CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి బర్త్‌డే ఫ్లెక్సీ దగ్ధం.. రగిలిన వర్గ విభేదాలు
CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన శుభాకాంక్షల ఫ్లెక్సీని అర్ధరాత్రి వేళ పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన శుభాకాంక్షల ఫ్లెక్సీని అర్ధరాత్రి వేళ పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని వర్గల్ మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ప్రధాన కూడలిలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే అర్ధరాత్రి సమయంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ముఖ్య అనుచరుడు, స్థానిక సర్పంచ్ భర్త దాసరి యాదగిరి ఈ ఫ్లెక్సీపై పెట్రోల్ పోసి నిప్పంటించారని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఉదయం చూసేసరికి సీఎం ఫ్లెక్సీ పూర్తిగా దగ్ధమై ఉండటంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్లెక్సీని స్వపక్షంలో ఉన్న మరో వర్గమే ఇలా తగలబెట్టడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చర్యపై వర్గల్ మండల యూత్ కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చిత్రపటాన్ని అవమానించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గౌరారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
తాజావార్తలు
- ●Stock Markets | సెన్సెక్స్ 773 పాయింట్లు జంప్.. 25,250 దాటిన నిఫ్టీ..
- ●Union Cabinet | రూ.77,101 కోట్లతో కేంద్రం భారీ ప్యాకేజీ
- ●Mutual Funds | మ్యూచువల్ ఫండ్లలో భారీగా పెట్టుబడులు.. ఒక్క నెలలో రూ.1.73 లక్షల కోట్ల ఇన్ఫ్లో..
- ●Bhu Bharati | భూభారతి రిఫండ్లలో అధికారుల నిర్వాకం..
- ●Kedarnath | కేదార్నాథ్ ఆలయ తలుపులు మూసివేత.. ఉఖీమఠ్కు బయల్దేరిన ఉత్సవ పల్లకి
- ●Telangana | వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విధానం అమలు : సీఎం రేవంత్ రెడ్డి

Stock Markets | సెన్సెక్స్ 773 పాయింట్లు జంప్.. 25,250 దాటిన నిఫ్టీ..

Union Cabinet | రూ.77,101 కోట్లతో కేంద్రం భారీ ప్యాకేజీ

Mutual Funds | మ్యూచువల్ ఫండ్లలో భారీగా పెట్టుబడులు.. ఒక్క నెలలో రూ.1.73 లక్షల కోట్ల ఇన్ఫ్లో..

Bhu Bharati | భూభారతి రిఫండ్లలో అధికారుల నిర్వాకం..






