Rashmi Gautam | నన్ను ట్రోల్ చేయడానికి అంత కష్టపడాలా?…రష్మి గౌతమ్ ఘాటు విమర్శలు
వైసీపీ కార్యకర్తలకు మరోసారి యాంకర్ రష్మి గౌతమ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా నీచమైన కామెంట్లు చేస్తున్నారని అన్నది.
Entertainment | Published On May 3, 2026, 6.10 pm IST
Rashmi Gautam | తనను ట్రోల్ చేస్తోన్న వైసీపీ కార్యకర్తలకు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది రష్మి గౌతమ్. తను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా నీచమైన కామెంట్లు చేస్తున్నారని అన్నది.
వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు భూమన అభినయ్ రెడ్డి ఇటీవల పెట్రో ధరల పెంపుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో ఎద్దుల బండిపై ఆటోను ఉంచి మూగ జీవాలను హింసించారంటూ రష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్మి వ్యాఖ్యలను తప్పుపట్టిన వైసీపీ కార్యకర్తలు ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు. రష్మి జబర్ధస్థ్ వీడియోలతో పాటు సినిమాల్లో ఆమె చేసిన గ్లామర్ సీన్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీటిపై రష్మి రియాక్ట్ అయ్యింది.
నిద్రలేని రాత్రులు...
తనను ట్రోల్ చేయడానికి అవసరమైన కంటెంట్, వీడియోలు క్రియేట్ చేస్తూ చాలా మంది నిద్రలేని రాత్రులను గడుపుతున్నారని అన్నది. తనను విమర్శించడానికి అంత కష్టమెందుకు అంటూ ట్వీట్ పెట్టింది. ఆ సమయాన్ని మంచి పనుల కోసం ఉపయోగిస్తే బాగుంటుందని సలహా ఇచ్చింది.
వ్యక్తిత్వంపై ఆరోపణలు...
సినీ పరిశ్రమలో పేరు ప్రఖ్యాతులు, ఎదుగుదల కోసం రష్మి ఎంతకైనా దిగజారుతుంది అంటూ ఓ నెటిజన్ ట్వీట్ పెట్టాడు. అతడి పోస్ట్‌పై రష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ మహిళ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక, ఆమెను ఎదురించే ధైర్యం లేక వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఆరోపణలు చేయడం దారుణం అంటూ రష్మి పేర్కొన్నది. "ఓ మహిళ తన టాలెంట్‌తో కాకుండా కమిట్‌మెంట్లతో పైకి వచ్చిందంటూ చేస్తోన్న కామెంట్లే నీ నీచమైన బుద్దిని బయటపెడుతున్నాయి. నిజంగా నాపై చేస్తోన్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఉంటే బయటపెట్టు" అంటూ కౌంటర్ ఇచ్చింది.ప్రజా సమస్యలపై తాను పెట్టిన పోస్ట్‌లు మాత్రం ఎవరికి కనిపించవని రష్మి ఆవేదన వ్యక్తం చేసింది.
సంబంధిత వార్తలు

Taapsee | నాలుగేళ్ల తర్వాత తెలుగు సినిమాలో తాప్సీ – బాలీవుడ్లో ఆఫర్లు తగ్గడమే కారణమా?
ఆగస్టు 29, 2026

X | ఎక్స్‌లో కొత్త అప్డేట్.. ఇక కావల్సిన టాపిక్లనే ఫాలో అవ్వచ్చు..
ఆగస్టు 29, 2026

Nani Paradise | డల్లాస్ గడ్డపై మారుమోగిన తెలంగాణ జానపదం – ప్యారడైజ్ నుంచి ఏషనాగుల సాంగ్ రిలీజ్
ఆగస్టు 29, 2026
తాజావార్తలు
- ●Eesha Rebba | కొత్తింట్లో అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్ - అమ్మ పేరు పెట్టానంటూ ఎమోషనల్ పోస్ట్
- ●Telangana Farmers Commission | ఎఫ్టీఎల్ ఆక్రమణలు కూల్చేయండి.. చెరువుల రక్షణకు కొత్త చట్టం
- ●Bakki Venkataiah | బాధితులు వస్తే తక్షణమే స్పందించండి.. సామాజిక న్యాయం పాటించండి
- ●Kidney Symposium 2026 | కిడ్నీ మార్పిడిలో అద్భుతాలు: 400+ సర్జరీలతో యశోద హాస్పిటల్స్ సరికొత్త రికార్డ్
- ●Telangana Activists Identification | ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి 250 గజాల స్థలం, ఆసరా పెన్షన్, హెల్త్ కార్డు, ఉచిత ఆర్టీసీ ప్రయాణం
- ●Taapsee | నాలుగేళ్ల తర్వాత తెలుగు సినిమాలో తాప్సీ - బాలీవుడ్లో ఆఫర్లు తగ్గడమే కారణమా?

Eesha Rebba | కొత్తింట్లో అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్ - అమ్మ పేరు పెట్టానంటూ ఎమోషనల్ పోస్ట్

Telangana Farmers Commission | ఎఫ్టీఎల్ ఆక్రమణలు కూల్చేయండి.. చెరువుల రక్షణకు కొత్త చట్టం

Bakki Venkataiah | బాధితులు వస్తే తక్షణమే స్పందించండి.. సామాజిక న్యాయం పాటించండి

Kidney Symposium 2026 | కిడ్నీ మార్పిడిలో అద్భుతాలు: 400+ సర్జరీలతో యశోద హాస్పిటల్స్ సరికొత్త రికార్డ్



