Pawan Kalyan | కార్తీక దీపం సీరియల్ డైరెక్టర్‌తో పవన్ కళ్యాణ్ సినిమా – చిరంజీవి కారణంగా ఆగిపోయింది
కార్తీక దీపం సీరియల్ డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా రావాల్సింది. కానీ చిరంజీవి సినిమా కారణంగా అనౌన్స్‌మెంట్ తర్వాత పవన్ కళ్యాణ్ మూవీ ఆగిపోయింది.
Entertainment | Published On Jan 4, 2026, 2.17 pm IST
Pawan Kalyan | సక్సెస్ ఫెయిల్యూర్‌లకు అతీతంగా టాలీవుడ్‌లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు పవన్ కళ్యాణ్. స్టార్‌డమ్, ఇమేజ్ లెక్కలతో పట్టింపులు లేకుండా కథ నచ్చితే కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి రెడీగా ఉంటారు పవన్ కళ్యాణ్. దర్శకుడి సక్సెస్ రేటు ఎలా ఉంది? అతడికి విజయాలు ఉన్నాయా? లేదా? అన్నది పట్టించుకోరు. కెరీర్ ఆరంభం నుంచి ఇదే రూటును ఫాలో అవుతూ వస్తున్నారు పవన్ కళ్యాణ్.
కార్తీక దీపం సీరియల్ డైరెక్టర్...
కార్తీక దీపం సీరియల్ డైరెక్టర్ కాపుగంటి రాజేంద్రతో కెరీర్ ఆరంభంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయాల్సింది. తొలి ప్రేమ రిలీజ్‌కు ముందు ఓ హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ కోసం కాపుగంటి రాజేంద్ర ఓ కథను సిద్ధం చేశారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించడానికి రెడీ అయ్యారు. కథ నచ్చడంతో పవన్ కళ్యాణ్ ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో హీరోయిన్‌గా సాక్షి శివానంద్‌ను ఫైనల్ చేశారు. సినిమా షూటింగ్ కోసం అంతా రెడీ చేశారట. ఓ భారీ సెట్ కూడా వేశారట. కానీ కాపుగంటి రాజేంద్ర సిద్ధం చేసిన కథకు చిరంజీవి బావగారు బాగున్నారాతో పాటు నాగార్జున చంద్రలేఖకు దగ్గరి పోలికలు ఉండటంతో పవన్ కళ్యాణ్ సినిమాను అల్లు అరవింద్ పక్కనపెట్టేశారట.
అలా చిరంజీవి, నాగార్జున కారణంగా పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే ఛాన్స్‌ను కాపుగంటి రాజేంద్ర మిస్సయ్యారు. పవన్ కళ్యాణ్‌తో సినిమా కంటే ముందు తెలుగులో కాపుగంటి రాజేంద్ర డబ్బు భలే జబ్బు, శివ్‌శంకర్‌తో పాటు రాంబాబుగాడి పెళ్లాం సినిమాలకు దర్శకత్వం వహించారు.
ఇవేవీ అతడికి విజయాలను తెచ్చిపెట్టలేకపోయాయి. ఆ తర్వాత సీరియల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లో సక్సెస్ కాలేకపోయినా సీరియల్స్ మాత్రం కాపుగంటి రాజేంద్రకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కార్తీక దీపం సీరియల్ పెద్ద సక్సెస్‌గా నిలిచింది. ఈ సీరియల్‌తో బుల్లితెరపై టాప్ డైరెక్టర్‌గా మారాడు.
ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న కార్తీక దీపం ఇది నవ వసంతం సీరియల్‌కు కాపుగంటి రాజేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న కార్తీక దీపం2 టీఆర్‌పీ రేటింగ్‌లో టాప్‌లో కొనసాగుతోంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



