Harish Rao | ప్రజాస్వామ్యానికి వెన్నెముక ఎన్నికల సంఘం.. అది అధికారంలో ఉన్నవారికి రక్షణ కవచం కావొద్దు: హరీశ్ రావు
Harish Rao | భారత ప్రజాస్వామ్యానికి ఎన్నికల సంఘం (ECI) వెన్నెముక అది, అది అధికారంలో ఉన్నవారికి రక్షణ కవచం కాకూడదని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఈసీ నియామకాలు, దాని స్వతంత్రత, పనితీరుపై వస్తున్న ప్రశ్నలు మన రాజ్యాంగ ప్రజాస్వామ్య పునాదులను దెబ్బతీస్తాయని చెప్పారు.
Harish Rao | త్రినేత్ర న్యూస్: భారత ప్రజాస్వామ్యానికి ఎన్నికల సంఘం (ECI) వెన్నెముక అది, అది అధికారంలో ఉన్నవారికి రక్షణ కవచం కాకూడదని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఈసీ నియామకాలు, దాని స్వతంత్రత, పనితీరుపై వస్తున్న ప్రశ్నలు మన రాజ్యాంగ ప్రజాస్వామ్య పునాదులను దెబ్బతీస్తాయని చెప్పారు. రాజ్యాంగంలోని (Constitution) ఆర్టికల్స్ 324, 325, 326తో పాటు 1950, 1951 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టాలు.. విశ్వసనీయమైన, నిష్పక్షపాత ఎన్నికల వ్యవస్థను సూచిస్తున్నాయని వెల్లడించారు.
అర్హత ఉన్న ఏ ఒక్కరి ఓటు హక్కును ఏకపక్షంగా నిరాకరించడానికి వీలులేదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల సంఘంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతున్నదని చెప్పారు. ఎన్నికల సంఘంపట్ల పట్ల ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టలేకపోతే ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీనామా చేయాల్సిందే. ఈ వైఫల్యానికి సీఈసీ జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) పూర్తి బాధ్యత వహించాలి. ఏ వ్యక్తి లేదా ప్రభుత్వం కన్నా ప్రజాస్వామ్యమే (Democracy) గొప్పది అని చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌వేదికగా ట్వీట్ చేశారు.
The Election Commission is the backbone of Indian democracy, not a shield for those in power.
Any questions over its appointments, independence and functioning strike at the very foundations of our constitutional democracy.
Articles 324, 325 & 326 of the Constitution, along with the Representation of the People Acts, 1950 & 1951, demand a credible, impartial and inclusive electoral system.
No eligible voter can be arbitrarily denied their right to vote.
Gyanesh Kumar must take responsibility.
If the Election Commission cannot command public confidence, the CEC must resign.
Democracy is bigger than any individual or government.
#Gyaneshitsdonebro
— Harish Rao Thanneeru (@BRSHarish) October 9, 2026
తాజావార్తలు
- ●Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు
- ●POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు
- ●Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు

POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?






