త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maoist Party | మావోయిస్టు పార్టీకి మ‌రో భారీ ఎదురుదెబ్బ‌

Maoist Party | మావోయిస్టు పార్టీ (Maoist Party) కి మ‌రో భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. మావోయిస్టు అగ్ర‌నేత‌, పార్టీ గెరిల్లా లిబ‌రేష‌న్ ఆర్మీ (పీఎల్‌జీఏ) (PLGA) చీఫ్, కేంద్ర క‌మిటీ స‌భ్యుడు బ‌ర్సే దేవా (Badse Deva) అలియాస్ సుక్క‌తో స‌హా 20 మంది మావోయిస్టులు భారీ ఆయుధాల‌తో స‌హా తెలంగాణ (Telangana) డీజీపీ (DGP) శివ‌ధ‌ర్‌రెడ్డి (Shivadhar Reddy) ఎదుట లొంగిపోయారు.

A

National | Published On Jan 3, 2026, 4.41 pm IST

Maoist Party | మావోయిస్టు పార్టీకి మ‌రో భారీ ఎదురుదెబ్బ‌
Advertisement

Maoist Party | మావోయిస్టు పార్టీ (Maoist Party) కి మ‌రో భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. మావోయిస్టు అగ్ర‌నేత‌, పార్టీ గెరిల్లా లిబ‌రేష‌న్ ఆర్మీ (పీఎల్‌జీఏ) (PLGA) చీఫ్, కేంద్ర క‌మిటీ స‌భ్యుడు బ‌ర్సే దేవా (Badse Deva) అలియాస్ సుక్క‌తో స‌హా 20 మంది మావోయిస్టులు భారీ ఆయుధాల‌తో స‌హా తెలంగాణ (Telangana) డీజీపీ (DGP) శివ‌ధ‌ర్‌రెడ్డి (Shivadhar Reddy) ఎదుట లొంగిపోయారు. ఆప‌రేష‌న్ క‌గార్ (Operation Kagar) ప్రారంభ‌మైన త‌రువాత తెలంగాణ‌లో జ‌రిగిన అతి పెద్ద లొంగుబాటు ఇదే కావ‌డం విశేషం. లొంగిపోయిన వారిలో పార్టీ తెలంగాణ రాష్ట్ర క‌మిటీ స‌భ్యుడు కంక‌ణాల రాజిరెడ్డి, ఆయ‌న స‌తీమ‌ణి అడ్లూరి ఈశ్వ‌రి అలియాస్ రేమ‌తో పాటు పీఎల్‌జీఏ మొద‌టి బెటాలియ‌న్ నుంచి ప‌ది మంది, టీఎస్‌సీ నుంచి ముగ్గురు, ఎస్ఎస్‌జెడ్‌బీ నుంచి ఇద్ద‌రు, దండ‌కార‌ణ్య స్పెష‌ల్ జోన్ క‌మిటీ నుంచి అయిదు మంది ఉన్నారు. వారి నుంచి 48 మౌంటెడ్ ఎంఎల్‌జీ ఆయుధాల‌ను స్వాధీనం చేసుకున్నారు. బార్సె దేవాపై రూ.యాభై ల‌క్ష‌ల రివార్డు ఉంది. పార్టీకి ఆయుధాలు స‌మ‌కూర్చ‌డంలో ఆయ‌న కీల‌కంగా వ్య‌వ‌హరించారు. ఆయ‌న లొంగుబాటుతో కేంద్ర‌క‌మిటీలో ఇక న‌లుగురే మిగిలిన‌ట్లైంది.

బార్సె దేవా త‌న వ‌ద్ద ఉన్న రూ.ఇర‌వై ల‌క్ష‌ల‌కు ఎస్ఐబీకి అప్ప‌గించారు. లొంగిపోయిన మావోయిస్టుల‌ను డీజీపీ కార్యాల‌యంలో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా డీజీపీ మాట్లాడుతూ పీఎల్‌జీఏ పూర్తిగా నిర్వీర్య‌మైపోయింద‌న్నారు. పీఎల్‌జీఏ బెటాలియ‌న్‌లో ఒక‌ప్పుడు 400 మందికి పైగా ఉండేవార‌ని, ప్ర‌స్తుతం 66 మంది మాత్ర‌మే ఉన్నార‌ని చెప్పారు. కంక‌ణాల రాజిరెడ్డి లొంగుబాటుతో తెలంగాణ రాష్ట్ర క‌మిటీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింద‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం స్టేట్ క‌మిటీలో ఒక్క‌రు మాత్ర‌మే మిగిలార‌న్నారు. లొంగిపోయిన‌వారు ఇచ్చిన స‌మాచారంతో మావోయిస్టుల‌లో ప్ర‌స్తుతం రాష్ట్రం నుంచి కేవ‌లం 17 మంది మాత్ర‌మే ఉన్నార‌ని వివ‌రించారు. మావోయిస్టు పార్టీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు అధికమ‌య్యాయ‌ని చెప్పారు. దానికి తోడు ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో వారు లొంగిపోయార‌న్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement