త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bloomberg | అంబానీని వెన‌క్కి నెట్టి..! ఆసియా కుబేరుడిగా గౌత‌మ్ ఆదానీ..!

Bloomberg | ఆసియాలోనే అత్యంత ధ‌న‌వంతుడిగా ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త గౌత‌మ్ అదానీ నిలిచారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ స్థానంలో ఉన్న రియ‌ల‌న్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ రెండో స్థానానికి ప‌డిపోయారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అదానీ సంపద భారీగా పెరిగింది.

P

Business | Published On Apr 17, 2026, 1.37 pm IST

Bloomberg | అంబానీని వెన‌క్కి నెట్టి..! ఆసియా కుబేరుడిగా గౌత‌మ్ ఆదానీ..!
Advertisement

Bloomberg | ఆసియాలోనే అత్యంత ధ‌న‌వంతుడిగా ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త గౌత‌మ్ అదానీ నిలిచారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ స్థానంలో ఉన్న రియ‌ల‌న్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ రెండో స్థానానికి ప‌డిపోయారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అదానీ సంపద భారీగా పెరిగింది. తాజా గ‌ణాంకాల ప్ర‌కారం.. గౌతమ్ అదానీ సంపద 92.6 బిలియన్ డాలర్లకు చేరి ప్రపంచ కుబేరుల్లో 19వ స్థానంలో నిలిచారు. మరోవైపు ముకేష్ అంబానీ సంపద 90.8 బిలియన్ డాలర్లకు తగ్గి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 20వ స్థానానికి చేరుకున్నారు. దీంతో ఆసియాలో తొలి స్థానాన్ని అదానీ తిరిగి కైవసం చేసుకున్నారు.

ఈ మార్పుకు ప్రధాన కారణం స్టాక్ మార్కెట్‌లో వచ్చిన మార్పులేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అదానీ గ్రూప్ షేర్లు ఈ ఏడాది రాణించారు. దాంతో ఆయన సంపద సుమారు 8.1 బిలియన్ డాలర్లు పెరిగింది. గురువారం ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 123 పాయింట్లు పడిపోయినా.. అదానీ గ్రూప్ షేర్లు గణనీయంగా ఎగబాకాయి. ఒక్క రోజులోనే ఆయన సంపద దాదాపు 3.56 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే.. షేర్లలో మార్పుల కారణంగా ముకేష్ అంబానీ సంపద ఈ ఏడాది సుమారు 16.9 బిలియన్ డాలర్లు తగ్గింది. ఇటీవల స్వల్పంగా 76.7 మిలియన్ డాలర్ల పెరుగుదల కనిపించినా.. మొత్తం మీద మార్కెట్‌లో స్థిర‌త్వం లేక‌పోవ‌డంతో ర్యాంకింగ్స్‌లో అంబానీ వెనుక‌ప‌డిపోయారు. మ‌రో వైపు ప్రపంచ స్థాయిలో చూస్తే టాప్-20 బిలియనీర్లలో ఏడుగురు సంపద త‌గ్గింది.

లగ్జరీ బ్రాండ్ల అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ అత్యధికంగా 44 బిలియన్ డాలర్లు కోల్పోయారు. బిల్ గేట్స్, వారెన్ బఫెట్, స్టీవ్ బాల్మర్, ల్యారీ ఎల్లిసన్, ముకేష్ అంబానీ వంటి ప్రముఖులకు సైతం న‌ష్టాలు త‌ప్ప‌లేదు. ఇదిలా ఉంటే.. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ 656 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆయన త‌ర్వాత ల్యారీ పేజ్ 286 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. స్టాక్ మార్కెట్‌లోని మార్పులు బిలియనీర్ల స్థానాలను ఎంత వేగంగా మార్చగలవో ఈ పరిణామం మరోసారి చూపించింది. ఇక బ్లూమ్‌బ‌ర్గ్ ఇండెక్స్‌లో ఎలాన్ మ‌స్క్, లారీ పేజ్‌, జెఫ్ బెజోస్‌, సెర్గి బ్రిన్‌, మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ వ‌రుస‌గా టాప్‌-5 స్థానాల్లో నిలిచారు.

Advertisement
Advertisement