Captain Smit Machchhar | అతడు ఒక హీరో.. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను కొనియాడిన ప్రధాని మోదీ
Captain Smit Machchhar | ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఫ్లైదుబాయ్ విమానంలో 174 మంది ప్రయాణికులను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై (Captain Smit Machchhar) ప్రశంసలు వెళ్లువెత్తుతున్నాయి.
Captain Smit Machchhar | త్రినేత్ర న్యూస్: ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఫ్లైదుబాయ్ విమానంలో 174 మంది ప్రయాణికులను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై (Captain Smit Machchhar) ప్రశంసలు వెళ్లువెత్తుతున్నాయి. మచర్‌ను ప్రధాని మోదీ (PM Modi) రియల్ హీరోగా అభివర్ణించగా, భారత పైలట్ అసాధారణ ధైర్యానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ (Benjamin Netanyahu) సెల్యూట్ చేశారు.
174 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి టెల్‌అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ (Flydubai) విమానాన్ని కూల్చేందుకు కో-పైలట్ ప్రయత్నించాడు. విమానం కెప్టెన్‌గా ఉన్న భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ ప్రాణాలకు తెగించి అతడిని అడ్డుకున్నాడు. ఈ క్రమంలో తనకు కత్తిపోట్లు అయినప్పటికీ రక్తమోడుతున్నా లెక్కచేయకుండా అతడిని అడ్డుకున్నారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఆన్-డ్యూటీ ఫ్లైదుబాయ్ సిబ్బంది.. విమానాన్ని సౌదీఅరేబియాలోని (Saudi Arabia) తబుక్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా దించిన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ విమానంలోని 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను ఒక `హీరో`గా (Hero) అభివర్ణించారు. అత్యంత ప్రమాద సమయంలోనూ ఆయన ప్రదర్శించిన ధైర్యసాహసాలను ఎక్స్ వేదికగా కొనియాడారు. `కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఒక రియల్ హీరో. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో, తాను తీవ్రంగా గాయపడినప్పటికీ, ఇతరుల ప్రాణాలను రక్షించాలనే పట్టుదలతో ఆయన అపారమైన ధైర్యాన్ని, అచంచలమైన సంకల్పాన్ని ప్రదర్శించారు. ఆయన తెగువ వందలాది మంది ప్రాణాలను కాపాడటమే కాకుండా, ఒక పెద్ద ప్రమాదాన్ని తప్పించింది. కెప్టెన్ మచ్చర్‌ను చూసి భారతదేశం గర్విస్తున్నది. ఆయన త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో, నూతన శక్తితో తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాను` ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Captain Smit Machchhar is a HERO.
In the face of the gravest danger and despite being seriously injured, he showed immense courage and an unwavering resolve to protect the lives of others.
His valour helped save hundreds of lives and avert a great tragedy.
India is proud of…
— Narendra Modi (@narendramodi) October 1, 2026
సెల్యూట్ చేస్తున్నా..
భారత పైలట్ (Indian pilot) కెప్టెన్ స్మిత్ మచ్చర్ అసాధారణ ధైర్యానికి నా సెల్యూట్ అంటూ ఇజ్రాయెల్ ప్రధాని ఎక్స్‌లో పోస్టు చేశారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడినప్పటికీ మచ్చర్ ప్రతిఘటించి కాక్‌పిట్ తలుపు (Cockpit Door) తెరిచారని బెంజమిన్ నెతన్యాహూ తెలిపారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోగలిగారని చెప్పారు. దీంతో పెను విమాన ప్రమాదాన్ని నివారించినట్లయిదన్నారు. మచ్చర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తీవ్ర గాయమైనప్పటికీ..
స్మిత్ మచ్చర్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కూడా ‘హీరో’గా అభివర్ణించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ పైలట్ చేసిన చర్యను అద్భుతమైనదిగా పేర్కొన్నారు.
30 సెకన్లలో 14 వేల అడుగులు కిందకు..
బుధవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) దుబాయ్-టెల్‌అవీవ్ మధ్య ప్రయాణిస్తున్న ఫ్లైదుబాయ్‌కి చెందిన బోయింగ్ 737 MAX 8 విమానం పైలట్, కో-పైలట్ మధ్య కాక్‌పిట్‌లో ఘర్షణతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో కో-పైలట్ కెప్టెన్ మచ్చర్‌పై కత్తితో దాడి చేశాడు. ఇరువురి ఘర్షణతో విమానం ఒక్కసారిగా ఎత్తు కోల్పోయింది. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం కేవలం 30 సెకన్లలో దాదాపు 14 వేల అడుగుల మేర కిందికి పడిపోయింది. విమానంలోని ప్రయాణికులకు పరిస్థితి అర్థమయ్యేలోపే కాక్‌పిట్ నుంచి అరుపులు వినిపించాయి. రక్తమోడుతూ కెప్టెన్ మచ్చర్ కాక్‌పిట్ తలుపు తెరిచారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానంలో ఉన్న ఆన్ డ్యూటీ పైలట్లు విమానాన్ని సౌదీ అరేబియాలోని టబుక్‌కు మళ్లించారు.
ఎవరీ స్మిత్ మచ్చర్?
స్మిత్ మచ్చర్ భారత పౌరుడు. బోయింగ్ 737 విమానాలపై ఆయనకు 13 ఏండ్లకు పైగా వాణిజ్య విమానయాన అనుభవం ఉంది. సుమారు 9,750 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉన్నట్లు ఆయన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ఆధారంగా వివరాలు వెల్లడయ్యాయి. 2011లో స్పైస్‌జెట్‌లో చేరిన మచ్చర్.. అక్కడ లైన్ ట్రైనింగ్ కెప్టెన్, సీనియర్ కమాండర్‌గా పనిచేశారు. 2022 జూన్‌లో స్పైస్‌జెట్‌ను వీడి ఫ్లై దుబాయ్‌లో డైరెక్ట్ ఎంట్రీ కెప్టెన్‌గా చేరారు. ఆయన సోదరుడు కూడా ఇటీవల ఫ్లై దుబాయ్‌లో చేరినట్లు సమాచారం.
కాక్‌పిట్‌లో కో పైలట్ చేతిలో తీవ్రంగా గాయపడిన మచ్చర్ ప్రస్తుతం సౌదీ అరేబియాలోని తబుక్‌లో (Tabuk) ఉన్న దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకగా ఉన్నట్లు తెలుస్తున్నది. భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్ ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు.
సంబంధిత వార్తలు

