Captain Smit Machchhar | ఆయన పేరు గుర్తుంచుకోండి.. ఇండియన్ పైలట్‌పై ఇజ్రాయెల్ ప్రశంసల వర్షం
Captain Smit Machchhar | ఫ్లైదుబాయ్ విమానంలో 180 మంది ప్రయాణికులను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై (Captain Smit Machchhar) ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ మీడియాలో ఆయన పేరు మార్మోగిపోతోంది. "ఆయన పేరు గుర్తుంచుకోండి", "నిజమైన హీరో" అంటూ ఇజ్రాయెల్ ప్రజలు కెప్టెన్ స్మిత్‌కు నీరాజనాలు పడుతున్నారు.
Captain Smit Machchhar | త్రినేత్ర న్యూస్: ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఫ్లైదుబాయ్ విమానంలో 180 మంది ప్రయాణికులను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై (Captain Smit Machchhar) సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మొదలు సోషల్ మీడియా మొత్తం ఆయన్ని ఓ హీరోగా అభివర్ణిస్తోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ మీడియాలో ఆయన పేరు మార్మోగిపోతోంది.
"ఆయన పేరు గుర్తుంచుకోండి", "నిజమైన హీరో" అంటూ ఇజ్రాయెల్ ప్రజలు కెప్టెన్ స్మిత్‌కు నీరాజనాలు పడుతున్నారు. కాక్‌పిట్‌లో కోపైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ ధైర్యసాహసాలను ప్రదర్శించి పెను ప్రమాదాన్ని నివారించారని కొనియాడుతున్నారు. వందలాది మంది ప్రాణాలు కాపాడినందుకు స్మిత్‌కు ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీడియోలు షేర్ చేస్తున్నారు.
బుధవారం ఉదయం దుబాయ్-టెల్‌అవీవ్ మధ్య ప్రయాణిస్తున్న ఫ్లైదుబాయ్‌కి చెందిన బోయింగ్ 737 MAX 8 విమానం పైలట్, కో-పైలట్ మధ్య కాక్‌పిట్‌లో ఘర్షణతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో కో-పైలట్ కెప్టెన్ మచ్చర్‌పై కత్తితో దాడి చేశాడు. ఇరువురి ఘర్షణతో విమానం ఒక్కసారిగా ఎత్తు కోల్పోయింది. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం కేవలం రెండు నిమిషాల్లోనే 17 వేల అడుగుల మేర కిందికి పడిపోయింది. ఈ నాటకీయ పరిణామాల మధ్య కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ తీవ్రంగా గాయపడినప్పటికీ, విమానాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోవడానికి తీవ్రంగా పోరాడారు. ఎంతో చాకచక్యంగా కాక్‌పిట్ తలుపుల రిలీజ్ బటన్‌ను నొక్కారు.
దీంతో విమాన సిబ్బంది, కొందరు ఇజ్రాయెల్ ప్రయాణికులు లోపలికి ప్రవేశించి ఆ ఉన్మాది అయిన కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానంలో ఉన్న ఆన్ డ్యూటీ పైలట్లు విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియా మొత్తం కెప్టెన్ మచ్చర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఆయనను అత్యంత ధైర్యశాలిగా అభివర్ణిస్తూ.. ప్రతి ఒక్కరూ ఆయన పేరును గుర్తుంచుకోండి అంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం నెట్టింట ఎక్కడ చూసినా మచ్చర్ పేరే మార్మోగిపోతోంది. ఆయన పేరు ట్రెండింగ్‌లో ఉంది.
Also Read..
అతడు ఒక హీరో.. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను కొనియాడిన ప్రధాని మోదీ
స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర.. భారీ స్థాయిలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు..
స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర.. భారీ స్థాయిలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Captain Smit Machchhar | అతడు ఒక హీరో.. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను కొనియాడిన ప్రధాని మోదీ
అక్టోబర్ 1, 2026

PM DHARA Scheme | పునరుత్పాదక ఇంధన రంగానికి భారీ ఊతం.. రూ.1.86 లక్షల కోట్లతో పీఎం ధారా స్కీం..
సెప్టెంబర్ 30, 2026

INDIA bloc | జ్ఞానేశ్ రాజీనామా చేయాల్సిందే.. ‘సేవ్ డెమొక్రసీ’ నిరసనలకు పిలుపునిచ్చిన ఇండీ కూటమి
సెప్టెంబర్ 30, 2026
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర.. భారీ స్థాయిలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు..
- ●SAIL Apprentices | సెయిల్‌లో 710 అప్రెంటిస్‌లు.. రాతపరీక్ష లేకుండానే..
- ●Captain Smit Machchhar | అతడు ఒక హీరో.. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను కొనియాడిన ప్రధాని మోదీ
- ●Gas Cylinder Price | భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..
- ●University Men's Hostel | యూత్ కాంగ్రెస్, ఎస్ఎఫ్ఐ ఘర్షణ.. రణరంగంగా యూనివర్సిటీ మెన్స్ హాస్టల్
- ●Gandhi Jayanti | డ్రైడే.. రేపు మాంసం, మద్యం దుకాణాలు బంద్..

Stock Markets | స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర.. భారీ స్థాయిలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు..

SAIL Apprentices | సెయిల్‌లో 710 అప్రెంటిస్‌లు.. రాతపరీక్ష లేకుండానే..

Captain Smit Machchhar | అతడు ఒక హీరో.. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను కొనియాడిన ప్రధాని మోదీ

Gas Cylinder Price | భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..



