Thali cost | ఒక శాతం తగ్గిన నాన్‌వెజ్ థాలీ.. స్థిరంగా శాఖాహార భోజనం ధర
Thali cost | గతేడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చి నెలలో మాంసాహార భోజనం (నాన్‌వెజ్ థాలీ) ధర 1 శాతం తగ్గింది. అదే సమయంలో శాఖాహార భోజనం (వెజ్ థాలీ) ధర మాత్రం యథాతథంగా ఉంది.
Thali cost | గతేడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చి నెలలో మాంసాహార భోజనం (నాన్‌వెజ్ థాలీ) ధర 1 శాతం తగ్గింది. అదే సమయంలో శాఖాహార భోజనం (వెజ్ థాలీ) ధర మాత్రం యథాతథంగా ఉంది. ఈ విషయాన్ని క్రిసిల్ తాజా రిపోర్టు (Crisil Report) వెల్లడించింది.
ఆ రిపోర్టు ప్రకారం.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పప్పుధాన్యాల ధరలు తగ్గాయి. టమాటా ధరల్లో పెరుగుదల కనిపించింది. అదేవిధంగా గ్యాస్ ధరలు, వంట నూనె ధరలు పెరిగాయి. అయితే, ఉల్లి, బంగాళా, పప్పు ధాన్యాల ధరలు తగ్గడంతో ఇంధన ఖర్చుల పెరుగదల ప్రభావం తగ్గిపోయింది. ఫలితంగా వెజ్ థాలీ (veg thali) ధరలు పెరగకుండా, తగ్గకుండా స్థిరంగా ఉన్నాయని క్రిసిల్ పేర్కొంది. మరోవైపు బ్రాయిలర్ చికెన్ (Broiler Chicken) ధరలు ఏడాది ప్రాతిపదికన సుమారు 2 శాతం తగ్గడం వల్ల నాన్ వెజ్ థాలీ (Non veg thali) ధర 1 శాతం తగ్గిందని సదరు రిపోర్టు తెలిపింది. నాన్‌వెజ్ థాలీ మొత్తం ఖర్చులో చికెన్ వాటా దాదాపు 50 శాతంగా ఉంటుందని నివేదిక పేర్కొంది.
మార్చి 2025లో కిలో రూ. 21 గా ఉన్న టమాటా ధర, మార్చి 2026 నాటికి 33 శాతం పెరిగి రూ. 28 కి చేరుకుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సాగు ఆలస్యం కావడం వల్ల దిగుబడి, సరఫరాపై ప్రభావం పడింది. ఇక నిల్వలు ఎక్కువగా ఉండటం, ఎగుమతులు తగ్గడం వల్ల ఉల్లి ధరలు గతేడాదితో పోలిస్తే 25 శాతం తగ్గాయి. ఆలస్యంగా వచ్చిన ఖరీఫ్ దిగుబడి, రబీ పంట రెండూ ఒకేసారి మార్కెట్‌లోకి రావడం వల్ల సరఫరా పెరిగి ధరలు తగ్గుముఖం పట్టాయి. డిమాండ్ తక్కువగా ఉండటంతో బంగాళదుంపల ధరలు తగ్గాయి. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రారంభ నిల్వలు (opening stocks) ఎక్కువగా ఉండటం వల్ల పప్పుధాన్యాల ధరలు 6 శాతం తగ్గాయని సదరు రిపోర్టు తెలిపింది.
Also Read..
యుద్ధం ఎఫెక్ట్.. తగ్గనున్న ప్రపంచ వృద్ధి రేటు, పెరగనున్న ద్రవ్యోల్బణం.. త్వరలో నివేదిక..
స్పృహలో లేని మొజ్తాబా ఖమేనీ..? కండిషన్ సీరియస్.. ఖోమ్‌లో చికిత్స
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



