Kanimozhi | కాంగ్రెస్‌తో పొత్తు ముగిసింది.. సభలో వారిపక్కన కూర్చోం.. ఓంబిర్లాకు డీఎంకే లేఖ
Kanimozhi | లోక్‌సభలో డీఎంకే సభ్యుల సీటింగ్ మార్చాలంటూ స్పీకర్ ఓం బిర్లా (Om Birla)కు డీఎంకే లేఖ రాసింది. కాంగ్రెస్‌తో తమ పార్టీ పొత్తు ముగిసిపోయిందని డీఎంకే ఎంపీ కనిమొళి (Kanimozhi) ఆ లేఖలో పేర్కొన్నారు.
- ఇండియా కూటమిలో చిచ్చు పెట్టిన టీవీకే
- డీఎంకే ఎంపీలకు విడిగా సీట్లు కేటాయించండి
- లోక్‌సభ స్పీకర్‌కు కనిమొళి లేఖ
Kanimozhi | తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులు ఇండియా కూటమిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి మద్దతివ్వాలన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కూటమిలో చిచ్చు రేపింది. దీనివల్ల సుదీర్ఘకాలం డీఎంకేతో హస్తం పార్టీకి ఉన్న బంధం తెగిపోయింది. ఇక కాంగ్రెస్ నిర్ణయంపై డీఎంకే తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.
లోక్‌సభలో డీఎంకే సభ్యుల సీటింగ్ మార్చాలంటూ స్పీకర్ ఓం బిర్లా (Om Birla)కు డీఎంకే లేఖ రాసింది. కాంగ్రెస్‌తో తమ పార్టీ పొత్తు ముగిసిపోయిందని డీఎంకే ఎంపీ కనిమొళి (Kanimozhi) ఆ లేఖలో పేర్కొన్నారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సభలో కాంగ్రెస్ ఎంపీల పక్కన కూర్చోవడం సముచితం కాదని అభిప్రాయపడ్డారు. అందుకే డీఎంకే ఎంపీలకు (DMK MPs) ప్రత్యేకంగా సీటింగ్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తమ ఎంపీలు లోక్‌సభ (Lok Sabha)లో తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా.. వారికి విడిగా సీట్లు కేటాయించాలని కోరారు.
డీఎంకేతో కాంగ్రెస్ కటిఫ్..
ఇదిలా ఉండగా.. తమిళనాడులో రాజకీయాలు క్షణక్షణం మారుతున్నాయి. తాజా ఎన్నికల్లో 108 స్థానాల్లో గెలిచి విజయ్ నేతృత్వంలోని టీవీకే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మద్దతు మాత్రం దక్కించుకోలేకపోయింది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్‌కి హస్తం పార్టీ మద్దతు ప్రకటించింది. దీంతో డీఎంకేతో హస్తంపార్టీకి సుదీర్ఘకాలం పాటూ ఉన్న బంధం తెగిపోయినట్లైంది. ఇక కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు విజయ్ పార్టీకి మద్దతిచ్చినా అవసరమైన మెజారిటీ రాలేదు. దీంతో ఇతర చిన్న పార్టీల మద్దతుకోసం టీవీకే ప్రయత్నిస్తోంది.
డీఎంకే-ఏఐఏడీఎంకే పొత్తు..?
ఇంతలోనే డీఎంకే-ఏఐడీఎంకే చేతులు కలిపే అవకాశం ఉన్నట్లు కొత్త ప్రచారం మొదలైంది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ రెండు పార్టీలు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, బీజేపీతో కూటమిగా ఉన్న ఏఐఏడీఎంకేకి స్టాలిన్ పార్టీ ఓ షరతు పెట్టిందని టాక్ వినిపిస్తోంది. బీజేపీ నుంచి బయటకు వస్తేనే మీతో చేతులు కలుపుతామని కండిషన్ పెట్టినట్లు సమాచారం. అయితే, దీనిపై క్లారిటీ లేదు.
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

TVK | రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు.. సీపీఎం హెచ్చరికలతో ప్రచారానికి చెక్‌పెట్టిన టీవీకే
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



