INDIA bloc meet | ‘ఇండీ’ కూటమి సమావేశానికి టీవీకేకి అందని ఆహ్వానం.. కారణం చెప్పిన కాంగ్రెస్
INDIA bloc meet | దేశ రాజధాని ఢిల్లీలో నేడు ప్రతిపక్ష ‘ఇండీ’ కూటమి సమావేశం (INDIA bloc meet) జరగనుంది. అయితే, ఈ భేటీకి తమిళనాడులో కాంగ్రెస్‌కు ప్రధాన మిత్రపక్షమైన విజయ్ నేతృత్వంలోని ‘టీవీకే’ (TVK) పార్టీకి ఇప్పటి వరకూ ఆహ్వానం అందలేదు. దీనిపై కాంగ్రెస్ వర్గాలు తాజాగా స్పష్టతనిచ్చాయి.
INDIA bloc meet | దేశ రాజధాని ఢిల్లీలో నేడు ప్రతిపక్ష ‘ఇండీ’ కూటమి సమావేశం (INDIA bloc meet) జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం జరగనున్న ఈ కీలక భేటీకి తమిళనాడులో ఇటీవలే అధికారంలోకి వచ్చిన విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే)కి ఇప్పటి వరకూ ఆహ్వానం అందలేదు. తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ‘టీవీకే’ (TVK) పార్టీకి కాంగ్రెస్ ప్రధాన మిత్రపక్షంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ సమావేశానికి టీవీకేని పిలవకపోవడంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై కాంగ్రెస్ (Congress) వర్గాలు స్పష్టత ఇచ్చాయి.
కేవలం పార్లమెంట్ సభ్యులున్న రాజకీయ పార్టీలను మాత్రమే ఆహ్వానించామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ‘టీవీకే’కు ఎలాంటి ఎంపీల ప్రాతినిధ్యం లేదు. అందుకే ఆ పార్టీకి ఇంకా ఆహ్వానం పంపలేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కూటమిని బలోపేతం చేయడానికి రాష్ట్రంలో తమకు దక్కిన ఏకైక ఖాళీ రాజ్యసభ సీటును మిత్రపక్షమైన కాంగ్రెస్‌కే టీవీకే కేటాయించిన విషయం తెలిసిందే. ఇక ఈ భేటీ తర్వాత విజయ్‌ని కూటమిలో చేర్చుకునే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు హస్తం పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇటీవల దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారిగా ఇండీ కూటమి నేతలు సమావేశం అవుతున్నారు. త్వరలో పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశానికి 23 పార్టీల నేతలు హాజరు కానున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. ఈ సమావేశంలో తృణమూల్ పార్టీ చీఫ్, మమతా బెనర్జీ హాజరై ఇటీవల పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను వివరించనున్నట్లు సమాచారం. తమిళనాడులో కాంగ్రెస్ 'ద్రోహం' చేసిందని ఆరోపిస్తూ డీఎంకే ఈ సమావేశాన్ని బహిష్కరించింది. ఆప్ కూడా ఇండీ భేటీకి దూరంగా ఉంటోంది.
Also Read..
ఈపీఎఫ్‌వో 3.0లో భారీ మార్పులు.. సభ్యులకు అనేక సదుపాయాలు..
అది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం.. పోలీసుల నోటీసులపై మన్నె క్రిషాంక్ ఆగ్రహం
సంబంధిత వార్తలు

MP Raghunandan Rao | కాక్రోచ్ ఉద్యమంలో కాక్రోచుల్లేరు, విద్యార్థుల్లేరు.. వాళ్లంతా సంఘ విద్రోహ శక్తులే
జులై 24, 2026

Sonia Gandhi | విద్యార్థులను దేశ శత్రువులుగా చూస్తోంది.. మోదీ ప్రభుత్వంపై సోనియా గాంధీ మండిపాటు
జులై 24, 2026

KTR | రేవంత్ అక్రమ సంపాదన కాంగ్రెస్‌కు ఒక మూట.. బీజేపీకి రెండు మూటలు
జులై 23, 2026
తాజావార్తలు
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!



