త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kishan Reddy | రేవంత్‌ది మ‌జ్లిస్‌ ఫార్ములా.. హైబ్రిడ్ ఫార్ములా కాదు: కిష‌న్‌రెడ్డి

Kishan Reddy | రేవంత్‌(Revanth)ది హైబ్రిడ్ ఫార్ములా కాద‌ని.. ముమ్మాటికీ అది మ‌జ్లిస్ పార్టీ అధినేత అస‌దుద్దీన్ (Asaduddin) చెప్పిన‌ ఫార్ములానేన‌ని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి (Kishan Reddy) ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. మ‌హిళ‌ల‌ను అణ‌గ‌దొక్కే పార్టీ మ‌జ్లిస్ పార్టీ అని ఆరోపించారు. శుక్ర‌వారం ఆయ‌న ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

S

News | Published On Apr 17, 2026, 1.28 pm IST

Kishan Reddy | రేవంత్‌ది మ‌జ్లిస్‌ ఫార్ములా.. హైబ్రిడ్ ఫార్ములా కాదు: కిష‌న్‌రెడ్డి
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: రేవంత్‌(Revanth)ది హైబ్రిడ్ ఫార్ములా కాద‌ని.. ముమ్మాటికీ అది మ‌జ్లిస్ పార్టీ అధినేత అస‌దుద్దీన్ (Asaduddin) చెప్పిన‌ ఫార్ములానేన‌ని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి (Kishan Reddy) ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. మ‌హిళ‌ల‌ను అణ‌గ‌దొక్కే పార్టీ మ‌జ్లిస్ పార్టీ అని ఆరోపించారు. శుక్ర‌వారం ఆయ‌న ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్‌(Delimitation)పై తెలంగాణ నాయ‌కులు అర్థం లేని వ్యాఖ్య‌లు చేస్తున్నారని విమర్శించారు. మహిళల రిజర్వేషన్లకు మజ్లిస్‌ వ్యతిరేకమ‌న్నారు.

డీలిమిటేషన్‌పై ప్ర‌తిప‌క్షాలు తెలియ‌కుండా మాట్లాడుతున్నాయ‌న్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, ఉత్త‌ర‌, ద‌క్షిణ మధ్య యుద్ధం వస్తుందని.. ఇలా ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాలకు సమ న్యాయం చేస్తామని ఇప్ప‌టికే ప్రధాని మోదీ స్ప‌ష్టం చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోనే రెవెన్యూ ఎక్కువగా వస్తుందని రేవంత్ అసెంబ్లీ సీట్లు పెంచుతారా? డబ్బు ఎక్కువగా ఉన్న వారికి ఎక్కువ ఓటు విలువ ఇస్తారా? అని ప్రశ్నించారు.

హైదరాబాద్‌లో తమ సీట్లు తగ్గుతాయ‌ని మజ్లిస్ భయప‌డుతోంద‌న్నారు. డీలిమిటేషన్ విష‌యంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు కుమ్మకయ్యాయ‌ని ఆరోపించారు. అస‌దుద్దీన్‌ తన ఫార్ములాను సీఎం రేవంత్‌ రెడ్డి ద్వారా చెప్పించార‌ని విమ‌ర్శించారు. నియోజకవర్గాలు పెరిగితే మహిళలు, యువతకు అవకాశాలు వస్తాయ‌ని తెలిపారు. కొత్త నాయకత్వం వస్తే తమ ఉనికికి ప్ర‌మాదం ఏర్ప‌డుతుంద‌ని మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ సహా విపక్షాలు అడ్డుకుంటున్నాయ‌ని మండిప‌డ్డారు. మహిళా రిజర్వేషన్‌కు అడ్డుప‌డేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ను ఎంఐఎం కలిపిందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ప్రతీ రాజకీయ పార్టీ ప్రధాని మోదీ ఫొటోను ఆయా కార్యాల‌యాల్లో పెట్టుకోవాల‌ని సూచించారు. ఏపీలో లోక్‌సభ సీట్లు 25 నుంచి 38కి పెరుగుతాయ‌ని.. తమిళనాడులో 39 నుంచి 59కి పెరుగుతాయ‌న్నారు. దేశమంతా ఒకే నిష్పత్తిలో సీట్లు పెరుగితే ఇక న‌ష్టం ఏముంద‌ని ప్ర‌శ్నించారు. మహిళా రిజర్వేషన్లను, సీట్ల పెంపును వ్యతిరేకించేవారిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని పార్టీలతో మాట్లాడినప్పుడు ఒప్పుకుని ఇప్పుడు రాద్దాంతం చేయ‌డ‌మేంట‌ని కిష‌న్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement