త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sonia Gandhi | విద్యార్థుల‌ను దేశ శ‌త్రువులుగా చూస్తోంది.. మోదీ ప్ర‌భుత్వంపై సోనియా గాంధీ మండిపాటు

Sonia Gandhi | నీట్ పేప‌ర్ లీక్‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేప‌డుతున్న విద్యార్థుల ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వం దుర్మార్గంగా ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) విమ‌ర్శించారు.

D

National | Published On Jul 24, 2026, 11.14 am IST

Sonia Gandhi | విద్యార్థుల‌ను దేశ శ‌త్రువులుగా చూస్తోంది.. మోదీ ప్ర‌భుత్వంపై సోనియా గాంధీ మండిపాటు
Advertisement

Sonia Gandhi | నీట్ పేప‌ర్ లీక్‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేప‌డుతున్న విద్యార్థుల ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వం దుర్మార్గంగా ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) విమ‌ర్శించారు. శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న విద్యార్థుల‌ను మోదీ ప్ర‌భుత్వం దేశ ద్రోహులుగా (Students As Enemies) చూస్తోంద‌ని మండిప‌డ్డారు. ఈ మేర‌కు ఓ ఆంగ్ల పత్రిక‌కు రాసిన వ్యాసంలో కేంద్ర ప్ర‌భుత్వంపై సోనియా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

"న్యాయ‌మైన డిమాండ్ల కోసం విద్యార్థులు ఆందోళ‌న చేస్తున్నారు. ప్ర‌భుత్వ జ‌వాబుదారీత‌నాన్ని, విద్యా సంస్క‌ర‌ణ‌ల‌ను డిమాండ్ చేస్తున్నారు. కానీ మోదీ ప్ర‌భుత్వం వారి ధైర్యానికి పిరికిపంద చ‌ర్య‌లు, క్రూర‌త్వంతో స‌మాధానం ఇస్తోంది. యువ‌త‌ను దేశ భ‌విష్య‌త్తు వార‌సులుగా కాకుండా దేశ శ‌త్రువులుగా చూస్తోంది" అని సోనియా ఆరోపించారు.

పేప‌ర్ లీకేజీలు, విద్యావ్య‌వ‌స్థ‌లో అక్ర‌మాల‌కు వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా విద్యార్థులు చేప‌ట్టిన శాంతియుత నిర‌స‌న‌లు మ‌రింత ఉధృత‌మ‌య్యాయ‌ని చెప్పారు. ఢిల్లీ పోలీసులు, కేంద్ర బ‌ల‌గాలు లాఠీఛార్జ్‌, టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించి విద్యార్థుల నిర‌స‌న‌ల‌ను అణ‌చివేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. ఇలాంటి క్లిష్ట స‌మ‌యాల్లో విద్యార్థుల‌కు అండ‌గా ఉండ‌టం ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త అని సోనియా తెలిపారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరిధిలో ప‌నిచేసే పోలీసు యంత్రాంగం విద్యార్థి నిర‌స‌న‌కారుల‌పై సాగించిన హింసాకాండ కొత్తేమీ కాద‌ని సోనియా వ్యాఖ్యానించారు. 2020లో సీఏఏ-ఎన్‌ఆర్‌సీ (CAA-NRC) నిరసనల స‌మ‌యంలోనూ ఆయుధాల‌తో పోలీసులు, పారామిల‌ట‌రీ ద‌ళాలు విశ్వ‌విద్యాల‌య ప్రాంగ‌ణాల‌ను ఎలా ధ్వంసం చేశాయో అంద‌రికీ తెలుసున‌ని వ్యాఖ్యానించారు. భార‌త మ‌హిళా రెజ్ల‌ర్ల‌పై జ‌రిగిన అరాచ‌కాల‌ను దేశం ఎప్ప‌టికీ మ‌ర్చిపోద‌ని సోనియా త‌న వ్యాసంలో రాసుకొచ్చారు.

Advertisement
Advertisement