Manne Krishank | అది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం.. పోలీసుల నోటీసులపై మన్నె క్రిషాంక్ ఆగ్రహం
Manne Krishank | సోషల్ మీడియా (Social Media) పోస్టులపై పోలీసులు నోటీసులు జారీచేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ (Manne Krishank) ఆగ్రహం వ్యక్తం చేశారు.
Manne Krishank | త్రినేత్ర.న్యూస్: సోషల్ మీడియా (Social Media) పోస్టులపై పోలీసులు నోటీసులు జారీచేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ (Manne Krishank) ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఎక్స్ ఖాతాలో పోస్టుచేసిన హిట్లర్‌ను పొగుడుతూ సీఎ రేవంత్ రెడ్డి చేసిన ఉపన్యాసం వీడియోను తొలగించాలంటూ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా ఎక్స్ సంస్థకు నోటీలు పంపడం ప్రజాస్వామ్యానికి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు. ఆ వీడియోలో ఉన్న స్వరం సీఎం రేవంత్ రెడ్డి దేనని, నాజీ యూనిఫాం పోలికలు ఉన్నాయని పేర్కొంటూ కంటెంట్ తొలగించాలని కోరడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
రాజకీయ నాయకులపై విమర్శ ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమని, దానిని నేరంగా పరిగణించి సోషల్ మీడియా వేదికలపై ఒత్తిడి తీసుకురావడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. యూజర్‌కు సమాచారం ఇవ్వవద్దని, యూజర్‌కు తెలియజేస్తే దర్యాప్తుకు ఆటంకం కలుగవచ్చు, పారిపోవచ్చని నోటీసులో పేర్కొనడం ఆందోళనకలిగిస్తున్నదని చెప్పారు. ఒక సోషల్ మీడియా పోస్టు విషయంలో రచయితకే సమాచారం ఇవ్వవద్దని కోరడం పారదర్శకతకు వ్యతిరేకమని తెలిపారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి గొంతును అణచివేయాలనే ధోరణి కాంగ్రెస్ ప్రభుత్వంలో పెరుగుతున్నదని మండిపడ్డారు. అవినీతి, పరిపాలనా వైఫల్యాలు, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు, నోటీసులు, సోషల్ మీడియా ఆంక్షలతో బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నాజీ యూనిఫామ్ ధరించిన సీఎం రేవంత్ చిత్రం నేరం అయితే, మరి లక్షల మంది అమాయక ప్రజల ఊచకోతకు కారణమైన అదే నాజీ నాయకుడు హిట్లర్ తన హంతక బృందాన్ని పొగడడం సీఎం రేవంత్ చేసిన నేరం కాదా? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన






