Kavitha | హరీశ్‌రావు ఓ గుంట నక్క.. ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్
Kavitha | బీఆర్ఎస్ (BRS) కీలక నేత హరీశ్‌రావు (Harish Rao) ఓ గుంట నక్క అని ఎమ్మెల్సీ (MLC) కల్వకుంట్ల కవిత (Kavitha) మండిపడ్డారు. ఆయనకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ (Deputy Floor Leader) ఇవ్వగానే బీఆర్ఎస్ పార్టీని ఎవరూ కాపాడలేరని చెప్పానని గుర్తు చేశారు. అసెంబ్లీ (Assembly) లో కీలక అంశంపై చర్చ జరుగుతుంటే సభలో ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు.
Kavitha | త్రినేత్ర.న్యూస్: బీఆర్ఎస్ (BRS) కీలక నేత హరీశ్‌రావు (Harish Rao) ఓ గుంట నక్క అని ఎమ్మెల్సీ (MLC) కల్వకుంట్ల కవిత (Kavitha) మండిపడ్డారు. ఆయనకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ (Deputy Floor Leader) ఇవ్వగానే బీఆర్ఎస్ పార్టీని ఎవరూ కాపాడలేరని చెప్పానని గుర్తు చేశారు. అసెంబ్లీ (Assembly) లో కీలక అంశంపై చర్చ జరుగుతుంటే సభలో ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా సూర్యాపేటలో పర్యటిస్తున్న ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్షం అంటే పార్టీ మాత్రమే కాదని, ప్రజల గొంతుక అని అన్నారు. హరీశ్‌రావును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యక్తిగతంలో ఒక్క మాట అన్నందుకే సభను బాయ్‌కాట్ చేశారని దుయ్యబట్టారు. కేసీఆర్‌ను గతంలో సీఎం రేవంత్ ఎన్ని తిట్లు తిట్టినా ఒక్కనాడైనా హరీశ్‌రావు అసెంబ్లీని బాయ్‌కాట్ చేశారా అని ప్రశ్నించారు. ఒక అంశంపై అభ్యంతరం ఉంటే దానికి సంబంధించిన చర్చ సమయంలో బాయ్‌కాట్ చేస్తారని, కానీ కీలకమైన అంశాలను వదిలేసి మొత్తం సమావేశాలను బాయ్‌కాట్ చేయడం సరికాదన్నారు.
హరీశ్.. జవాబివ్వు..
2016లో కేఆర్ఎంబీ సమావేశంలో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా హరీశ్‌రావు ఉన్నప్పుడు మన నీటి వాటా మూడు శాతం తగ్గిస్తూ సంతకాలు చేశారని కవిత ఆరోపించారు. అప్పటికే కట్టి ఉన్న ప్రాజెక్టులలో రాష్ట్ర విభజన జరిగినపుడు 37 శాతం తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు 63 శాతం నీటిని కేటాయించారని చెప్పారు. దానిని 34 శాతానికి తగ్గిస్తూ సంతకం పెట్టింది వాస్తవమా కాదా జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. జూరాల నుంచి శ్రీశైలంకు సోర్స్‌పాయింట్ మార్చేందుకు గల సాంకేతిక కారణాలు బహిర్గతం చేయాలన్నారు. కేవలం హరీశ్‌రావు ధనదాహానికి ఈ మార్పు జరిగిందని విమర్శించారు. ఓపెన్ పంప్‌హౌజ్ స్థానంలో అండర్‌గ్రౌండ్ పంప్‌హౌజ్ చేసి, రూ.1400 కోట్ల అంచనా వ్యయాన్ని పెంచారని ఆరోపించారు. ఈ ప్రశ్నలకు హరీశ్‌రావు సమాధానాలు ఇవ్వాలని కోరారు. అసెంబ్లీలో వివరణ ఇవ్వాల్సిన ఆయన అది చేయకుండా పార్టీ కార్యాలయంలో ప్రజెంటేషన్ ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు.
కేసీఆర్‌ను ఉరితీయాలంటే రేవంత్‌ను రెండు సార్లు ఉరితీయాలి..
కేసీఆర్‌ను ఉరితీయాలంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృష్ణా జలాల్లో చేస్తున్న అన్యాయానికి రేవంత్‌ను రెండు సార్లు ఉరితీయాలని కవిత అన్నారు. అసలు దానిపై రేవంత్‌రెడ్డి మాట్లాడడం లేదని మండిపడ్డారు. పక్కన కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు. అల్మెట్టి ఎత్తు పెంచి, మరో వంద టీఎంసీలు ఆపితే మనకు ఏం వస్తుందని ప్రశ్నించారు. రేవంత్ తన సొంత జిల్లా గురించి కూడా ఆలోచించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నాయకుడిని విమర్శించడం చాలా సులువన్నారు. కేసీఆర్ లేకపోతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమేలేదన్నారు. అటువంటి వ్యక్తిని ఎంత పడితే అంత మాట్లాడకుండా సాంకేతికంగా మాట్లాడాలని రేవంత్‌కు హితవు పలికారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

Harish Rao | తెలంగాణ వాదులను గుండెల్లో పెట్టుకుంటా: హరీశ్ రావు
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



