Stock Markets | ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లు కుదేలు
Stock Markets | ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మళ్లీ తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు చెలరేగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. యుద్ధ భయాల నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఇన్వెస్టర్లు అమ్మకాల బాట పట్టడంతో సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.
Stock Markets | ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మళ్లీ తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు చెలరేగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. యుద్ధ భయాల నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఇన్వెస్టర్లు అమ్మకాల బాట పట్టడంతో సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9.30 గంటల సమయానికి సెన్సెక్స్ 675 పాయింట్లు కోల్పోయి 73,567 వద్ద ట్రేడవగా, నిఫ్టీ 215 పాయింట్లు తగ్గి 23,150 వద్ద కొనసాగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.35 వద్ద నమోదైంది. నిఫ్టీ సూచీలో సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అపోలో హాస్పిటల్స్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే షేర్లు స్వల్ప లాభాల్లో ఉండగా, విప్రో, టీసీఎస్, ఎంఅండ్ఎం, హిందాల్కో, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు నష్టాలను చవిచూశాయి.
పెరిగిన చమురు ధరలు..
ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఏప్రిల్ 8 తర్వాత మరోసారి ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు ముదిరాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఎదురుదాడులు ప్రారంభించింది. శాంతి ఒప్పందానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని, ఇలాంటి సమయంలో దాడులు చేయవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదని సమాచారం. ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. బ్యారెల్ ధర 3 శాతం పెరిగి 96 డాలర్లను దాటడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరిగింది. పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల, ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కారణంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
సంబంధిత వార్తలు

Stock Markets | వరుసగా 5వ రోజు నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 4 నెలల్లో అతి పెద్ద పతనం..
జులై 24, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు ధరల షాక్.. సూచీలు భారీగా పతనం..
జులై 24, 2026

Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లు కుదేలు.. నాలుగు రోజుల్లో రూ.4 లక్షల కోట్ల నష్టం..
జులై 23, 2026
తాజావార్తలు
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన



