త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran | పవర్‌ ప్లాంట్ల వద్ద మానవహారాలుగా ఏర్ప‌డండి.. ట్రంప్ డెడ్‌లైన్ స‌మీపిస్తున్న వేళ యువ‌త‌కు ఇరాన్ పిలుపు

Iran | హ‌ర్మూజ్ జ‌ల‌సంధిని పూర్తిగా తెరిచేందుకు ఇరాన్ (Iran)కు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గ‌డువు స‌మీపిస్తున్న వేళ‌ ఇరాన్ అప్ర‌మ‌త్త‌మైంది. అమెరికా దాడుల నుంచి విద్యుత్ ప్లాంట్ల‌ను ర‌క్షించుకునేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్న పవర్‌ ప్లాంట్ల వద్ద మానవహారాలుగా ఏర్పడాలని (Human Chains Around Power Plants) ఇరాన్‌ ప్రభుత్వం ఆ దేశ యువతకు పిలుపునిచ్చింది.

D

International | Published On Apr 7, 2026, 11.49 am IST

Iran | పవర్‌ ప్లాంట్ల వద్ద మానవహారాలుగా ఏర్ప‌డండి.. ట్రంప్ డెడ్‌లైన్ స‌మీపిస్తున్న వేళ యువ‌త‌కు ఇరాన్ పిలుపు
Advertisement

Iran | హ‌ర్మూజ్ జ‌ల‌సంధిని పూర్తిగా తెరిచేందుకు ఇరాన్ (Iran)కు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గ‌డువు మ‌రికొన్ని గంట‌ల్లో ముగియ‌నుంది. గ‌డువులోగా ఈ జ‌ల‌సంధిని తెరవ‌క‌పోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలు (Power Plants), కీల‌క‌మైన మౌలిక స‌దుపాయాల‌పై బాంబుల‌తో దాడులు చేస్తామంటూ ట్రంప్ హెచ్చ‌రించారు. ఈ గ‌డువు ముందులాగా పొడిగించేది లేద‌ని కూడా ట్రంప్ స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో ట్రంప్ డెడ్‌లైన్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో ప‌శ్చిమాసియాలో ఆందోళ‌న‌లు మ‌రింత పెరిగాయి. ఈ జ‌ల‌సంధిని తెర‌క‌వ‌పోతే అమెరికా ఎలాంటి దాడులు చేస్తుందోన్న భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి.

ఈ నేప‌థ్యంలో ఇరాన్ అప్ర‌మ‌త్త‌మైంది. అమెరికా దాడుల నుంచి విద్యుత్ ప్లాంట్ల‌ను ర‌క్షించుకునేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్న పవర్‌ ప్లాంట్ల వద్ద మానవహారాలుగా ఏర్పడాలని (Human Chains Around Power Plants) ఇరాన్‌ ప్రభుత్వం ఆ దేశ యువతకు పిలుపునిచ్చింది. క్రీడాకారులు, క‌ళాకారులు, విద్యార్థులు స‌హా దేశ యువ‌త మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు దేశంలోని ముఖ్య‌మైన ఇంధ‌న మౌలిక స‌దుపాయాల వ‌ద్ద‌కు చేరుకోవాల‌ని ఇరాన్ క్రీడ‌లు, యువ‌జ‌న వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.

"యువత సూచన మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. దేశంలోని విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవ హారంగా ఏర్పడదామని పలువురు విశ్వవిద్యాలయ యువత, యువ కళాకారులు, యువజన సంఘాలు ప్రతిపాదించాయి. ‘ఉజ్వల భవిష్యత్తు కోసం ఇరాన్‌ యువత మానవహారం’ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని చేప‌ట్టాం" అని ఆ శాఖ ఉప మంత్రి అలీ రెజా రహీమీ పేర్కొన్నారు. దేశ మౌలిక స‌దుపాయాల‌ను ర‌క్షించ‌డంలో, ఉజ్వ‌ల‌ భ‌విష్య‌త్తును నిర్మించ‌డంలో యువ‌త‌కు ఉన్న నిబ‌ద్ధ‌త‌కు ఇది నిద‌ర్శ‌నంగా నిలుస్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

Also Read..

స్పృహ‌లో లేని మొజ్తాబా ఖ‌మేనీ..? కండిష‌న్ సీరియ‌స్‌.. ఖోమ్‌లో చికిత్స‌

ఆ రూమ‌ర్లు నిజ‌మ‌నుకున్నా - న‌య‌న్ గ‌తంపై విఘ్నేష్ శివ‌న్ సంచ‌ల‌న కామెంట్స్‌

వాట్సాప్‌లో కొత్త ఫీచ‌ర్‌.. ఇక‌పై కాల్స్ మ‌రింత స్ప‌ష్టంగా వినిపిస్తాయి..

Advertisement
Advertisement