త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samajwadi Party | తృణ‌మూల్‌, శివ‌సేన అయిపోయింది.. ఇప్పుడు ఎస్పీ వంతు.. అఖిలేష్ పార్టీలో భారీ చీలిక..?

Samajwadi Party | ఉత్తరప్రదేశ్ మంత్రి, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) చీఫ్ ఓం ప్రకాష్ రాజ్‌భర్ (Om Prakash Rajbhar) ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్య‌లు చేశారు. టీఎంసీ, శివ‌సేన అయిపోయింద‌ని.. ఇప్పుడు ఎస్పీ (Samajwadi Party) వంతు వ‌చ్చిందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

D

National | Published On Jun 17, 2026, 4.18 pm IST

Samajwadi Party | తృణ‌మూల్‌, శివ‌సేన అయిపోయింది.. ఇప్పుడు ఎస్పీ వంతు.. అఖిలేష్ పార్టీలో భారీ చీలిక..?
Advertisement

Samajwadi Party | ఉత్తరప్రదేశ్ మంత్రి, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) చీఫ్ ఓం ప్రకాష్ రాజ్‌భర్ (Om Prakash Rajbhar) ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్య‌లు చేశారు. టీఎంసీ, శివ‌సేన అయిపోయింద‌ని.. ఇప్పుడు ఎస్పీ (Samajwadi Party) వంతు వ‌చ్చిందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అఖిలేష్ యాద‌వ్ (Akhilesh Yadav) నేతృత్వంలోని స‌మాజ్‌వాదీ పార్టీ చీలిక‌వైపు ప‌య‌నిస్తోంద‌ని పేర్కొన్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఈ మేర‌కు ఓం ప్ర‌కాష్ రాజ్‌భ‌ర్ ఎక్స్ వేదిక‌గా సంచ‌ల‌న పోస్టు పెట్టారు. సమాజ్‌వాదీ పార్టీలో భారీ చీలిక రాబోతోంద‌ని.. ఆ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఒక లేఖ స‌మ‌ర్పించిన‌ట్లు తెలిపారు. "ఎస్పీ భారీ చీలిక‌వైపు ప‌య‌నిస్తోంది. ఆ పార్టీ నేత రామ్ గోపాల్ యాద‌వ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి లేఖ రాశారు. అందులో కొంద‌రి పేర్లు ప్ర‌స్తావించారు. వారిని తీసుకెళ్లి.. మ‌మ్మ‌ల్ని వ‌దిలిపెట్టండి అంటూ కేంద్ర మంత్రిని కోరారు. మైనింగ్ స్కామ్‌, గోమతీ నదీ తీర అభివృద్ధి (గోమతీ రివర్ ఫ్రంట్) కుంభకోణం వెనుక ఉన్న సూత్రధారి ఎవరో ఉత్తరప్రదేశ్‌లోని ప్రతి ఒక్కరికీ తెలుసు. తృణ‌మూల్ కాంగ్రెస్‌, శివ‌సేన (UBT) పార్టీ త‌ర‌హాలోనే స‌మాజ్‌వాదీలో త్వ‌ర‌లోనే పార్టీ ఫిరాయింపులు జ‌రగొచ్చు. మొత్తం ఎస్పీ (SP) అంతా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉంది" అని రాజ్‌భ‌ర్ త‌న పోస్టులో రాసుకొచ్చారు.

ఇక ఇదే విష‌య‌మై ప్ర‌ముఖ మీడియా సంస్థ ఏఎన్ఐతో కూడా మాట్లాడారు. ఎవ‌రైనా అమ్ముడుపోవ‌డానికి సిద్ధంగా ఉన్న‌ప్పుడే.. ప్ర‌జ‌లు కూడా వారిని కొనుగోలు చేస్తారంటూ వ్యాఖ్యానించారు. మీ దృష్టిని (మీడియాని ఉద్దేశించి) కేవ‌లం మ‌హారాష్ట్ర‌వైపే ఉంచ‌కండి అని పేర్కొన్నారు. ఇప్పుడు యూపీ వంతు వ‌చ్చిందంటూ రాజ్‌భ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Also Read..

న‌మ్మ‌క ద్రోహులు వెళ్లిపోనీ.. నా మాట‌ల‌ను బీప్ చేయొద్దు : సంజ‌య్ రౌత్

ప‌ద‌వుల‌ను వ‌దిలేసిన త్యాగాలు బీఆర్ఎస్‌వి.. జిరాక్స్ కాపీల‌తో గ‌ద్దెనెక్కిన మోసాలు రేవంత్‌వి : హ‌రీశ్‌రావు

దొంగను వదిలేసి బాధితుడి ఇంటికి తాళం వేశారు : టెలిగ్రామ్ బ్యాన్‌పై రాహుల్, కేజ్రీవాల్ ఫైర్

Advertisement

తాజావార్తలు

Advertisement