. మోదీ మీటింగ్ కోసం నిన్న 8 మీటింగ్స్ పెట్టిన.. అందరూ పెద్ద ఎత్తున తరలివస్తామని చెప్పారు. గత ఎన్నికల్లో దక్షిణ భారతదేశంలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి.. ప్రజల ప్రేమను చూసి అనేక సభల్లో మోదీ మన గురించి చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మల్కాజిగిరికే వస్తున్నారు. మీ మీద నమ్మకంతో మీ తరపున మాట ఇచ్చిన.. మాట నిలబెట్టే బాధ్యత తీసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి బాటలు వేసే.. స్ఫూర్తినిచ్చే సభ ఇది పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయండి అని ఈట‌ల రాజేంద‌ర్ పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాసరెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షులు సామ రంగారెడ్డి, రాష్ట్ర నాయకులు గౌతమ్ రావు, ఆలె భాస్కర్, కాసం వెంకటేశ్వర్లు, శైలజ, శ్రీదేవి, చెన్నకేశవ రెడ్డి, య‌శ్‌పాల్‌ గౌడ్, భాస్కర్, శ్యామ్, మాజీ కార్పొరేటర్లు పవన్, అరుణ్, నరసింహారెడ్డి, జీవన్ రెడ్డి, రంగ నరసింహ గుప్తా, గీత, శంకర్, రాజేంద్రప్రసాద్, నగేష్, నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement