త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Midhun Reddy | ఆ బిల్లుల‌కు మ‌ద్ద‌తిస్తున్నాం.. కానీ, నోటిమాట మాత్ర‌మే స‌రిపోదు : వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి

Midhun Reddy | లోక్‌సభ స్థానాల పెంపును వైఎస్సార్‌సీపీ (YSRCP) స్వాగతించింది. అయితే, ఈ బిల్లుపై తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని ఆ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి (Midhun Reddy) అన్నారు.

D

National | Published On Apr 17, 2026, 1.48 pm IST

Midhun Reddy | ఆ బిల్లుల‌కు మ‌ద్ద‌తిస్తున్నాం.. కానీ, నోటిమాట మాత్ర‌మే స‌రిపోదు : వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి
Advertisement

Midhun Reddy | లోక్‌సభ స్థానాల పెంపును వైఎస్సార్‌సీపీ (YSRCP) స్వాగతించింది. అయితే, ఈ బిల్లుపై తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని ఆ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి (Midhun Reddy) అన్నారు. రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లుపై చ‌ర్చ‌ సంద‌ర్భంగా లోక్‌స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. డీలిమిటేష‌న్‌పై (delimitation) నోటిమాట మాత్ర‌మే స‌రిపోద‌ని తెలిపారు. రాష్ట్రాల వారీగా సీట్ల పెంపుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన‌ హామీలను రాజ్యాంగ సవరణ బిల్లులో పొందుప‌ర‌చాల‌ని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదాపై ఇచ్చిన మౌఖిక హామీని అమలు చేయలేదని ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ గుర్తుచేశారు.

ప్రాంతీయ వ్యత్యాసాలు లేకుండా చూడాల‌ని మిథున్ రెడ్డి అన్నారు. అన్ని పార్టీలకు తగిన ప్రాతినిధ్యం ఉండాల‌ని కోరారు. డీలిమిటేషన్ ప్రక్రియ విపక్షాలను అణచివేసేదిగా ఉండకూడద‌ని పేర్కొన్నారు. డీలిమిటేషన్ కమిటీలో (delimitation panel) ప్రతిపక్ష పార్టీలకు అసోసియేట్ సభ్యులుగా సరైన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళల సాధికారతకు త‌మ‌పార్టీ కట్టుబడి ఉందని, రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తుందని చెప్పారు. సూత్రప్రాయంగా ఈ బిల్లులను అంగీకరిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే, తాము లేవనెత్తిన అన్ని అంశాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని మిథున్‌రెడ్డి కోరారు.

Also Read..

క‌ర్ణాట‌క‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురి స‌జీవ ద‌హ‌నం

అంబానీని వెన‌క్కి నెట్టి..! ఆసియా కుబేరుడిగా గౌత‌మ్ ఆదానీ..!

రేవంత్‌ది మ‌జ్లిస్‌ ఫార్ములా.. హైబ్రిడ్ ఫార్ములా కాదు: కిష‌న్‌రెడ్డి

Advertisement
Advertisement