త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Om Prakash Rajbhar | 2047 వ‌ర‌కూ అఖిలేష్ సీఎం కాలేరు.. యూపీ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Om Prakash Rajbhar | ఎంపీ అఖిలేష్ యాద‌వ్ (Akhilesh Yadav)పై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్ (Om Prakash Rajbhar) మ‌రోసారి ఆసక్తిక‌ర‌ వ్యాఖ్య‌లు చేశారు. "రాసి పెట్టుకోండి.. 2047 వరకూ సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి రాదు. అఖిలేష్ ఇప్ప‌ట్లో సీఎం అయ్యే అవ‌కాశ‌మే లేదు" అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

D

National | Published On Jun 18, 2026, 5.24 pm IST

Om Prakash Rajbhar | 2047 వ‌ర‌కూ అఖిలేష్ సీఎం కాలేరు.. యూపీ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

Om Prakash Rajbhar | స‌మాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) అధినేత‌, ఎంపీ అఖిలేష్ యాద‌వ్ (Akhilesh Yadav)పై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మంత్రి, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) చీఫ్ ఓం ప్రకాష్ రాజ్‌భర్ (Om Prakash Rajbhar) మ‌రోసారి ఆసక్తిక‌ర‌ వ్యాఖ్య‌లు చేశారు. అఖిలేష్ ఇప్ప‌ట్లో సీఎం అయ్యే అవ‌కాశ‌మే లేదంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. "రాసి పెట్టుకోండి.. 2047 వరకూ సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి రాదు. అఖిలేష్ ఇప్ప‌ట్లో సీఎం అయ్యే అవ‌కాశ‌మే లేదు" అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

సమాజ్‌వాదీ పార్టీలో చీలిక అనివార్యమని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో త్వరలోనే ఒక పెద్ద రాజకీయ భూకంపం సంభవించబోతోందన్నారు. ఆ పార్టీకి చెందిన ప‌లువురు ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నార‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో పార్టీలో త‌మ‌కు త‌గిన గౌర‌వం ద‌క్క‌డం లేద‌ని వారు భావిస్తున్న‌ట్లు చెప్పారు.

ఎస్పీ నేత‌ల్లో వ‌ణుకు..

ఐఏఎన్ఎస్ (IANS)తో రాజ్‌భర్ మాట్లాడుతూ.. మైనింగ్ స్కామ్‌, గోమతీ నదీ తీర అభివృద్ధి (గోమతీ రివర్ ఫ్రంట్) కుంభకోణాల‌పై ప్ర‌భుత్వం స‌మ‌గ్ర విచార‌ణ ప్రారంభించింద‌న్నారు. విచార‌ణ వేగం పుంజుకున్నప్పుడ‌ల్లా స‌మాజ్‌వాదీ పార్టీలో వ‌ణుకు మొద‌లవుతుంద‌ని వ్యాఖ్యానించారు. సీబీఐ ద‌ర్యాప్తు చేస్తోన్న మైనింగ్ కుంభ‌కోణం కేసులో గాయ‌త్రీ ప్ర‌జాప‌తి, అఖిలేష్ యాద‌వ్ పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు చెప్పారు. గాయ‌త్రీ ప్ర‌జాప‌తి ప్ర‌స్తుతం జైల్లో ఉండ‌గా.. అఖిలేష్ మాత్రం బ‌య‌ట ఉన్నార‌ని రాజ్‌భ‌ర్ పేర్కొన్నారు. ఈ కేసుల ద‌ర్యాప్తు తీవ్ర‌మ‌వ‌డంతో పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్న నాయ‌కుల పేర్ల జాబితాతో కూడిన లేఖ‌ను ప‌ట్టుకుని ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాద‌వ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాని క‌లిశార‌న్నారు.

వేల కోట్ల ఆస్తులను ఎలా కూడబెట్టారు..?

మైనింగ్, ల్యాప్‌టాప్ పంపిణీ, గోమతి రివర్‌ఫ్రంట్ కుంభకోణాల్లో భాగస్వామ్యం లేకపోతే ఎస్పీ నాయకులు, వారి కుటుంబ సభ్యులు వేల కోట్ల ఆస్తులను ఎలా కూడబెట్టారు..? అని రాజ్‌భ‌ర్ ప్ర‌శ్నించారు. వారు చార్టర్డ్ విమానాల్లో ఎలా ప్రయాణించగలుగుతున్నారు అంటూ నిల‌దీశారు. ఈ సంద‌ర్భంగా త‌న‌పై వేలెత్తి చూపించే వారు ముందు వారి వైపు జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు స‌మాధానం చెప్పాల‌ని రాజ్‌భ‌ర్ డిమాండ్ చేశారు.

Also Read..

మేడం జాగ్రత్త.. సాయోని వ‌స్తోంది.. కంగనా రనౌత్‌పై ఎస్పీ ఎమ్మెల్యే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

అది నేష‌న‌ల్ డిఫెక్ట‌ర్స్ అల‌య‌న్స్‌.. ఎన్డీయేకి 2/3 మెజారిటీ రాదు : జైరామ్ రమేష్

హైదరాబాద్‌లో పనీర్ తింటున్నారా? జాగ్రత్త.. అసలది పనీరే కాదు..!

Advertisement
Advertisement