త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | ఉత్తుత్తిది కాదిది.. కేర‌ళంను ఒడ్డుకేసే ఎన్నిక‌: కేర‌ళం ఓట‌ర్ల‌తో పొంగులేటి

Keralam Election Campaign | తెలంగాణ మోడల్‌నే కేరళం (Keralam) అభివృద్ధి కావాలంటే ఎల్డీఎఫ్‌(LDF) ను దించి యూడీఎఫ్‌(UDF)ను గ‌ద్దెనెక్కించాల‌ని తెలంగాణ‌ రెవెన్యూ, పౌర సంబంధాల‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. మావేలిక్కర అసెంబ్లీ నియోజకవర్గంలో యూడీఎఫ్ అభ్యర్థి ముతర రాజ్‌కు మద్దతుగా ఆదివారం ఆయ‌న‌ ఎన్నికల ప్రచారం చేశారు.

S

News | Published On Apr 5, 2026, 3.40 pm IST

Ponguleti Srinivas Reddy | ఉత్తుత్తిది కాదిది.. కేర‌ళంను ఒడ్డుకేసే ఎన్నిక‌: కేర‌ళం ఓట‌ర్ల‌తో పొంగులేటి
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ మోడల్‌నే కేరళం (Keralam) అభివృద్ధి కావాలంటే ఎల్డీఎఫ్‌(LDF) ను దించి యూడీఎఫ్‌(UDF)ను గ‌ద్దెనెక్కించాల‌ని తెలంగాణ‌ రెవెన్యూ, పౌర సంబంధాల‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. యూడీఎఫ్ అధికారంలోకి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మాదిరిగానే ఇక్క‌డ కూడా అమ‌లు చేస్తామ‌ని స్పష్టం చేశారు. మావేలిక్కర (Mavelikkara) అసెంబ్లీ నియోజకవర్గంలో యూడీఎఫ్ అభ్యర్థి ముతర రాజ్‌కు మద్దతుగా ఆదివారం ఆయ‌న‌ ఎన్నికల ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. తెలంగాణలో ఆరు గ్యారెంటీలను పారదర్శకంగా అమలు చేస్తున్నామ‌న్నారు. కేరళంలో కూడా యూడీఎఫ్ వ‌స్తే ఐదు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. గత పదేళ్ల ఎల్డీఎఫ్ పాలనలో ప్ర‌జ‌లు విసిగిపోయార‌ని విమ‌ర్శించారు. అభివృద్ధి, ఉపాధి, పెట్టుబడుల వంటి విష‌యాల్లో ప్రభుత్వం చేతులెత్తేసింద‌ని మండిప‌డ్డారు. ఇక్క‌డి ప్రజలు ప్ర‌స్తుతం మార్పు కోరుకుంటున్నార‌ని చెప్పారు. అసమర్థ పాలనకు ముగింపు పలకాల‌ని పిలుపునిచ్చారు. యూడీఎఫ్‌కు అధికారం అప్పగిస్తే అభివృద్ధి ప‌రుగులు పెడుతుంద‌న్నారు.

దేశవ్యాప్తంగా విభజన రాజకీయాలు చేయ‌డం బీజేపీకి అల‌వాటుగా మారింద‌ని ఆరోపించారు. మ‌త‌ విభేదాలు పెంచే బీజేపీకి కేరళంలో స్థానం లేదన్నారు. ఇది సాధారణ ఎన్నిక కాదని.. కేరళం భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక అని వెల్ల‌డించారు. ఎల్‌డీఎఫ్ ప్రభుత్వాన్ని గద్దె దించి, యూడీఎఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని పొంగులేటి విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement
Advertisement