త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | తెలంగాణ‌లో ఐటీరంగం దూసుకెళ్తోంది: మ‌హేశ్‌కుమార్ గౌడ్‌

Mahesh Kumar Goud | ఐటీ (IT) రంగంలో తెలంగాణ (Telangana) రాష్ట్రం దూసుకెళ్తోంద‌ని టీపీసీసీ (TPCC) అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ (MLC) మ‌హేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) చెప్పారు. ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విజ‌న్‌, అనుభ‌వం క‌లిగిన మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు (Sridhar Babu) వ‌ల్ల ఇది సాధ్య‌మైంద‌ని అన్నారు.

A

Telangana | Published On Jan 3, 2026, 2.15 pm IST

Mahesh Kumar Goud | తెలంగాణ‌లో ఐటీరంగం దూసుకెళ్తోంది: మ‌హేశ్‌కుమార్ గౌడ్‌
Advertisement

Mahesh Kumar Goud | ఐటీ (IT) రంగంలో తెలంగాణ (Telangana) రాష్ట్రం దూసుకెళ్తోంద‌ని టీపీసీసీ (TPCC) అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ (MLC) మ‌హేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) చెప్పారు. ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విజ‌న్‌, అనుభ‌వం క‌లిగిన మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు (Sridhar Babu) వ‌ల్ల ఇది సాధ్య‌మైంద‌ని అన్నారు. శాస‌న‌మండ‌లి స‌మావేశాల్లో మాట్లాడిన ఆయ‌న డీ సెంట్రలైజ్ ఆఫ్ డెవలప్‌మెంట్‌ ప్రైమ్ పాలసీ పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆదిలాబాద్‌కు త్వ‌ర‌లో విమానాశ్ర‌యం రానుంద‌ని పేర్కొన్నారు. హైదరాబాద్ మ‌హాన‌గ‌రం సమూలంగా అభివృద్ధి కావలసిన అవసరం ఉంద‌న్నారు. ఆదిలాబాద్‌, మ‌హ‌బూబాబాద్‌ల‌లో ఐటీ కేంద్రాల‌ను మెరుగుప‌ర‌చాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు. హైద‌రాబాద్ యావ‌త్ ప్ర‌పంచంలోని మేటి న‌గ‌రాల‌తో పోటీప‌డ‌బోతోంద‌ని చెప్పారు. పార్టీల‌క‌తీతంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటునందించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రికార్డు స్థాయిలో రూ.1.75ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని తెలిపారు. ప‌దేళ్లు ఐటీ మంత్రిగా కేటీఆర్ ఎన్ని వంద‌ల కోట్ల పెట్టుబ‌డులు తీసుకువ‌చ్చారో చెప్పాల‌ని బీఆర్ఎస్ నేత‌ల‌కు సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement