Karnataka | కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
Karnataka | కర్ణాటకలో కారు టైరు ఒక్క సారిగా పేలిపోయి, బస్సును వేగంగా ఢీకొనడంతో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు ప్రయాణీకులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు.
Karnataka | త్రినేత్ర.న్యూస్: కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రయాణీకులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకలోని యాద్గిర్ నుంచి రాయ్‌చూర్ వెళ్తున్న కారు సర్పుర తాలుకా శాంతాపూరకు చేరుకోగానే, కారు టైరు ఒక్క సారిగా పేలిపోయింది. దీంతో కారు డ్రైవర్ వాహనంపై అదుపును కోల్పోయాడు. ఈ క్రమంలో ఆ కారు బెంగుళూరు నుంచి కాలాబురిగి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వేగంగా ఢీకొట్టింది. వెంటనే ఒక్కసారిగా కారును మంటలు చుట్టుముట్టాయి. మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో కారులోని ఆరుగురు సజీవ దహనం కాగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అత్యవసర, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!
- ●Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!

Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత

Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ






