BM Sandip Kumar | కలిసి పని చేస్తేనే గెలిచాం.. వచ్చే ఎన్నికల్లో మరిన్ని స్థానాలు గెలుద్దాం
BM Sandip Kumar | గత ఎన్నికల్లో కలిసి పని చేస్తేనే గెలిచామని.. వచ్చే ఎన్నికల్లో అధిక మెజారిటీతో మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా కృషి చేద్దామని కాంగ్రెస్ (Congress) శ్రేణులకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ బీఎం సందీప్ కుమార్ (BM Sandip Kumar) పిలుపునిచ్చారు.
- తెలంగాణ కాంగ్రెస్ పనితీరు దేశానికే స్ఫూర్తినిచ్చేలా ఉంది
- రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు మరింత కష్టపడదాం
- పార్టీ శ్రేణులకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ బీఎం సందీప్ కుమార్ పిలుపు
BM Sandip Kumar | త్రినేత్ర న్యూస్: గత ఎన్నికల్లో కలిసి పని చేస్తేనే గెలిచామని.. వచ్చే ఎన్నికల్లో అధిక మెజారిటీతో మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా కృషి చేద్దామని కాంగ్రెస్ (Congress) శ్రేణులకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ బీఎం సందీప్ కుమార్ (BM Sandip Kumar) పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనితీరు దేశానికే స్ఫూర్తినిచ్చేలా ఉందన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి మరింత కష్టపడాలని కోరారు. హైదరాబద్‌లోని గాంధీభవన్‌లో ఆదివారం నిర్వహించిన పీఏసీ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఉప ఎన్నికల్లోనూ గెలిచాం
తెలంగాణలో అంతా కలిసికట్టుగా పని చేయడం వల్ల గత ఎన్నికల్లో అధికారంలోకి రాగలిగాం. గతంలో మనం ఐకమత్యంగా పని చేయడం వల్ల 64 ఎమ్మెల్యే సీట్లతో అధికారంలోకి వచ్చాం. తర్వాత జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో విజయం సాధించాం. గతంలో ఇక్కడ పని చేసిన ఏఐసీసీ ఇంచార్జ్ లు పార్టీని బలోపేతం చేయడంలో చాలా కృషి చేసారు. రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చేసేందుకు మరింత కష్టపడి మనం పని చేయాలి. అధికారంలోకి వచ్చిన మనం ఇక్కడ అద్భుతమైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేస్తున్నాం.
దేశంలో ఎల్‌నినో వల్ల తీవ్రమైన కరవు ఏర్పడింది. అయితే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కరవు పరిస్థితులను అధిగమిస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తగినంత సహాయ సహకారాలు అందించడం లేదు. వారు సహాయ నిరాకరణ చేసినా కూడా మనం కరువును ఎదుర్కొంటూ రాష్ట్రంలో అన్ని రకాలుగా ప్రజల అవసరాలు తీరుస్తున్నాం.
వారి త్యాగాలు మనసుల్లో ఉన్నయ్..
సోనియాగాంధీ రాసిన బిలాంగింగ్ పుస్తకానికి దేశంలో చాలా ప్రాధాన్యం దక్కింది. సోనియాగాంధీ చేసిన త్యాగాలు, ఇందిరా గాంధీ. రాజీవ్ గాంధీల బలిదానాలు ఈ దేశంలో ప్రజల మనసుల్లో ఉన్నాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని మనం తిప్పికొట్టాలి. మనం కలిసికట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దేశంలో అధికారంలోకి తెచ్చేలా కృషి చేయాలి అని సందీప్ కుమార్ తెలిపారు.
తాజావార్తలు
- ●TGSRTC | i-ALERT సాంకేతికతతో టీజీఎస్ ఆర్టీసీ సరికొత్త రికార్డు
- ●CTI | బంగారం కొనొద్దన్న మోదీ.. మాకు మేలు చేసిదంటూ ప్రధానికి సీటీఐ లేఖ!
- ●Mahesh Kumar Goud | కేంద్ర విధానాల వల్ల తెలంగాణకు నష్టం
- ●Fingerprints | ఇద్దరు మనుషుల వేలిముద్రలు ఒకేలా ఉండవా? దీని వెనుక అసలు రహస్యం ఇదే!
- ●Mallu Ravi | రాజగోపాల్, అనిరుధ్‌లను కట్టడి చేస్తం.. ఈవినింగ్ మీటింగ్ తర్వాత ఏం జరిగిందనేది చెప్తా
- ●Goutham Prasad | అద్దంకి! రేవంత్ చెప్పులు మోయడానికే పనికొస్తవ్ నువ్

TGSRTC | i-ALERT సాంకేతికతతో టీజీఎస్ ఆర్టీసీ సరికొత్త రికార్డు

CTI | బంగారం కొనొద్దన్న మోదీ.. మాకు మేలు చేసిదంటూ ప్రధానికి సీటీఐ లేఖ!

Mahesh Kumar Goud | కేంద్ర విధానాల వల్ల తెలంగాణకు నష్టం

Fingerprints | ఇద్దరు మనుషుల వేలిముద్రలు ఒకేలా ఉండవా? దీని వెనుక అసలు రహస్యం ఇదే!



