త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shankar Son | హీరోగా ఎంట్రీ ఇస్తోన్న డైరెక్ట‌ర్ శంక‌ర్ కొడుకు – సీక్రెట్‌గా డెబ్యూ మూవీ లాంఛ్ – హీరోయిన్ ఫిక్స్‌

కోలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఫ్యామిలీ నుంచి కొత్త హీరో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కాబోతున్నాడు. శంక‌ర్ త‌న‌యుడు ఆర్జిత్ శంక‌ర్ హీరోగా త‌మిళంలో రొమాంటిక్ యాక్ష‌న్ మూవీ తెర‌కెక్కుతోంది. ఇటీవ‌లే సెలైంట్‌గా ఈ మూవీ లాంఛ్ అయిన‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Jun 18, 2026, 5.05 pm IST

Shankar Son | హీరోగా ఎంట్రీ ఇస్తోన్న డైరెక్ట‌ర్ శంక‌ర్ కొడుకు – సీక్రెట్‌గా డెబ్యూ మూవీ లాంఛ్ – హీరోయిన్ ఫిక్స్‌
Advertisement

Shankar Son | త‌మిళ చిత్ర‌సీమ‌లోకి మ‌రో వార‌సుడు అడుగుపెట్ట‌బోతున్నాడు. కోలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు శంక‌ర్ త‌న‌యుడు హీరోగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. సీక్రెట్‌గా డెబ్యూ మూవీ లాంఛింగ్ ఈవెంట్‌ను కూడా జ‌రిపార‌ట‌. ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌ను మ‌లుపుతిప్పిన ద‌ర్శ‌కుల్లో శంక‌ర్ ఒక‌రు. పాన్ ఇండియ‌న్ సినిమాల‌కు ఒక ర‌కంగా అద్యుడిగా నిలిచారు. భారీ బ‌డ్జెట్‌లు, అత్యున్న‌త సాంకేతిక విలువ‌ల‌తో శంక‌ర్ నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు తిర‌గ‌రాశాయి.

డైరెక్ట‌ర్ అనుకొని...

కాగా శంక‌ర్ ఫ్యామిలీ నుంచి ఆయ‌న బాట‌లోనే కూతురు అదితి శంక‌ర్ అడుగులు వేసింది. హీరోయిన్‌గా తెలుగుతో పాటు త‌మిళంలో సినిమా చేసింది. తాజాగా శంక‌ర్ త‌న‌యుడు ఆర్జిత్ శంక‌ర్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ట‌. తొలుత తండ్రి మాదిరిగానే డైరెక్ట‌ర్ కావాల‌ని అనుకున్న ఆర్జిత్ శంక‌ర్ అమెరికాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేశాడ‌ట‌. ఆ త‌ర్వాత నేష‌న‌ల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో యాక్టింగ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడ‌ట‌.

న్యూ ఏజ్ రొమాంటిక్ మూవీ...

మ‌హారాజా, పార్కింగ్ సినిమాల‌ను నిర్మించిన ప్యాష‌న్ స్టూడియోస్ బ్యాన‌ర్‌లో న్యూఏజ్ రొమాంటిక్ యాక్ష‌న్ మూవీ రాబోతుంది. ఈ సినిమాలో ఆర్జిత్ శంక‌ర్ హీరోగా న‌టించ‌బోతున్నాడ‌ట‌. ఇటీవ‌లే సింపుల్‌గా ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించార‌ట‌. ఓపెనింగ్ ఈవెంట్‌కు ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ విజ‌య్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌రైన‌ట్లు స‌మాచారం. ఆర్జిత్‌, జాస‌న్ సంజ‌య్ మ‌ధ్య మంచి స్నేహం ఉంద‌ట‌. ఆ బంధాన్ని పుర‌స్క‌రించుకొనే ఈ ఈవెంట్‌కు అటెండ్ అయిన‌ట్లు స‌మాచారం.

కృతి శెట్టి...

కాగా ఆర్జిత్ శంక‌ర్ డెబ్యూ మూవీలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టించ‌బోతున్న‌ద‌ట‌. ఆర్జిత్‌, కృతి శెట్టి కెమిస్ట్రీ చాలా బోల్డ్‌గా ఉంటుంద‌ని అంటున్నారు. ఈ సినిమాతో అట్లీ శిష్యుడు అశోక్ డైరెక్ట‌ర్‌గా కోలీవుడ్‌కు ప‌రిచ‌యం కాబోతున్న‌ట్లు స‌మాచారం. ఆర్జిత్ శంక‌ర్ డెబ్యూ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంద‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

 

Advertisement
Advertisement