త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Urban Farming Scheme | ఉద్యాన శాఖ ఆధ్వ‌ర్యంలో కూర‌గాయ‌ల సాగుపై ఉచిత శిక్ష‌ణ‌

Urban Farming Scheme | రాష్ట్ర ఉద్యానశాఖ ఆధ్వర్యంలో అర్బన్‌ ఫామింగ్‌ పథకంలో భాగంగా ఇంటి ఆవాసాలపై(మిద్దెలపై) కూరగాయల పెంపకం మీద శిక్షణ కార్యక్రమాలు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

S

Hyderabad | Published On Nov 21, 2026, 5.42 pm IST

Urban Farming Scheme | ఉద్యాన శాఖ ఆధ్వ‌ర్యంలో కూర‌గాయ‌ల సాగుపై ఉచిత శిక్ష‌ణ‌
Advertisement

Urban Farming Scheme | త్రినేత్ర న్యూస్ : రాష్ట్ర ఉద్యానశాఖ ఆధ్వర్యంలో అర్బన్‌ ఫామింగ్‌ పథకంలో భాగంగా ఇంటి ఆవాసాలపై(మిద్దెలపై) కూరగాయల పెంపకం మీద శిక్షణ కార్యక్రమాలు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్, సికింద్రాబాద్ జంట న‌గ‌రాల్లో ఇంటి ఆవాసాల‌పై, బాల్క‌నీలో కూర‌గాయ‌ల పెంప‌కం చేయాల‌నుకునే వారికి ఈ నెల 22న ఉచిత శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు. ఈ శిక్ష‌ణ ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఆసక్తిగల వారు రూ.100 ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు నాంపల్లిలోని రాష్ట్ర ఉద్యాన శిక్షణ కేంద్రంలో లేదా 8977714411, 8688848714 నంబర్లలో సంప్రదించాలి.

Advertisement

తాజావార్తలు

Advertisement