PM DHARA Scheme | పునరుత్పాదక ఇంధన రంగానికి భారీ ఊతం.. రూ.1.86 లక్షల కోట్లతో పీఎం ధారా స్కీం..
సెప్టెంబర్ 30, 2026

INDIA bloc | జ్ఞానేశ్ రాజీనామా చేయాల్సిందే.. ‘సేవ్ డెమొక్రసీ’ నిరసనలకు పిలుపునిచ్చిన ఇండీ కూటమి
సెప్టెంబర్ 30, 2026

Flydubai Flight | హైజాక్ కోడ్.. 2 నిమిషాల్లోనే 17,400 అడుగుల దిగువకు పడిపోయిన విమానం..!
సెప్టెంబర్ 30, 2026
తాజావార్తలు
- ●Gas Cylinder Price | భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..
- ●University Men's Hostel | యూత్ కాంగ్రెస్, ఎస్ఎఫ్ఐ ఘర్షణ.. రణరంగంగా యూనివర్సిటీ మెన్స్ హాస్టల్
- ●Gandhi Jayanti | డ్రైడే.. రేపు మాంసం, మద్యం దుకాణాలు బంద్..
- ●Horoscope | అక్టోబర్ 1 రాశిఫలాలు.. గురుడి అనుగ్రహంతో మానసిక ఆందోళనల నుంచి ఉపశమనం!
- ●Moody's India Aging Report | ధనిక దేశం కాకముందే వృద్ధ భారత్: వేగంగా పడిపోతున్న జననాల రేటు..!
- ●Priyanka Gandhi Wayanad Tour | వాయనాడ్ పర్యాటకానికి కొత్త ఊపు: అడ్వెంచర్ స్పోర్ట్స్‌పై ప్రియాంక గాంధీ ప్రత్యేక దృష్టి.. యువతతో కీలక భేటీ!

Gas Cylinder Price | భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..

University Men's Hostel | యూత్ కాంగ్రెస్, ఎస్ఎఫ్ఐ ఘర్షణ.. రణరంగంగా యూనివర్సిటీ మెన్స్ హాస్టల్

Gandhi Jayanti | డ్రైడే.. రేపు మాంసం, మద్యం దుకాణాలు బంద్..

Horoscope | అక్టోబర్ 1 రాశిఫలాలు.. గురుడి అనుగ్రహంతో మానసిక ఆందోళనల నుంచి ఉపశమనం!



