Rahul Gandhi | ఫారమ్-6లో మార్పులు చేయమని టీసీఎస్‌ను ఎవరు ఆదేశించారు..? ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించిన రాహుల్
Rahul Gandhi | ఫారమ్-6లో చేసిన మార్పులు చట్టవిరుద్ధమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. ఆ మార్పులు చేయమని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)ను ఎవరు ఆదేశించారంటూ ప్రశ్నించారు. అయితే, ఈ మొత్తం కుట్ర వెనుక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రమేయం ఉందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు.
Rahul Gandhi | త్రినేత్ర న్యూస్ : కొత్త ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఆన్‌లైన్ ఫారమ్-6లో చేసిన మార్పులు చట్టవిరుద్ధమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. ఈ మేరకు ఆ మార్పులు చేయమని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)ను ఎవరు ఆదేశించారంటూ ప్రశ్నించారు. ఈ మార్పులు చేసేలా టీసీఎస్‌పై ఏదైనా ఒత్తిడి ఉందా..? అని సందేహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాహుల్ ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు.
"కొత్త ఓటరు నమోదు కోసం ఉపయోగించే ఆన్‌లైన్ ఫారమ్-6లో నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేశారు. ఈ మార్పులు చేయాలని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)ను ఎన్నికల సంఘం (ECI)లో ఏ అధికారి ఆదేశించారు..? TCS తరఫున దీనిపై ఎవరు సంతకం చేశారు..? ఈ మార్పులు చేసేలా టీసీఎస్‌పై ఏదైనా ఒత్తిడి ఉందా..?" అంటూ రాహుల్ ప్రశ్నల వర్షం కురిపించారు.
కుట్ర వెనుక మోదీ-షా
ఫారమ్-6లో మార్పులపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ (Jairam Ramesh) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల జాబితా నుంచి జెన్-జీ (Gen Z) ఓటర్లను తొలగించేందుకు 2026 జూలై మధ్య చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ అసాధారణ రీతిలో రాజ్యాంగ విరుద్ధంగా ఈ మార్పులు చేశారని విమర్శించారు. ఈ మొత్తం కుట్ర వెనుక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రమేయం ఉందని ఆరోపించారు.
Form 6 changes were introduced by the CEC unconstitutionally in mid-July 2026 to remove Gen Z voters from the electoral roll. Clearly, the move was orchestrated by the PM-HM duo. https://t.co/V9H5UG1Zj1
— Jairam Ramesh (@Jairam_Ramesh) October 1, 2026
Also Read..
ఆయన పేరు గుర్తుంచుకోండి.. ఇండియన్ పైలట్‌పై ఇజ్రాయెల్ ప్రశంసల వర్షం
అతడు ఒక హీరో.. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను కొనియాడిన ప్రధాని మోదీ
సెట్స్‌పై ఐదు సినిమాలు.. అయినా తగ్గని నయన్ జోరు - లేడీ సూపర్ హీరోగా!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

University Men’s Hostel | యూత్ కాంగ్రెస్, ఎస్ఎఫ్ఐ ఘర్షణ.. రణరంగంగా యూనివర్సిటీ మెన్స్ హాస్టల్
అక్టోబర్ 1, 2026

INDIA bloc | జ్ఞానేశ్ రాజీనామా చేయాల్సిందే.. ‘సేవ్ డెమొక్రసీ’ నిరసనలకు పిలుపునిచ్చిన ఇండీ కూటమి
సెప్టెంబర్ 30, 2026

SIR | కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఫారం-6 నుంచి అదనపు డిక్లరేషన్ ఉపసంహరణ
సెప్టెంబర్ 30, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి.. పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్‌తో ఒత్తిడి..
- ●Amitabh Bachchan | షూటింగ్లో జారిపడ్డ అమితాబ్ బచ్చన్.. మోకాలికి గాయం
- ●Elon Musk | ట్రంప్ ప్రభుత్వంలోకి మస్క్ రీ ఎంట్రీ.. అమెరికా రక్షణ శాఖలో కీలక బాధ్యతలు
- ●Kajal Aggarwal | 30 కోట్లతో తీస్తే కోటి కలెక్షన్లు వచ్చాయి - ఓటీటీలో తెలుగులో రిలీజైన కాజల్ బాలీవుడ్ మూవీ
- ●CPA Study Tour | సీపీఏ స్టడీ టూర్.. బెర్లిన్‌లో మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్‌కు ఘన స్వాగతం
- ●WhatsApp | వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు.. టీనేజర్లపై పేరెంట్స్‌కు మరింత కంట్రోల్..

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి.. పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్‌తో ఒత్తిడి..

Amitabh Bachchan | షూటింగ్లో జారిపడ్డ అమితాబ్ బచ్చన్.. మోకాలికి గాయం

Elon Musk | ట్రంప్ ప్రభుత్వంలోకి మస్క్ రీ ఎంట్రీ.. అమెరికా రక్షణ శాఖలో కీలక బాధ్యతలు

Kajal Aggarwal | 30 కోట్లతో తీస్తే కోటి కలెక్షన్లు వచ్చాయి - ఓటీటీలో తెలుగులో రిలీజైన కాజల్ బాలీవుడ్ మూవీ



