Ginger paste seize | 4,032 కిలోల కలుషిత అల్లం పేస్ట్ సీజ్.. నిందితుడి అరెస్ట్
Ginger paste seize | ఇటీవల హైదరాబాద్‌లో కలుషిత ఆహార వస్తువులు తనిఖీల్లో భయటపడం ఆందోళన కలిగిస్తోంది. బయట ఏం తినాలన్నా, ఏం కొనాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా కలుషిత అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger paste) తయారీ కేంద్రం(Manufacturing center)పై పోలీసులు దాడి (attacked) చేశారు. 4,032 కిలోల అల్లం పేస్ట్‌ను సీజ్ (Seize) చేశారు.
త్రినేత్ర.న్యూస్: ఇటీవల హైదరాబాద్‌లో కలుషిత ఆహార వస్తువులు తనిఖీల్లో భయటపడం ఆందోళన కలిగిస్తోంది. దాడి చేసిన ప్రతి చోటా నిర్వాహకుల అసలు రంగు బయట పడుతుంది. బయట ఏం తినాలన్నా, ఏం కొనాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా కలుషిత అల్లం వెల్లుల్లి పేస్ట్ (Ginger paste) తయారీ కేంద్రం(Manufacturing center)పై పోలీసులు దాడి (attacked) చేశారు. 4,032 కిలోల అల్లం పేస్ట్‌ను సీజ్ (Seize) చేశారు.
టాక్స్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ వివరాల ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో కలుషితమైన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తున్నట్లు సమాచారం అందింది. 'SKR ఫుడ్ ప్రొడక్ట్స్' (ప్లాట్ నెం. 25, SEIE, ఐడీఏ కాటేదాన్) పై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. అబిడ్స్‌కు చెందిన హసన్ అలీ రూపానీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితులలో ప్లాస్టిక్ డబ్బాల్లో ఈ పేస్ట్‌ను తయారు చేస్తున్నారు. నాణ్యత లేని అల్లం, వెల్లుల్లి తొక్కలను ఉపయోగించి కలుషితం చేస్తున్నారు. ఎసిటిక్ యాసిడ్, గ్జాంతమ్ గమ్ పౌడర్ వంటి రసాయనాలను అల్లంలో కలుపుతున్నట్లు గుర్తించాం.
రూ.22,00,000 విలువైన వస్తువులు స్వాధీనం..
ఈ కలుషిత పేస్ట్‌ను బహిరంగ ప్రదేశాల్లో ఉంచడం వల్ల దుమ్ము, ఈగలు వాలుతున్నాయి. హోల్‌సేల్ కిరాణా దుకాణాలకు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో నిందితుడు చెలగాటం ఆడుతున్నాడు. ఆహార భద్రతా ప్రమాణాల సర్టిఫికేట్ లేకుండా కేవలం లాభాపేక్షతో ఈ అక్రమ వ్యాపారం సాగిస్తున్నాడు. మొత్తం సుమారు రూ. 22,00,000 విలువైన వస్తువులు సీజ్ చేశాం. 6,000 కిలోల నాణ్యత లేని వెల్లుల్లి, 210 కిలోల నాణ్యత లేని అల్లం, వెల్లుల్లి పొట్టు సంచులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో పాటు 250 కిలోల ఉప్పు, ఎసిటిక్ యాసిడ్, గ్జాంతమ్ గమ్ పౌడర్, 5 గ్రైండింగ్ యంత్రాలను సీజ్ చేసినట్లు చెప్పారు.
నిందితుడిని అరెస్టు చేసి తదుపరి చర్యల నిమిత్తం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ (SHO) కు అప్పగించారు. ఈ ఆపరేషన్‌లో ఖైరతాబాద్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ పి. రాఘవేందర్, ఎస్సై శ్రీకాంత్, మైలార్‌దేవ్‌పల్లి ఎస్సై విశ్వనాథ్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
Also Read..
ఎన్ని నోటీసులిచ్చినా వెనక్కి తగ్గను: పాడి కౌశిక్ రెడ్డి
ఇరాన్‌పై అమెరికా భీకర దాడి.. ఇస్‌ఫాహన్ నగరంపై బంకర్ బస్టర్లను జారవిడిచిన యూఎస్
పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. ఏప్రిల్ 4న విచారణకు రావాలని ఆదేశం
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





