Tummala Nageshwar Rao | తొలకరి వర్షానికి తొందర పడకండి.. ఆగి విత్తనాలు పెట్టండి : మంత్రి తుమ్మల
Tummala Nageshwar Rao | ఈ ఏడాది రాష్ట్రంపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో వర్షాలు సమృద్ధిగా కురిసినప్పుడే విత్తనాలు పెట్టాలని రైతు సోదరులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు విజ్ఞప్తి చేశారు.
Tummala Nageshwar Rao | త్రినేత్ర.న్యూస్ : ఈ ఏడాది రాష్ట్రంపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో వర్షాలు సమృద్ధిగా కురిసినప్పుడే విత్తనాలు పెట్టాలని రైతు సోదరులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో మంత్రుల సమావేశం ముగిసిన అనంతరం మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడారు.
రైతు సోదరులకు విజ్ఞప్తి.. ఈ ఏడాది వాతావరణ కేంద్రాల హెచ్చరికలు కావొచ్చు, వాస్తవాలు కావొచ్చు.. ఎల్ నినో వల్ల వర్షపాతం తగ్గుతది.. ముఖ్యంగా దేశంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలపై ఎక్కువ ప్రభావం చూపొచ్చనే సంకేతాలు వస్తున్నాయి.. వాతావరణ కేంద్రాల నుంచి పదేపదే హెచ్చరిలు వస్తున్నాయని మంత్రి తుమ్మల తెలిపారు.
కనీసం 7 మి.మీ. వర్షపాతం రెండుసార్లు పడితే తప్ప భూమికి పదును రాదు..
తెలంగాణ రైతాంగం మొదటి వర్షం పడగానే విత్తనాలు పెట్టాలనే ఆత్రుతతో, కాలం అయిపోయిందనే ఆత్రుతతో విత్తనాలు పెడితే.. భూమిలో సరైన మోతాదులో తేమ లేకపోతే మొలకెత్తడంలో ఇబ్బంది వస్తుంది.. దీంతో కొంతకష్టం రావొచ్చు. రైతులు వ్యవసాయ అధికారుల సూచన మేరకు, మీ ప్రాంతాల్లో పడిన వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకుని, కనీసం 7 మి.మీ. వర్షపాతం రెండుసార్లు పడితే తప్ప భూమికి సరైనటువంటి పదును, తేమ వచ్చే అవకాశం ఉండదు. కార్తె అయిపోతుందనే ఆందోళనకు గురికాకుండా, వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకుని విత్తనాలు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
అడిగినంత ఇవ్వకపోయినా.. అలాట్ చేసినంత కూడా ఇవ్వడం లేదు..
ఎరువులకు సంబంధించి కేంద్రం గత రెండేండ్ల నుంచి అడిగినంత ఇవ్వకపోయినా.. అలాట్ చేసినంత కూడా ఇవ్వడం లేదు. ప్రతి నెల 2 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తామని నడ్డా ప్రకటించినప్పటికీ, కానీ ఏప్రిల్, మే, జూన్ నెలల్లో లక్ష మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ పంపించలేకపోయారు. ఇది వరకే 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, డీఏపీ సరైన సమయంలో అలాట్ చేసినంతా కూడా పంపించలేకపోయారు. పంటల కొనుగోలు విషయంలో కూడా కేంద్రం విధివిధానాలకు అనుగుణంగా భవిష్యత్‌లో పంటల కొనుగోళ్లు ఉంటాయి. ఎంఎస్పీ ప్రకటించి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఎఫ్‌సీఐ ద్వారా వరి, సీసీఐ ద్వారా పత్తి, నాఫెడ్ ద్వారా ఇతర పంటలను కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల డిమాండ్ చేశారు.
యూరియా వచ్చే విధంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం..
రామగుండంలో ఉత్పత్తి అయిన ఎరువులను ఇతర రాష్ట్రాలకు పంపించి మనకు ఇబ్బంది పెట్టడం సరికాదు. అధిక భాగం తెలంగాణకు కేటాయించాలని ఒప్పందంలో ఉన్నప్పటికీ మనల్ని కేంద్రం ఇబ్బంది పెడుతుంది. చివరకు ఆందోళన చేసైనా, ఉద్యమం చేపట్టి మనకు యూరియా వచ్చే విధంగా కేంద్రంపై ఒత్తిడి చేస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Telangana Crop Procurement | ఇది 'పేపర్‌లెస్' కాదు.. 'ఫెయిత్లెస్' క్యాబినెట్: రేవంత్ సర్కార్‌పై సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు!
- ●OU Students | ఓయూలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం
- ●Traffic Restrictions | బీ అలర్ట్.. రేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●NABARD Telangana | తెలంగాణ వ్యవసాయంలో భారీ మార్పులు: రైతుల ఆదాయం పెంచేందుకు నాబార్డ్ 'క్లైమేట్ స్మార్ట్' ప్లాన్!
- ●Stamps and Registration services | రిజిస్ట్రేషన్ సేవలకు సెలవ్.. ఏయే తేదీల్లో అంటే
- ●CM Revanth Reddy | ఫ్యూచర్ లేనోడళ్ల ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాడట.. హరీశ్‌రావుపై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్

Telangana Crop Procurement | ఇది 'పేపర్‌లెస్' కాదు.. 'ఫెయిత్లెస్' క్యాబినెట్: రేవంత్ సర్కార్‌పై సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు!

OU Students | ఓయూలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం

Traffic Restrictions | బీ అలర్ట్.. రేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

NABARD Telangana | తెలంగాణ వ్యవసాయంలో భారీ మార్పులు: రైతుల ఆదాయం పెంచేందుకు నాబార్డ్ 'క్లైమేట్ స్మార్ట్' ప్లాన్!




