MP Raghunandan Rao | కాక్రోచ్ ఉద్యమంలో కాక్రోచుల్లేరు, విద్యార్థుల్లేరు.. వాళ్లంతా సంఘ విద్రోహ శక్తులే
MP Raghunandan Rao | ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనలు కాక్రోచ్‌లు, విద్యార్థులు చేస్తున్నవి కావని.. వాళ్లంతా సంఘ విద్రోహ శక్తులేనని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అండతో, విద్యార్థుల ముసుగులో 50 ఏళ్లు పైబడిన కొందరు దేశద్రోహ శక్తులు, వామపక్ష విద్యార్థి సంఘాలు, తుకుడే తుకుడే గ్యాంగ్, ఖలిస్తాన్ మద్దతుదారులు ఈ ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
- నీట్‌కు, ఆర్టికల్ 370కి, ఖలిస్తాన్ నినాదాలకు ఏం సంబంధం?
- 58 ఏండ్ల యువకుల గురించి మేం మాట్లాడం
- నీట్ రాసిన విద్యార్థులంతా సంతోషంగా ఉన్నరు
- రాజు బలవంతుడైనప్పుడు దొంగలందరూ ఒకతాటిపైకి వస్తరు
- బీజేపీ ఎంపీ రఘునందర్‌రావు సంచలన వ్యాఖ్యలు
MP Raghunandan Rao | త్రినేత్ర.న్యూస్: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనలు కాక్రోచ్‌లు, విద్యార్థులు చేస్తున్నవి కావని.. వాళ్లంతా సంఘ విద్రోహ శక్తులేనని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అండతో, విద్యార్థుల ముసుగులో 50 ఏళ్లు పైబడిన కొందరు దేశద్రోహ శక్తులు, వామపక్ష విద్యార్థి సంఘాలు, తుకుడే తుకుడే గ్యాంగ్, ఖలిస్తాన్ మద్దతుదారులు ఈ ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు. నీట్‌కు, ఆర్టికల్ 370కి, ఖలిస్తాన్ నినాదాలకు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
విద్యార్థులపై మోదీకి ఎంతో గౌరవం ఉంది..
పోలీసుల మీద దాడులు చేస్తూ, దేశ భద్రతకు ముప్పు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్న వారిని విద్యార్థులుగా ఎలా పరిగణిస్తాం? ఇదంతా నరేంద్ర మోదీ మూడో విజయాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక చేస్తున్న కుట్ర మాత్రమే. యువతే దేశ శక్తి అని నమ్మే మోదీకి, బీజేపీకి విద్యార్థులపై ఎనలేని గౌరవం ఉంది. కానీ, విద్యార్థుల పేరుతో దేశాన్ని విడగొట్టాలని చూసే విద్రోహ శక్తులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం.
ఇప్పుడు ధర్నా ఏందన్నా?
పేపర్ లీక్ కాలేదు. కొంతమంది పేపర్లు దొంగతనం చేశారు. కొన్ని సంస్థలకు, వ్యక్తులకు లాభం చేకూర్చాలనే చేశారు. పేపర్ లీకైనట్లు టీవీల్లో, సోషల్ మీడియాలో రాలేదు. ప్రతేక ఏజెన్సీస్ విచారణ చేస్తున్నయ్. ప్రొఫెసర్లతో సహా 17 మంది ఇప్పటికే అరెస్టు అయ్యారు. నీట్‌ను రద్దు చేసినం, మళ్లీ పరీక్ష పెట్టినం.. రిజల్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు ధర్నా ఏందన్నా? నీట్ రాసిన విద్యార్థులంతా సంతోషంగా ఉన్నరు. జంతర్‌మంతర్ వద్ద జరిగిన ధర్నాలో నీట్ విద్యార్థులు ఎవరన్నా ఉన్నరా? రాజు బలవంతుడైనప్పుడు దేశంలోని దొంగలందరూ ఒకతాటిపైకి వస్తరు అని ఆయన వ్యాఖ్యానించారు.
దేశం దగ్గరి నుంచి ప్రపంచ వేదికలపై ప్రధాని మోదీ యువ శక్తి గురించి మాట్లాడారు. 58 ఏండ్ల యువకుల గురించి మేం మాట్లాడం. వారిని యువకులు అనుకుంటలేం. కాక్రోచ్ ఉద్యమంలో కాక్రోచ్‌లు లేరు.. విద్యార్థులు లేరు. సంఘ విద్రోహ శక్తులే ఉన్నరు అని ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Uttam Kumar Reddy | కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్రానికి సమగ్ర నివేదిక : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
- ●Rajagopal Reddy | ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులకు మార్కెట్ ధరకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
- ●KTR | ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ఫైట్ చేస్తూనే ఉంటాం..
- ●CS Sanjay Jaju | నెలరోజుల్లో విద్యార్థులకు కొత్త యూనిఫారాలు
- ●Rakul Preet Singh | సినిమా బడ్జెట్ 1100 కోట్లు - రకుల్ రెమ్యూనరేషన్ కోటి
- ●Special Traffic Bureau | ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్.. తెరపైకి ప్రత్యేక బ్యూరో

Uttam Kumar Reddy | కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్రానికి సమగ్ర నివేదిక : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

Rajagopal Reddy | ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులకు మార్కెట్ ధరకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

KTR | ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ఫైట్ చేస్తూనే ఉంటాం..

CS Sanjay Jaju | నెలరోజుల్లో విద్యార్థులకు కొత్త యూనిఫారాలు




