త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kanimozhi | మ‌హిళ‌ల‌ను బీజేపీ హ్యూమ‌న్ షీల్డ్‌గా వాడుకుంటోంది : డీఎంకే ఎంపీ క‌నిమొళి

Kanimozhi | “మహిళా రిజర్వేషన్ చట్టం 2023ను నిన్న ఎందుకు నోటిఫై చేశారు..?” అంటూ డీఎంకే ఎంపీ కనిమొళి (DMK MP Kanimozhi) ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు.

D

National | Published On Apr 17, 2026, 12.28 pm IST

Kanimozhi | మ‌హిళ‌ల‌ను బీజేపీ హ్యూమ‌న్ షీల్డ్‌గా వాడుకుంటోంది : డీఎంకే ఎంపీ క‌నిమొళి
Advertisement

Kanimozhi | లోక్‌స‌భ‌లో (Lok Sabha) రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లుపై వాడీవేడీగా చ‌ర్చ కొన‌సాగుతోంది. అదే స‌మ‌యంలో చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుపై (womens reservation bill) స‌భ‌లో చ‌ర్చ జ‌రుగుతుండ‌గా.. ఈ చ‌ట్టం అమ‌ల్లోకి వ‌చ్చిందంటూ ప్ర‌భుత్వం గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌డాన్ని విప‌క్షాలు త‌ప్పుబ‌ట్టాయి. ఈ మేర‌కు కేంద్రానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న తెలిపాయి. “మహిళా రిజర్వేషన్ చట్టం 2023ను నిన్న ఎందుకు నోటిఫై చేశారు..?” అంటూ డీఎంకే ఎంపీ కనిమొళి (DMK MP Kanimozhi) ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు.

బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా క‌నిమొళి ఇవాళ స‌భ‌లో మాట్లాడారు. ఈ బిల్లు తప్పుదోవ పట్టించేలా, అస్పష్టంగా ఉందని ఆమె విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో ప్రవేశపెట్టినప్పటికీ.. ఇది భారతదేశ సమాఖ్య నిర్మాణాన్ని దెబ్బతీసేలా ఉందని ఆమె ఆరోపించారు. ఈ సంద‌ర్భంగా కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వంపై క‌నిమొళి తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌న‌గ‌ణ‌న ఆల‌స్యంపై స్పందిస్తూ.. “వైఫల్యాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకోగల ఏకైక ప్రభుత్వం ఇదే” అంటూ ఎద్దేవా చేశారు.

అంతా ట్రాప్‌..

మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడం ఓ ట్రాప్ అని క‌నిమొళి అన్నారు. బీజేపీ మహిళలను ఒక హ్యూమన్ షీల్డ్‌గా (human shield) వాడుకుంటోంద‌ని ఆరోపించారు. అత్యధిక అక్షరాస్యత కలిగిన తమిళనాడులోని మహిళలు తమ హక్కులను హైజాక్ చేయడానికి అనుమతించర‌ని ఈ సంద‌ర్భంగా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న 543 మంది సభ్యుల్లోనే మీరు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వలేరు..? అంటూ హోం మంత్రి అమిత్ షాను క‌నిమొళి ప్ర‌శ్నించారు.

డీలిమిటేష‌న్‌కు మేం వ్య‌తిరేకం..

డీలిమిటేష‌న్‌కు త‌మ పార్టీ పూర్తిగా వ్య‌తిరేక‌మ‌ని ఈ సంద‌ర్భంగా క‌నిమొళి స్ప‌ష్టం చేశారు. ఈ బిల్లుపై చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో నోటిఫికేష‌న్ ఎలా ఇస్తార‌ని కేంద్రాన్ని ప్ర‌శ్నించారు. ఈ అంశంపై క‌నీసం అఖిల‌ప‌క్ష స‌మావేశం కూడా నిర్వ‌హించ‌లేద‌ని మండిప‌డ్డారు. రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ఎప్పుడు మాట్లాడార‌ని ప్ర‌శ్నించారు. అంతేకాదు, ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల స‌మ‌యంలో హ‌డావుడిగా స‌మావేశాలు నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని నిల‌దీశారు. ఎన్నిక‌లు పూర్త‌య్యాక స‌మావేశాలు నిర్వ‌హించొచ్చు క‌ద అంటూ వ్యాఖ్యానించారు.

న‌ల్ల దుస్తుల్లో..

కాగా, డీలిమిటేష‌న్‌ను త‌మిళ‌నాడులోని డీఎంకే ప్ర‌భుత్వం మొద‌టి నుంచీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. దీని వ‌ల్ల ద‌క్షిణాది, చిన్న రాష్ట్రాల‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ఈ బిల్లును ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అమ‌లు చేయ‌కూడ‌ద‌ని ప‌ట్టుబ‌డుతోంది. ఒక వేళ ఈ బిల్లు అమ‌ల్లోకి తెస్తే త‌మిళ‌నాడు స్తంభించిపోతుందంటూ సీఎం ఎంకే స్టాలిన్ ఇటీవ‌లే ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు కూడా. ఈ బిల్లును వెంట‌నే వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఈ నేప‌థ్యంలో ఈ స‌మావేశాల‌కు డీఎంకే ఎంపీలు న‌ల్ల దుస్తుల్లో హాజ‌రై త‌మ నిర‌స‌న తెలియ‌జేశారు.

Also Read..

మోదీ, షా మాట‌ల‌ను న‌మ్మ‌లేం.. డీలిమిటేష‌న్‌పై ఎంకే స్టాలిన్‌

రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్‌గా ఎన్నికైన‌ హ‌రివంశ్ నారాయ‌ణ్ సింగ్

అమల్లోకి మహిళా రిజర్వేషన్ చట్టం.. గెజిట్ విడుద‌ల చేసిన న్యాయ‌శాఖ‌

Advertisement
Advertisement