త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Avoid Trains | రానున్న 12 గంట‌ల పాటూ రైలు ప్ర‌యాణాలు చేయ‌కండి.. ప్ర‌జ‌ల‌కు కీల‌క హెచ్చ‌రిక‌లు

Avoid Trains | ఇరాన్ ప్ర‌జ‌ల‌కు ఇజ్రాయెల్ ర‌క్ష‌ణ ద‌ళం తాజాగా కీల‌క హెచ్చ‌రిక‌లు జారీ చేసింది (Israel warns Iranians). రానున్న 12 గంట‌ల పాటూ రైలు ప్ర‌యాణాలు చేయొద్ద‌ని (Avoid Trains) హెచ్చ‌రించింది.

D

International | Published On Apr 7, 2026, 12.51 pm IST

Avoid Trains | రానున్న 12 గంట‌ల పాటూ రైలు ప్ర‌యాణాలు చేయ‌కండి.. ప్ర‌జ‌ల‌కు కీల‌క హెచ్చ‌రిక‌లు
Advertisement

Avoid Trains | మ‌ధ్య‌ప్రాచ్యంలో ఉద్రిక్త‌త‌లు ఏమాత్రం చ‌ల్లార‌డం లేదు. ఇరాన్‌పై ఫిబ్ర‌వ‌రి 28న మొద‌లైన అమెరికా-ఇజ్రాయెల్ దాడులు 39 రోజులుగా కొన‌సాగుతున్నాయి. దాడులు, ప్ర‌తిదాడుల‌తో మ‌ధ్య‌ప్రాచ్యం ద‌ద్ద‌రిల్లుతోంది. ఈ దాడుల‌తో ఇరాన్‌లోని అనేక మౌలిక స‌దుపాయాలు దెబ్బ‌తిన్నాయి. ఓవైపు కాల్పుల విర‌మ‌ణ‌కు ప్ర‌తిపాద‌న‌లు పంపుతూనే అమెరికా సైతం దాడుల‌ను కొన‌సాగిస్తోంది. శ‌త్రు దాడుల‌ను టెహ్రాను ధీటుగా ఎదుర్కొంటోంది. ఈ క్ర‌మంలో దాడులు తీవ్ర‌రూపం దాల్చాయి. ఈ నేప‌థ్యంలో ఇరాన్ ప్ర‌జ‌ల‌కు ఇజ్రాయెల్ ర‌క్ష‌ణ ద‌ళం తాజాగా కీల‌క హెచ్చ‌రిక‌లు జారీ చేసింది (Israel warns Iranians).

రానున్న 12 గంట‌ల పాటూ రైలు ప్ర‌యాణాలు చేయొద్ద‌ని (Avoid Trains) హెచ్చ‌రించింది. "మీ ప్రాణాల‌కు ముప్పు పొంచి ఉన్నందున‌.. ఇరాన్ అంత‌టా ప్ర‌జ‌లు రైలు ప్ర‌యాణాల‌కు దూరంగా ఉండాలి. భ‌ద్ర‌త దృష్ట్యా ఈ క్ష‌ణం నుంచి రాత్రి 11 గంట‌ల వ‌ర‌కూ (భార‌త కాల‌మానం ప్ర‌కారం) ఇరానియ‌న్లు రైలు ప్ర‌యాణాలు చేయ‌కండి. రైల్వే లైన్ల స‌మీపంలో ఉండ‌టం కూడా మంచిదికాదు" అని హెచ్చ‌రించింది. ఈ మేర‌కు ప‌ర్షియ‌న్ భాష‌లో ఎక్స్ వేదిక‌గా ట్వీట్ పెట్టింది. ఇక ఇజ్రాయెల్ చేసిన ఈ హెచ్చరికపై ఇరాన్ అధికారులు ఇప్పటివరకు స్పందించలేదు.

ఈ రాత్రి కాల‌రాత్రే..

కాగా, హ‌ర్మూజ్‌ను తెరిచేందుకు ఇరాన్‌కు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గ‌డువు మ‌రికొన్ని గంట‌ల్లో ముగియ‌నుంది. గ‌డువులోగా ఈ జ‌ల‌సంధిని తెరవ‌క‌పోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలు (Power Plants), కీల‌క‌మైన మౌలిక స‌దుపాయాల‌పై బాంబుల‌తో దాడులు చేస్తామంటూ ట్రంప్ హెచ్చ‌రించారు. ఈ గ‌డువు ముందులాగా పొడిగించేది లేద‌ని కూడా ట్రంప్ స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో ట్రంప్ డెడ్‌లైన్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో ప‌శ్చిమాసియాలో ఆందోళ‌న‌లు మ‌రింత పెరిగాయి. ఈ జ‌ల‌సంధిని తెర‌క‌వ‌పోతే అమెరికా ఎలాంటి దాడులు చేస్తుందోన్న భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి.

మ‌రోవైపు ఇరాన్‌ను పూర్తిగా త‌మ ఆధీనంలోకి తీసుకుంటామ‌ని ట్రంప్ స్ప‌ష్టం చేశారు. అమెరికా చేసిన కాల్పుల విమ‌ర‌ణ ప్ర‌తిపాద‌న‌ను టెహ్రాన్ తిర‌స్క‌రించిన నేప‌థ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఇరాన్‌ను ఒక్క రాత్రిలో తుడిచిపెట్టేస్తామంటూ హెచ్చ‌రించారు. ఆ రాత్రి మంగ‌ళ‌వారం రాత్రే కావొచ్చంటూ తీవ్రంగా హెచ్చ‌రించారు. దీంతో ట్రంప్ డెడ్‌లైన్‌కు మ‌రికొన్ని గంట‌లే స‌మ‌యం ఉన్న వేళ ఇజ్రాయెల్ తాజా హెచ్చ‌రిక‌లు మ‌రింత ఆందోళ‌న‌ల క‌లిగిస్తోంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సేన‌లు సంయుక్తంగా భీక‌ర దాడుల‌కు సిద్ధ‌మైన‌ట్లుగా తెలుస్తోంది.

Also Read..

పవర్‌ ప్లాంట్ల వద్ద మానవహారాలుగా ఏర్ప‌డండి.. ట్రంప్ డెడ్‌లైన్ స‌మీపిస్తున్న వేళ యువ‌త‌కు ఇరాన్ పిలుపు

స్పృహ‌లో లేని మొజ్తాబా ఖ‌మేనీ..? కండిష‌న్ సీరియ‌స్‌.. ఖోమ్‌లో చికిత్స‌

ఒక శాతం త‌గ్గిన నాన్‌వెజ్ థాలీ.. స్థిరంగా శాఖాహార భోజ‌నం ధ‌ర‌

Advertisement
Advertisement