త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Noida Airport | నోయిడా ఎయిర్‌పోర్ట్ నుంచి.. ఈ నెల 15న తొలి ఫ్ల‌యిట్ టేకాఫ్‌..!

Noida Airport | నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం (జేవర్) నుంచి తొలి వాణిజ్య విమాన సేవలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా విమానయాన మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. విమానాశ్రయం నుంచి బయలుదేరే తొలి విమానం లక్నోకు వెళ్లనుండగా, అందులో రైతులు ప్ర‌యాణించ‌నున్నారు.

P

National | Published On Jun 14, 2026, 12.01 am IST

Noida Airport | నోయిడా ఎయిర్‌పోర్ట్ నుంచి.. ఈ నెల 15న తొలి ఫ్ల‌యిట్ టేకాఫ్‌..!
Advertisement

Noida Airport | నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం (జేవర్) నుంచి తొలి వాణిజ్య విమాన సేవలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా విమానయాన మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. విమానాశ్రయం నుంచి బయలుదేరే తొలి విమానం లక్నోకు వెళ్లనుండగా.. అందులో రైతులు ప్ర‌యాణించ‌నున్నారు. ఉదయం నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీజీసీఏ (DGCA) అధికారులు, నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (NIAL) ప్రతినిధులు, విమానాశ్రయ సీఈవో పాల్గొననున్నారు. తొలి వాణిజ్య విమానానికి అధికారికంగా జెండా ఊపి ప్రారంభించనున్నారు. వాణిజ్య కార్యకలాపాల ప్రారంభానికి ముందు విమానాశ్రయం తన ఆపరేషనల్ రెడీనెస్, యాక్టివేషన్ అండ్ ట్రాన్సిషన్ (ORAT) కార్యక్రమంలో భాగంగా పూర్తి స్థాయి ‘ఎయిర్‌క్రాఫ్ట్ టర్న్‌రౌండ్ ట్రయల్’ను విజయవంతంగా నిర్వహించింది.

జూన్ 9న ఇండిగో విమానయాన సంస్థతో పాటు ఇతర భాగస్వాముల సహకారంతో ఈ పరీక్షలు చేపట్టినట్లు విమానాశ్రయ యాజమాన్యం తెలిపింది. ఈ ట్రయల్‌లో విమానం రాక నుంచి తిరిగి బయలుదేరే వరకు జరిగే మొత్తం ప్రక్రియను అనుకరించారు. విమానాశ్రయంలోని వివిధ వ్యవస్థలు, సాంకేతిక సదుపాయాలు, సిబ్బంది సమన్వయాన్ని పరీక్షించారు. ఇందులో విజువల్ డాకింగ్ గైడెన్స్ సిస్టమ్ (VDGS), ప్యాసింజర్ బోర్డింగ్ బ్రిడ్జ్‌లు, గ్రౌండ్ పవర్ సిస్టమ్‌లు వంటి కీలక మౌలిక సదుపాయాల పనితీరును పరిశీలించారు. బ్యాగేజీ నిర్వహణ, కార్గో ఆపరేషన్లు, విమానాల్లో ఆహార సరఫరా, గ్రౌండ్ హ్యాండ్లింగ్ కార్యకలాపాలు, ఇంధనం నింపే విధానాలను కూడా పరీక్షించారు. విమానాల ల్యాండింగ్‌కు అవసరమైన ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ILS), రిక్వైర్డ్ నావిగేషన్ పర్ఫార్మెన్స్ (RNP) విధానాలను ధ్రువీక‌రించారు. జూన్ 15 నుంచి జేవర్ విమానాశ్రయం నుంచి వాణిజ్య సేవలను ప్రారంభించే తొలి విమానయాన సంస్థగా ఇండిగో నిలవనుంది. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో ఇది మూడో విమానాశ్రయం కావడం విశేషం.

లక్నో–నోయిడా–బెంగళూరు–నోయిడా–లక్నో మార్గంలో విమానాలు నడపనున్నట్లు ఇండిగో ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం 6E 2278 విమానం ఉదయం 7.05 గంటలకు లక్నో నుంచి బయలుదేరి 8.05 గంటలకు నోయిడా చేరుకుంటుంది. అనంతరం 8.35 గంటలకు బెంగళూరుకు బయలుదేరి 11.05 గంటలకు అక్కడికి చేరుకుంటుంది. విమానాశ్రయం కార్యకలాపాలు స్థిరపడిన తర్వాత నోయిడా నుంచి దేశంలోని 16పైగా నగరాలకు ప్రత్యక్ష విమాన సర్వీసులను దశలవారీగా ప్రారంభించనున్నట్లు ఇండిగో వెల్లడించింది. బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలతో పాటు అమృత్‌సర్, చండీగఢ్, ధర్మశాల, జైపూర్, లక్నో, నవీ ముంబ‌యి, పంత్‌నగర్, శ్రీనగర్ వంటి రెండో, మూడో శ్రేణి నగరాలను అనుసంధానించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విమాన టికెట్ల బుకింగ్‌ను దశలవారీగా సంస్థ వెబ్‌సైట్, మొబైల్ యాప్, అధికారిక ట్రావెల్ భాగ‌స్వాముల‌తో అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు చెప్పింది. ఇదిలా ఉండ‌గా.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈ ఏడాది మార్చి 28న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంత అభివృద్ధికి ఈ విమానాశ్రయం కీలక మౌలిక సదుపాయంగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement