Elephant | ఊరేగింపులో బీభత్సం సృష్టించిన ఏనుగు.. పరుగులు పెట్టిన ప్రజలు.. వీడియో
Elephant | హైదరాబాద్ పాతబస్తీలో ఊరేగింపు సందర్భంగా ఏనుగు (Elephant) బీభత్సం సృష్టించింది. మతపరమైన ఊరేగింపులో పాల్గొన్న ఏనుగు నియంత్రణ కోల్పోవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
Elephant | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్ పాతబస్తీలో ఊరేగింపు సందర్భంగా ఏనుగు (Elephant) బీభత్సం సృష్టించింది. మతపరమైన ఊరేగింపులో పాల్గొన్న ఏనుగు నియంత్రణ కోల్పోవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన ఏనుగు సంరక్షకులు దానిని తిరిగి అదుపులోకి తీసుకుని కట్టేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
గ్యార్వీషరీఫ్ (Gyarvi Shareef) సందర్భంగా శుక్రవారం రాత్రి పాతబస్తీలోని ఇరానీ గల్లీ (Irani Galli), దారుల్‌షిఫా, మీరాలం మండి ప్రాంతాల మీదుగా ఏనుగు ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో కర్ణాటకలోని గుల్బర్గా నుంచి ప్రత్యేకంగా తీసుకువ 'మైనక' (Mainaka) అనే ఏనుగు పాల్గొన్నది. ఊరేగింపు కొనసాగుతుండగా బ్యాండ్ శబ్దాలు, భారీ జనసమూహం కారణంగా ఏనుగు ఒక్కసారిగా ఆగ్రహానికి గురై పరుగులు తీసింది.

అదుపుతప్పిన అది జనాల వైపు దూసుకురావడంతో భక్తులు, స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కొన్ని వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అప్రమత్తమైన మావటీలు, అటవీ సిబ్బంది ఎలాంటి ప్రమాదం జరుగకముందే దానిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం దానిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. సమాచారం అందుకున్న చార్మినార్ జోన్ డీసీపీ, స్థానిక ఎమ్మెల్యే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి, నిర్వాహకులతో చర్చించి ఊరేగింపును నిలిపివేయించారు. ఆ తర్వాత ఒంటెలతో ఊరేగింపును నిర్వహించారు.
An elephant leading the gyvarvi sharif procession looked irritated.
A large crowd, including police officers can be seen running around the elephant near Gulzar Houz.
Mirchowk Police said no injuries have been reported https://t.co/nI1prbxHrl
— The Siasat Daily (@TheSiasatDaily) November 13, 2026
సంబంధిత వార్తలు

Naaz Anjum Hyderabad | రూ.80 పెట్టుబడితో మొదలై నెలకు రూ.లక్ష సంపాదన.. హైదరాబాద్ ‘బిర్యానీ క్వీన్’ నాజ్ అంజుమ్ సక్సెస్ స్టోరీ!
నవంబర్ 14, 2026

Thammidikunta Lake | తమ్మిడికుంట చెరువులో చిల్డ్రన్స్ డే వేడుకలు.. ఆటపాటలతో పిల్లలు ఎంజాయ్
నవంబర్ 14, 2026

Cinematica Expo 2026 | హైదరాబాద్ టీ-హబ్లో ‘సినిమాటికా ఎక్స్పో 2026’.. సినిమా, AI, గేమింగ్ క్రియేటర్లకు గోల్డెన్ ఛాన్స్
నవంబర్ 14, 2026
తాజావార్తలు
- ●Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!
- ●Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..
- ●Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!
- ●Silent Heart Attack Causes | గుండెపోటు సడన్గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!
- ●Gold Price | వరుసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధర.. తులంపై రూ.2,500 డౌన్..!
- ●IAS Rajiv Hanumanthu Road Accident | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తెలంగాణ ఐఏఎస్ రాజీవ్ హనుమంతు.. ఫోన్లో పరామర్శించి భరోసా ఇచ్చిన పొంగులేటి

Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!

Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..

Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!

Silent Heart Attack Causes | గుండెపోటు సడన్గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!



