త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nayanthara | సెట్స్‌పై ఐదు సినిమాలు.. అయినా తగ్గని నయన్ జోరు – లేడీ సూప‌ర్ హీరోగా!

ప్ర‌స్తుతం న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఐదు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఈ సినిమాల‌తో బిజీగా ఉన్న లేడీ సూప‌ర్ స్టార్ తాజాగా మ‌రో కొత్త ప్ర‌యోగానికి సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ సూప‌ర్ హీరో క‌థ‌తో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు. ఈ సినిమాకు డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

N

Entertainment | Published On Oct 1, 2026, 10.51 am IST

Nayanthara | సెట్స్‌పై ఐదు సినిమాలు.. అయినా తగ్గని నయన్ జోరు – లేడీ సూప‌ర్ హీరోగా!
Advertisement

Nayanthara |క‌థానాయిక‌గా న‌య‌న‌తార సినీ ప్ర‌యాణం ప్రారంభ‌మై ఇర‌వై మూడేళ్లు దాటిపోయింది. అయినా ఈ లేడీ సూప‌ర్ స్టార్ క్రేజ్ కొంచెం కూడా త‌గ్గ‌లేదు. ప్ర‌స్తుతం ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తోంది. అవ‌కాశాల రేసులో యంగ్ హీరోయిన్ల‌తో పోటీప‌డుతోంది.

ఐదు సినిమాలు...

ప్ర‌స్తుతం న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఐదు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్‌ల‌తో తీరిక లేకుండా బిజీగా ఉన్న లేడీ సూప‌ర్ స్టార్ మ‌రో ప్ర‌యోగానికి సిద్ధ‌మైంది. కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ సూప‌ర్ హీరో క‌థ‌తో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయ‌బోతుంది.

డీమాంటే కాల‌నీ ఫేమ్‌...

డీమాంటే కాల‌నీ ఫ్రాంచైజ్ సినిమాల‌తో కోలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను భ‌య‌పెట్టాడు డైరెక్ట‌ర్ అజ‌య్ జ్ఞాన‌ముత్తు. ఈ ఫ్రాంచైజ్‌లో ప్ర‌స్తుతం మూడో పార్ట్ తెర‌కెక్కుతోంది. డీమాంటే కాల‌నీ 3 త‌ర్వాత సూప‌ర్ హీరో క‌థ‌తో లేడీ ఓరియెంటెడ్ మూవీని రూపొందించే ప్ర‌య‌త్నాల్లో అజ‌య్ జ్ఞాన‌ముత్తు ఉన్నారు. మార్వెల్ సినిమాల స్ఫూర్తితో డైరెక్ట‌ర్ ఈ క‌థ‌ను సిద్ధం చేసిన‌ట్లు స‌మాచారం. లేడీ సూప‌ర్ హీరో క‌థ‌తో రూపుదిద్దుకోనున్న‌ ఈ సినిమాలో న‌య‌న‌తార క‌థానాయిక‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మైథాల‌జీ, హార‌ర్ ఎలిమెంట్స్‌కు సూప‌ర్ హీరో పాయింట్‌ను జోడించి ద‌ర్శ‌కుడు సిద్ధం చేసిన క‌థ న‌చ్చ‌డంతో ఫ‌స్ట్ సిట్టింగ్‌లోనే న‌య‌న్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు చెబుతోన్నారు. ఇందులో న‌య‌న‌తార ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

భ‌ర్త‌తో క‌లిసి...

ఈ త‌మిళ‌ సూప‌ర్ హీరో సినిమాను త‌న భ‌ర్త విఘ్నేష్ శివ‌న్‌తో క‌లిసి స్వీయ నిర్మాణ సంస్థ రౌడీ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌య‌న‌తార స్వ‌యంగా నిర్మించ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు. ప్ర‌స్తుతం న‌య‌న‌తార హిందీలో స‌ల్మాన్ ఖాన్‌తో ఓ సినిమా చేస్తోంది. త‌మిళంలో మూడు, మ‌ల‌యాళంలో ఓ సినిమాను అంగీక‌రించింది. ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కు న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించిన నాలుగు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. వీటిలో మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిల‌వ‌గా...టాక్సిక్‌, హాయ్‌, పేట్రియాట్ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి.

 

Advertisement
Advertisement