త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gajjela Kantham | కోహినూర్‌లో 25 శాతం వాటా తీసుకున్న‌వ్‌.. అయ్యకు అబ్బకు పుడ్తే అబ‌ద్ద‌మ‌ని చెప్పు

Gajjela Kantham | ఏపీలోని అమరావతిలో 1000 కోట్లతో కేటీఆర్ (KTR) భార్య శైలిమా పేరుతో హోటల్ కట్టార‌ని.. కోహినూర్ హోటల్‌లో బెదిరించి 25 శాతం వాటా తీసుకున్నార‌ని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ఆరోపించారు.

S

Telangana | Published On Oct 5, 2026, 3.55 pm IST

Gajjela Kantham | కోహినూర్‌లో 25 శాతం వాటా తీసుకున్న‌వ్‌.. అయ్యకు అబ్బకు పుడ్తే అబ‌ద్ద‌మ‌ని చెప్పు
Advertisement
  • అమరావతిలో 1000 కోట్లతో నీ స‌తీమ‌ణి శైలిమా పేరుతో హోటల్ కట్టిన‌వ్‌
  • మెడికోవర్‌తో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం లేదు.. దానికి ఎండీ డాక్టర్ అనిల్ కృష్ణ, 42 మంది డైరెక్టర్లు ఉన్నరు
  • రేవంత్ కుటుంబానికి సంబంధముంటే ఆధారాలు భయటపెట్టు
  • మైండ్ వాల్ట్ కార్పోరేట్ స్కూల్ రేవంత్ కూతురిది అని కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తుండు
  • ఆయ‌న‌కు పిచ్చి లేసిన‌ట్టుంది.. ఎర్ర‌గడ్డ‌కు పంపాల్సిందే
  • కేటీఆర్‌పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ధ్వ‌జం

Gajjela Kantham | త్రినేత్ర న్యూస్: ఏపీలోని అమరావతిలో 1000 కోట్లతో కేటీఆర్ (KTR) భార్య శైలిమా పేరుతో హోటల్ కట్టార‌ని.. కోహినూర్ హోటల్‌లో బెదిరించి 25 శాతం వాటా తీసుకున్నార‌ని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ఆరోపించారు. కేటీఆర్ అయ్యకు అబ్బకు పుట్టి ఉంటే వాస్తవం కాదని చెప్పాలన్నారు. మెడికోవ‌ర్‌తో రేవంత్‌రెడ్డి(Revanth Reddy) కి సంబంధం లేద‌ని.. ఒక‌వేళ ఉంటే ఆధారాలు బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేశారు. మైండ్ వాల్ట్ కార్పోరేట్ స్కూల్ రేవంత్ కూతురిదని త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఆయ‌న‌కు పిచ్చి లేసి రోడ్ల‌పై తిరుగుతున్నాడ‌ని.. వెంట‌నే ఎర్ర‌గ‌డ్డ‌కు పంపించాల‌ని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ పై తప్పుడు ఆరోపణలు చేస్తే నాలుక కోస్తామ‌ని హెచ్చ‌రించారు. గాంధీభ‌వ‌న్‌లో సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

వాటి మీద‌ ఇప్పుడు విచార‌ణ జ‌రుగుతుంది..

కేటీఆర్‌కు దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం ఆస్తులుపై ఆధారాలు ఉంటే బయటపెట్టాలి. కేటీఆర్ హైటెక్ సిటీలో యశోద ఆసుపత్రికి 210 కోట్ల ఎకరాల ప్రభుత్వ భూమిని 33 కోట్లకు ఇచ్చారు. కరోన టైంలో యశోద ఆసుపత్రిపై 3 వేల కోట్లు సంపాదించాడు. యశోద ఆసుపత్రికి ఎకరానికి 11 కోట్ల చొప్పున 3 ఎకరాలకు డబ్బులు ఇచ్చిండు. రెండు ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా పెట్టిండు. గజం లక్షా 50 వేలు ఉంటే 33 వేలకే ఇచ్చిండు.
2015, జూన్ 16న‌ జీవో 82, సర్వే no.41/14, 2015, అక్టోబ‌ర్ 7న జీవో 191 ద్వారా యశోద ఆసుపత్రికి భూమిని ధారాదత్తం చేసిండు. 2015లో కేటీఆర్‌కు 15 శాతం వాటా ఇచ్చిండు, వాటి మీద ఇప్పుడు విచారణ జరుగుతుంది.

అనిల్ కృష్ణ నుంచి 100 కోట్లు తీసుకుండు..

కేటీఆర్‌కు మతి స్థిమితం లేదు. పిచ్చి లేచి రోడ్ల మీద‌ తిరుగుతుండు. కేటీఆర్‌ను ఎర్రగడ్డకు పంపించాల్సిందే. చెంచాగాళ్లతో మాట్లాడిస్తున్నారు. మెడికోవ‌ర్‌ ఇప్పుడు పెట్టింది కాదు, సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభానికి మాత్రమే పోయిండు. మెడికోవ‌ర్‌కు ఎండీ డాక్టర్ అనిల్ కృష్ణ, 42 మంది డైరెక్టర్లు ఉన్నారు. అనిల్ కృష్ణను బెదిరించి పది ఏండ్లు ఏడాదికి 10 కోట్లు లాగా 100 కోట్లు తీసుకుండు.

మా ముఖ్యమంత్రి ప్రమాణ‌ స్వీకారం చేసినప్పటి నుంచి ఒక్క రూపాయి లేదు. నేను చూపించే హోటల్స్ ఆధారాలు అన్ని కేటీఆర్ ఒప్పుకుండు. 2021లో జగన్‌కు డబ్బులు ఇచ్చిండు. మాక్స్ బిన్ ఫార్మా కంపెనీ 2023, మార్చి 31న బీఆర్ఎస్ హయాంలో పెట్టారు. మాక్స్ బిన్ తో ముఖ్యమంత్రికి సంబంధం ఏముంది? కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు 2023లో సీఎం రేవంత్ రెడ్డి అల్లుడికి 16 శాతం వాటా ఉంది. స్వచ్ బయో కంపెనీ 2025, జూన్ 24 లో ప్రారంభం అయింది. పసుపునూరి హరివర్దన్ రెడ్డి డైరెక్టర్ ముఖ్యమంత్రికి సంబంధం లేదు.

మైండ్ వాల్ట్ కార్పోరేట్ స్కూల్ హైదరాబాద్‌లో లేదు

సోడా కన్స్ట్రక్షన్ కంపెనీ మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కొడుకుది. 2010, జూలై 12న కంపెనీ పెట్టారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు గీత హుందాయ్‌ షో రూమ్ 2021లో పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి సతీమణి ఫ్యామిలీ ముందు నుండే ఉన్నత కుటుంబం. అపుడు రేవంత్ రెడ్డి మంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదు. మైండ్ వాల్ట్ కార్పోరేట్ స్కూల్ హైదరాబాద్‌లో లేదు.

2014 ముందు కేటిఆర్‌కు ఒక్క రూపాయి లేదు. 2014 తర్వాత వేల కోట్లు ఎట్లా వచ్చినవి కేటీఆర్? దొర అహంకారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కేటీఆర్‌ను తన్ని తరిమేస్తారు. చెంచాగాళ్లతో ప్రెస్‌మీట్‌ పెట్టిస్తే తెలంగాణ ప్రజలు నమ్మరు అని గ‌జ్జెల కాంతం హిత‌వు ప‌లికారు.

Advertisement
Advertisement