త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Justice Yashwant Verma Case | న్యాయమూర్తి యశ్వంత్ వర్మ కేసు.. లోక్‌స‌భ స్పీక‌ర్‌కు నివేదిక‌..

Justice Yashwant Verma Case | జ‌స్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన కమిటీ తన నివేదికను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది. ఈ నివేదికను త్వరలోనే పార్లమెంట్ రెండుసభల్లో ప్రవేశపెట్టనున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించింది.

P

National | Published On May 19, 2026, 5.33 pm IST

Justice Yashwant Verma Case | న్యాయమూర్తి యశ్వంత్ వర్మ కేసు.. లోక్‌స‌భ స్పీక‌ర్‌కు నివేదిక‌..
Advertisement

Justice Yashwant Verma Case | జ‌స్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన కమిటీ తన నివేదికను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది. ఈ నివేదికను త్వరలోనే పార్లమెంట్ రెండుసభల్లో ప్రవేశపెట్టనున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించింది. వ‌ర్షాకాల స‌మావేశాలు జులైలో జ‌రుగ‌నుండ‌గా.. అదే స‌మ‌యంలో స‌భ ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అస‌లు ఏంటీ వివాదం..

ఢిల్లీ హైకోర్టులో న్యాయ‌మూర్తిగా ప‌ని చేస్తున్న జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ అధికారిక నివాసంలో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. గ‌తేడాది మార్చి 14న అర్ధ‌రాత్రి ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బంది మంట‌లు ఆర్పే స‌మ‌యంలో స్టోర్‌రూమ్‌లో పెద్ద మొత్తంలో కాలిన నోట్లు ఉండ‌డం వెలుగుచూడ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. ఈ వ్య‌వ‌హారం అప్ప‌ట్లో స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశం కావ‌డంతో ఆయ‌న‌ను అల‌హాబాద్ హైకోర్టుకు బ‌దిలీ చేశారు. ఈ ఘ‌ట‌న‌పై అప్ప‌టి సుప్రీంకోర్టు సీజేఐ జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా అంత‌ర్గ‌త విచార‌ణ కోసం క‌మిటీని ఏర్పాటు చేశారు. కమిటీ విచారణలో ఆ స్టోర్‌రూమ్ జ‌స్టిస్ వ‌ర్మ ప‌రోక్ష నియంత్ర‌ణ‌లోనే ఉన్న‌ట్లుగా తేలిన‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా.. గ‌తేడాది జులైలో 200 మందికిపైగా ఎంపీలు ఆయ‌న‌ను ప‌ద‌వి నుంచి తొల‌గించాలంటూ తీర్మానంపై సంత‌కాలు చేసిన విష‌యం తెలిసిందే.

పార్ల‌మెంట్‌కు మాత్ర‌మే..

నిబంధ‌న‌ల ప్ర‌కారం.. సుప్రీం, హైకోర్టుల న్యాయ‌మూర్తుల‌ను ప‌ద‌వి నుంచి త‌ప్పించే అధికారం కేవ‌లం పార్ల‌మెంట్‌కు మాత్ర‌మే ఉంది. ‘జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్, 1968’ ప్రకార‌మే తొల‌గింపు ప్ర‌క్రియ జ‌రుగుతుంది. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ స్పీకర్ గ‌తేడాది ఆగ‌స్టు 12న విచార‌ణ కోసం త్రిస‌భ్య క‌మిటీని నియ‌మించారు. అభిశంస‌న నేప‌థ్యంలో జ‌స్టిస్ వ‌ర్మ ఇటీవ‌ల అల‌హాబాద్ హైకోర్టు న్యాయ‌మూర్తి ప‌ద‌వికి రాజీనామా చేశారు. రాజీనామా చేయడంతో ఇక పార్లమెంట్ ద్వారా తొలగింపు ప్రక్రియ అర్థ‌ర‌హిత‌మ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. సుప్రీంకోర్టు గ‌తంలో ఇచ్చిన తీర్పుల ప్ర‌కారం.. న్యాయమూర్తి తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించి, దాన్ని బహిరంగంగా ప్రకటించిన వెంటనే అమల్లోకి వచ్చినట్లుగా ప‌రిగ‌ణిస్తారు. రాష్ట్ర‌ప‌తి ఆమోదం త‌ప్ప‌నిస‌రేం కాదు. ప్రస్తుతం యశ్వంత్ వర్మ పేరు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తుల జాబితాలో ఉంది. చట్టపరంగా ఆయన ఇప్పుడు ఓ సాధారణ పౌరుడేన‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పదవిలో ఉన్నప్పుడే విచారణ ప్రారంభ‌మైంద‌న్న విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక‌పై పార్ల‌మెంట్ మాత్ర‌మే త‌ర్వాతి చ‌ర్య‌లపై నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంద‌ని పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement