Insurance | మకరవిళక్కు వేళ శుభవార్త.. అయ్యప్ప భక్తులకు బీమా కవచం!
Insurance | మకరవిళక్కు, మండల పూజల నేపథ్యంలో అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (TDB) శుభవార్త చెప్పింది. శబరిమల యాత్రకు వచ్చే భక్తులకు తొలిసారిగా రూ.2 లక్షల మరణ బీమాను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ బీమా ప్రీమియం మొత్తాన్ని దేవస్వం బోర్డు భరించనుంది.
Devotional | Published On Nov 14, 2026, 5.01 pm IST
- తొలిసారిగా బీమా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తూ ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు నిర్ణయం
- ఎల్ఐసీతో కలిసి పథకం అమలుకు రెడీ
Insurance | మకరవిళక్కు, మండల పూజల నేపథ్యంలో అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (TDB) శుభవార్త చెప్పింది. శబరిమల యాత్రకు వచ్చే భక్తులకు తొలిసారిగా రూ.2 లక్షల మరణ బీమాను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ బీమా ప్రీమియం మొత్తాన్ని దేవస్వం బోర్డు భరించనుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) సహకారంతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఇప్పటివరకు భక్తులకు అందుబాటులో ఉన్న బీమా సౌకర్యాలు ప్రమాద బీమాకే పరిమితం కాగా.. తాజాగా సాధారణ మరణాలకు కూడా బీమా వర్తించేలా కొత్త విధానాన్ని తీసుకువచ్చింది.
వర్చువల్ క్యూ, స్పాట్ బుకింగ్ భక్తులకు వర్తింపు
బీమాకు సంబంధించిన వివరాలను టీడీబీ అధ్యక్షుడు కే జయకుమార్ వెల్లడించారు. వర్చువల్ క్యూ, స్పాట్ బుకింగ్ ద్వారా వచ్చే భక్తులందరికీ ఈ బీమా వర్తిస్తుందని తెలిపారు. శబరిమల కొండలు ఎక్కే ముందు రోజు నుంచి మూడు రోజుల పాటు బీమా ఉంటుందని చెప్పారు. ఈ గడువులో భక్తుడు స్వస్థలానికి తిరిగి వెళ్లిన తర్వాత మరణించినా బీమా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. వర్చువల్ క్యూ, స్పాట్ బుకింగ్ నమోదు లేకుండా వచ్చిన భక్తుడి విషయంలోనూ ప్రత్యేక వెసులుబాటు కల్పించనున్నారు. మరణించిన వ్యక్తి నిజమైన అయ్యప్ప భక్తుడేనని దేవస్థానం బోర్డు ధ్రువీకరిస్తే.. క్లెయిమ్‌ను ఎల్ఐసీ పరిశీలిస్తుందని జయకుమార్ వెల్లడించారు. ఈ పథకంపై బోర్డు తుది నిర్ణయం తీసుకుందని, ఎల్ఐసీతో అవగాహన ఒప్పందం, పాలసీకి సంబంధించిన లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉందని వివరించారు.
భక్తులకు ఇంటికే ప్రసాదం..
ఈ సారి భక్తుల సౌకర్యార్థం మరో వినూత్న నిర్ణయం తీసుకున్నది దేవస్వం బోర్డు. శబరిమలలో కొనుగోలు చేసిన అరవణ ప్రసాదాన్ని పోస్టల్ శాఖ ద్వారా నేరుగా ఇంటికే తెప్పించుకునే సదుపాయం కల్పించనున్నారు. భక్తులు పోస్టల్ కౌంటర్‌లో డబ్బులు చెల్లించి, తమ అడ్రస్ ఇస్తే సరిపోతుంది. ప్రసాదాన్ని పోస్టు ద్వారా ఇంటికి పంపిస్తారు. ఇందుకోసం స్వల్పంగా సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తారు. నవంబర్ 17 నుంచి శబరిమల అయ్యప్ప యాత్ర సీజన్ మొదలవుతుంది.
ఈ నెల 18 నుంచి మండల–మకరవిళక్కు మహోత్సవాలు
ఈ నెల 18 నుంచి మండల–మకరవిళక్కు మహోత్సవాలు మొదలుకానున్నాయి. ఈ క్రమంలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దేవస్వం బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. నిలక్కల్‌లో ఏఐ ఆధారిత స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఉన్న 22 పార్కింగ్ ప్రాంతాలను 11 జోన్లుగా ఏకీకృతం చేయనున్నారు. వాహనాల రాకపోకలను నియంత్రించడంతో పాటు, ఎన్ని వాహనాలు లోపలికి వస్తున్నాయి.. బయటకు వెళ్తున్నాయనే వివరాలను ఏఐ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తారు. దేవస్థానం బోర్డు, పోలీసు శాఖ సంయుక్తంగా సుమారు రూ.4.5 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టాయి. ఇందులో పోలీసు శాఖ రూ.3.25 కోట్లు, బోర్డు రూ.1.25 కోట్లు ఖర్చు చేయనున్నాయి. కోర్టు అనుమతితో స్థలం చదును చేసిన చక్కుపాలం ప్రాంతంలో అదనంగా 300 నుంచి 400 కార్ల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్కింగ్ ప్రాంతాల్లో ఫాస్ట్‌ట్యాగ్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
మరిన్ని సౌకర్యాలు.. మెరుగైన రవాణా
యాత్రికుల సౌకర్యార్థం చక్కుపాలం పార్కింగ్ ప్రాంతం వరకు ట్యాక్సీలను అనుమతించనున్నారు. చలక్కాయం-పంపా మార్గంలో శాశ్వత ఎల్ఈడీ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. అప్పాచిమేడు విశ్రాంతి ప్రదేశాన్ని టైల్స్, లైటింగ్‌తో ఆధునీకరించారు. యాత్రికులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ఫెస్టివల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఎరుమేలి మార్గంలో దిశానిర్దేశక బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మకరవిళక్కు, మండల పూజల సీజన్‌లో భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తూ.. బీమా సౌకర్యం నుంచి ప్రసాదం ఇంటికే చేరవేసే ఏర్పాట్ల వరకు టీడీబీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sabarimala Special Trains | అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, చర్లపల్లి నుంచి శబరిమలకు 54 ప్రత్యేక రైళ్లు
నవంబర్ 13, 2026

Sabarimala Online Booking | అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 29 నుంచి ఆన్లైన్ బుకింగ్!
అక్టోబర్ 27, 2026

Sabarimala | అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక పంపా వరకూ బస్సు
అక్టోబర్ 23, 2026
తాజావార్తలు
- ●Cinematica Expo 2026 | హైదరాబాద్ టీ-హబ్‌లో 'సినిమాటికా ఎక్స్పో 2026'.. సినిమా, AI, గేమింగ్ క్రియేటర్లకు గోల్డెన్ ఛాన్స్
- ●ISRO Apprentice | సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లో 400 అప్రెంటిస్‌లు
- ●Pink Driver Lalitha | లలిత స్కూటీపై రాహుల్ రైడ్.. ఆమె ఏమన్నారంటే..?
- ●Family Pension | ఫ్యామిలీ పెన్షన్‌పై కేంద్రం కీలక స్పష్టత.. ఎవరికి ఎంత ఆదాయ పరిమితి?
- ●Abki Baar AQI 400-Paar | ‘అబ్ కీ బార్, ఏక్యూఐ 400-పార్’.. ఢిల్లీ కాలుష్యంపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు
- ●Special Trains | రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 14 ప్రత్యేక రైళ్లలో బెర్తులు ఖాళీ..!

Cinematica Expo 2026 | హైదరాబాద్ టీ-హబ్‌లో 'సినిమాటికా ఎక్స్పో 2026'.. సినిమా, AI, గేమింగ్ క్రియేటర్లకు గోల్డెన్ ఛాన్స్

ISRO Apprentice | సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లో 400 అప్రెంటిస్‌లు

Pink Driver Lalitha | లలిత స్కూటీపై రాహుల్ రైడ్.. ఆమె ఏమన్నారంటే..?

Family Pension | ఫ్యామిలీ పెన్షన్‌పై కేంద్రం కీలక స్పష్టత.. ఎవరికి ఎంత ఆదాయ పరిమితి?



